భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రినాధ్‌కుమార్, కాళ్ళకూరు (ప.గో.)
ప్ర:నా కుడి కన్ను మసక మసకగా కనిపిస్తుంది. ఆపరేషన్ చేయించుకోమంటున్నారు. మీ సలహా ఏమిటి?
సమా:జన్మ జాతకంలో రవి దోషం ఉన్నప్పుడు కంటి సమస్యలూ, దృష్టి లోపమూ ఉంటాయి. సమర్థులైన పండితులతో ఆదిత్య హృదయం నలభై రోజులు పారాయణ చేయించండి. ఆదివారాలు - ఉపవాసమూ శ్రేష్ఠం. వైద్యరీత్యా హోమియో పద్ధతిలో మంచి వైద్యుణ్ణి సంప్రదించండి. ఆపరేషన్ అవసరం లేకుండానే బాగుపడే అవకాశం ఉంది. ప్రతిరోజూ చిటికెడు త్రిఫలాచూర్ణం నీళ్ళలో వేసుకొని తాగండి. గుణమిస్తుంది. విటమిన్ డి లోపం తగ్గిస్తుంది.
జంధ్యాల కిరణ్మయి, మచిలీపట్నం (కృష్ణా)
ప్ర:వృద్ధాప్యంలో ఉన్నాను. అయినా శరీరం స్వాధీనంలోనే ఉంది. స్వతంత్రంగా ఉండగలిగే స్థితిలోనే ఉన్నాను. సంతానం తమతో ఉండమని బలవంత పెడుతున్నారు. మీ సలహా ఏమిటి?
సమా:వృద్ధాప్యంలో తన వారి దగ్గర ఉండటమే ధర్మం- క్షేమం. అయితే వాత్సల్యానురాగాలు కరవైతే మాత్రం మీ శరీరం సహకరించినంతకాలం మీకు మనశ్శాంతి దొరికే విధంగా స్వతంత్రంగా ఉండండి.
సూజారి శేఖర్, ఆర్మూరు, నిజామాబాద్
ప్ర:మా నాన్నగారి పాత యింటిలో ఉంటున్నాను. నాకుగా స్వతంత్ర గృహయోగం ఉందా?
సమా:మీకు దక్షిణ దిశలో దూర ప్రాంతంలో స్ర్తి మూలకంగా నూతన గృహయోగం ఉంది.
సజ్జా కార్తీక్, తణుకు (ప.గో)
ప్ర:ఉద్యోగంలో స్థిరత్వం- ఆర్థికంగా ఉన్నతి- స్వగృహయోగం?
సమా:ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలోనే 2017 చివరి భాగంలో స్థిరపడతారు. క్రమక్రమంగా అభివృద్ధికి వస్తారు కుటుంబ పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆలస్యంగా మంచి స్వగృహయోగం ఉంది.
టి.హరికృష్ణ, ప్రొద్దుటూర్, కడప
ప్ర:బంధువులందరికంటే మిన్నగా అష్టైశ్వర్యాలతో తులతూగాలి. ఏం చేయమంటారు?
సమా:మీ ప్రశ్నలో బంధువుల ప్రసక్తి అనవసరం. ప్రతివారికీ వారి వారి అదృష్టయోగాలుంటాయి. మీ వరకు మీరు వీలయితే ఎవరైనా సిద్ధపురుషుని మహాత్ముని ఆశ్రయించి ‘కాంచన బాలామాలా’ మంత్రోపదేశం పొంది శ్రద్ధతో ఉపాసించండి. అష్టైశ్వర్యాలేంటి సకలైశ్వర్యాలు లభిస్తాయి.
విస్సాప్రగడ నాగవైష్ణవి, రాజమండ్రి (తూ.గో)
ప్ర:నేను చదువులో బాగా రాణించాలంటే ఏం చేయాలి?
సమా:‘‘క్షణశః కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్’’ అన్నది పెద్దల వాక్యం. క్షణము వృధా పోకుండా విద్యార్జన చేయాలి. కణం వృధా పోకుండా ధనార్జన చేయాలి- దైవానుగ్రహం కోసం భాసర సరస్వతీ క్షేత్రాన్ని కాని- కర్నాటకలోని మూకాంబికా క్షేత్రాన్ని కూడా దర్శించండి.
కె.ఉమాశంకర్, గుంతకల్, అనంతపురం
ప్ర:ఉద్యోగం రాగలదా? ఇల్లు తీసుకోగలనా?
సమా:రెండూ మీకు అనుకూలంగానే ఉన్నాయి. శుభం భవతు!
పి.వర్థిని, కోటపాడు, విశాఖపట్నం
ప్ర:మా భర్తగారి పేరున వ్యాపారం కలసిరావటంలేదు. మా పేరున బాగుంటుందా?
సమా:తాత్కాలికంగా మీ భర్తగారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. 2017 చివరలో బాగా కుదురుకుంటుంది. మీ పేరు కంటే మీవారి పేరే అనుకూలం. చిన్న పిల్లల దుస్తులు స్కూలు యూనిఫాం కాంట్రాక్టులు- అలంకార ద్రవ్యాలు వంటి వ్యాపారం బాగుంటుంది. అంతగా అయితే ఇద్దరి పేరున రిజిస్టర్ చేయించండి.
ఎం. ఉమామహేశ్వరి, కర్నూలు
ప్ర:నా జన్మ తేదీ జూలై ఆరు, 1964. నిద్రలో దడ, భయము, ఉలికిపాటుతో నిద్ర లేస్తాను. చమట కూడా పడుతుంది. దీనికి పరిష్కారం చెప్పండి.
సమా:జాతక రీత్యా మీకు చంద్రదోషం, బుధదోషం ఉంది. ప్రతి విషయాన్ని ప్రతికూల దిశలో విపరీతంగా ఆలోచించటం- మీ మానసిక బలహీనత. ఏవో కొన్ని స్ర్తి మూలకంగా కాని- ఆస్తి మూలకంగా గాని సమస్యలు మిమ్మల్ని కలవరపెడుతున్నాయి. ప్రతి రోజూ ఉదయం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పడుకునే ముందు పంచముఖ ఆంజనేయస్వామిని ఎదురుగోడకు తగిలించుకొని నమస్కరించి పడుకోండి. అంతా కుదురుకుంటుంది. వీలయితే ప్రతి సోమవారం ఆరు కమలా ఫలాలు దేవాలయంలో అమ్మవారికి సమర్పించండి.
కె.శ్రీనివాస్, బెల్లంపల్లి, ఆదిలాబాద్
ప్ర:నేను దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నాను. అనాయాస మరణానికి ఉపాయం చెప్పండి? లేదా నివారణ చెప్పండి!
సమా:కాల స్వరూపుడు ఈశ్వరుడు- మృత్యుంజయుడు అమృత్యుహరుడు శంకరుడు- ప్రతిరోజూ శివలింగానికి యధాశక్తి పంచామృతాలతో శివపంచాక్షరి జపిస్తూ అభిషేకం చేసి పవిత్రమైన చోట లభించిన గరికను శివలింగ మస్తకంపైన పెట్టండి- చీమలకు బియ్యపు పిండి వేయండి. అంతా శుభం జరుగుతుంది.
ఎస్.వాసుదేవరెడ్డి, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం
ప్ర:మా అబ్బాయి సివిల్స్‌లో విజయం?
సమా: సంఖ్య మీ అబ్బాయి చెప్పినదై ఉండాలి. మీరు కాదు.
చింతా వెంకట సత్యనారాయణ, రాజమండ్రి (తూ.గో.)
ప్ర:శరీరంలో ఎలర్జీకి ఆధ్యాత్మిక కారణమేమిటి?
సమా:వైద్య సంబంధంగా అన్ని పరీక్షలు చేసి, చికిత్స పొందినా వైద్యానికి అందకపోతే కుదరకపోతే ప్రతిభగల చర్మ రోగ నిపుణుడు కూడా విఫలమైతే- అది ఏదైనా దేవతా సంబంధమైన మొక్కు కాని- పితృకర్మల్లో లోపం కాని కారణం అయి వుంటుంది. ఆత్మపరిశీలన చేసుకోండి.
దార్ల శివశ్యామల, రాయవరప్పాడు (కృష్ణా)
ప్ర:మా తల్లిదండ్రులకు ఇద్దరం ఆడపిల్లలం- మా తండ్రి కాలం చేసారు. తల్లిదండ్రుల ఆస్తిగాని, ధనం కాని మాకు దక్కుతుందా?
సమా: మీ నాన్నగారి ఆస్తి స్వార్జితమై, ఏ విధమైన విల్లు రాసినా అది వారికి చెందుతుంది. అనువంశికమైతే కాని ఆయన వీలునామా రాయకుండా ఉంటేకాని మీ హక్కు ఎక్కడకూ పోదు. ఇంతకూ మీ అమ్మగారి ప్రసక్తి చెప్పలేదు.
కె.ఎస్.పవన్‌కుమార్, విజయవాడ (కృష్ణా)
ప్ర:నా ఆరోగ్యం- శేష జీవితం- ఎలా వుంటుంది?
సమా:జీవితం సంఘర్షణాత్మకం- ఆరోగ్యం ప్రమాదాల నుండి జాగ్రత్తగా ఉండండి.
వి.వేణుగోపాల శర్మ, కర్నూలు (ఆం.ప్ర.)
ప్ర:ఆరోగ్యం- మానసిక బాధలు- ఎప్పుడు తీరతాయి?
సమా:్ధ్యనయోగం సాధన చేయండి. ప్రతిరోజూ కనీసం రెండు గంటలు భగవద్గీతా పారాయణం తాత్పర్యంతో చదివి మననం చేసుకోండి. చాలా మార్పు వస్తుంది.
వి.కె.సునీల్‌కుమార్ ఆదిరాజు- అల్లూరు (కృష్ణా)
ప్ర:నాకు వాహనయోగం ఎప్పుడు?
సమా:రాగల శ్రావణ- కార్తీక మాసాలలో అవకాశం ఉంది. వీలయితే ప్రతిరోజూ దుర్గాదేవిని ఎఱ్ఱ గనే్నరు పూలతో అర్చించండి.
రంజిత్‌కుమార్, గిద్దలూరు (ప్రకాశం)
ప్ర:కలిసివచ్చే వ్యాపారం చెప్పండి!
సమా:జన్మస్థానానికి దూరంగా దక్షిణ ప్రాంతంలో కాని తూర్పు వైపు ప్రదేశాలలో కాని- భూమి- వ్యవసాయ సంబంధమైన వస్తువులు- చట్టబద్ధమైన వడ్డీ వ్యాపారం కాని అవకాశం వుంది. ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా ప్రయత్నించండి!
పి.హరిత - శ్రీకాళహస్తి, చిత్తూరు
ప్ర:్భర్త త్రాగుడుకు బానిస- నివారణ ఏమిటి?
సమా:త్రాగుడు అలవాటుపడటానికి మూడు కారణాలుంటాయి. ఒకటి సున్నిత మనస్కుడై మానసికంగా గాయపడటం. రెండు- స్నేహితులు మంచివారు కాకపోవటం. మూడు- జాతకంలోని వ్యసన యోగం ఉండటం. వ్యసనానికి వ్యసనమే మందు. ప్రతిరోజూ కొంచెం కొంచెం కాకరకాయ రసం తా గించటం. మద్యంమీద విరక్తి పుడుతుంది. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.
సిహెచ్.వెంకటేశ్వర్లు, బాపట్ల, గుంటూరు
ప్ర:ఆర్థిక ఇబ్బందుల్లో నుండి బయటపడటానికి ఏం చేయాలి?
సమా:ప్రతి బుధ- శనివారాలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి బూందీ లడ్డూలు నివేదన చేసి పిల్లలకు పంచిపెట్టండి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com