భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొంగులా విజయభాస్కరరావు, విశాఖపట్నం
ప్ర: జ్యోతిష శాస్త్రాన్ని నిర్వచించి చెప్పండి?
సమా: ‘జ్యోతి’ అంటే ప్రకాశము- నక్షత్రము- అని అర్థం. అయితే మరి నక్షత్ర శాస్త్రం అవుతుంది కదా? అనే ప్రశ్న వస్తుంది. అందుకే ‘ష’ కారం వచ్చి చేరుతుంది. అపుడు ‘జ్యోతంషి నక్షత్రాణ్యాధికృత్య పరిజ్ఞానం ఇతి జ్యోతిషం’ అవుతుంది. అది మానవుల మీద ప్రభావం చేస్తే ఏర్పడే ఫలిత విజ్ఞానమే జ్యోతిషశాస్త్రం- మనం చూస్తూ వున్న ఈ ప్రకృతికంతటికీ మూలం ఊర్థ్వలోకం. అంతము లేని అంతరిక్షం- నక్షత్ర మండలం- అందుకే భగవద్గీతలో ఈ జగత్తును గురించి చెపుతూ ఊర్థ్వ మూలం అధఃశ్యామం అశ్వత్థం ప్రాహార వ్యయం అన్నాడు గీతాచార్యుడు. పాశ్చాత్యులు కూడా ‘నాటెవర్ యూ సీ ఆన్ ది ఎర్త్ ఈజ్ రిప్లికా ఆఫ్ యూనివర్స్’ అన్నారు. జ్యోతిష శాస్త్రాన్ని పాశ్చాత్యులు ‘ప్రోంగ్నెస్టిక్ సైన్స్’ అంటారు. ఇది సంక్షిప్త నిర్వచనం.

పి.మహీధర్, అలబామా స్టేట్, అమెరికా (సమయం 10 గంటల 40 ని రాత్రి)
ప్ర: హెచ్-1 వీసా వస్తుందా? ఎప్పుడు రాగలదు? వివాహం ఎప్పుడు?
సమా: వీసా రావటానికి ఇంకా కొన్ని విషయాలలో ప్రభుత్వం స్పష్టత కోరుతున్నట్టుంది. ఆలస్యమవుతుంది. వివాహం 2017లో జరుగుతుంది. ఎన్- బి- కె- ఎమ్ అనే అక్షరాలు ప్రభావకారకాలు.
వొడ్నాల ప్రసాద్, జాలపల్లి, కరీంనగర్
ప్ర: నేను బి.ఇ.డి. చేశాను. టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలూ రాశాను. అయినా ఫలితం లేదు.
సమా: మీ జాతకంలో రవి బలం లేదు. రవి బలం లేకపోతే పదవీ- పలుకుబడి యోగాలు బాగుండవు. ‘పుంసాం అర్కబలం ముఖ్యం’ అంటుంది జ్యోతిషం. పురుషులకు రవి బలం బాగుండాలి. రవి బలం కోసం సూర్యోదయాత్ పూర్వం లేచి సూర్య నమస్కారాలు చేయండి. పావురాళ్లకు గోధుమ గింజలు, చీమలకు గోధుమ పిండి, కొంచెం చక్కెర కలిపి ఏదైనా రావిచెట్టు మూలంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి వేయండి. శుభం జరుగుతుంది.
ఏలె శ్రవణ్, చండూరు, నల్లగొండ
ప్ర: నేను ఆర్.ఆర్.బిలో నాన్ టెక్నికల్ ఎగ్జామ్ రాశాను. వస్తుందా?
సమా: పరీక్ష అనేది సామూహికమైనది కనుక ఇతరుల జాతకాల ప్రభావాలు కూడా ఉంటాయి. అందుచేత అదే పరీక్షా ఫలితాన్ని చెప్పలేను కాని నీ వరకు ఆలస్యంగా తూర్పు దిశలో ప్రభుత్వోద్యోగం దొరుకుతుంది.
ఎన్.శివరామయ్య, నంద్యాల, (ఆం.ప్ర.)
ప్ర: నాకు నంద్యాలనుండి నరసరావుపేటకు బదిలీ కాగలదా?
సమా: నవంబర్‌లో మీరున్న దిశ నుండి ఆగ్నేయంగా కాని నైఋతి దిశకు కాని స్థానచలనం జరిగే అవకాశం వుంది.
ఎస్.వాసుదేవరెడ్డి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం)
ప్ర:కుమారునికి సివిల్స్‌లో విజయం
సమా: ప్రథమ ప్రయత్నంలో చెప్పలేను. ఏదైనా యూనిఫాం వేసుకునే శాఖలో ఉద్యోగావకాశాలున్నాయి. ఐ.పి.ఎస్‌కు ప్రయత్నించటం మంచిది.
ఏస్.రేవంత్, ఆర్మూరు, నిజామాబాద్
ప్ర: నేను జీవితంలో ఎప్పుడు స్థిరపడగలను. నిర్మొహమాటంగా చెప్పండి.
సమా:బలమైన కాల సర్పయోగ దోషం ఉంది. ప్రతికూల రాశిలో జన్మ లగ్నంలో రాహువు, కళత్ర స్థానంలో కేతువు ఉంది. స్థానంలో చరరాశిలో స్థిరగ్రహమైన శని మీ జాతకంలోని దోషాలు. సమర్థులైన పండితులతో నివారణ శాంతి కర్మలు చేయించండి. కాదంటే వ్యక్తిగతంగా కలవండి.
జి.్భగ్యలక్ష్మి, ఆదోని, కర్నూలు
ప్ర: ప్రభుత్వోద్యోగం కాని ప్రైవేటు ఉద్యోగం కాని రాగలదా? ఎప్పుడు?
సమా: బాంకింగ్ రంగంలో కాని బోధనా రంగంలో కాని ఉద్యోగావకాశాలు ఉన్నాయి. నవంబర్‌లో శుభం జరుగును.
బి.శ్రీనివాస్, బరంపురం (ఒడిసా)
ప్ర: ఆర్థిక ఆరోగ్య సమస్యలు
సమా: గతంలో చేసిన ప్రలోభ నిర్ణయాలు కారణాలు. ఉద్యోగానికి ఈశ్వరాభిషేకం చేయండి.
కె.సుబ్రహ్మణ్యం, కాకరపర్తి, విజయవాడ
ప్ర: భార్య పట్ల తప్పు చేశాను. తండ్రి వద్దకు వెళ్లిపోయింది. ఆమె అంటే నాకు ఎంతో ప్రేమ. మళ్లీ కలుస్తామా?
సమా: తప్పక కలుస్తారు. విచారించకండి. పెద్దలు సమాధానపరుస్తారు. ఓపిక పట్టండి.
బి.నీహారిక, చిలకలపూడి (మచిలీపట్టణం)
ప్ర: 2017లో జరిగే మెడిసిన్ పరీక్షలో ఉత్తీర్ణత పొందగలనా? మంచి డాక్టర్‌ని కాగలనా?
సమా: తప్పక మీరు మంచి డాక్టర్ కాగలరు. మానవత గుర్తెరిగిన డాక్టరుగా పేరు పొందగలరు. శుభం భవతు.
తుమ్మలపల్లి కావ్య, గుడివాడ, కృష్ణ
ప్ర: నాకు ఇంజనీరింగ్‌లో సీటు రాగలదా? పూర్తిచేయగలనా?
సమా: అనారోగ్య కారణాలవలన ఆటంకాలు వస్తాయి. జాగ్రత్త అవసరం.
బి.టి.ఎన్.రావు, భుజచలపట్నం, కృష్ణా
ప్ర:అనుకొన్న చోటకు బదిలీ
సమా: బదిలీ జరుగుతుంది. అనుకొన్న చోటు సందేహమే!
కొంపల్లి ప్రభావతీదేవి, రామిరెడ్డిపేట, నరసరావుపేట
ప్ర: ఎంతోకాలంగా నా జీవితం ఒడుదుడుకులతో నడుస్తోంది. ఇకనైనా ప్రశాంతంగా ఉండగలనా?
సమా: మీ జాతకంలో ద్వంద్వ స్వభావం వుంది. అకారణంగా ప్రతిదీ సంశయిస్తూ చివరకు పరిస్థితులు ఎటు లాగితే అటు వెళ్లిపోతారు. ఆ కారణంగా వ్యతిరేకతలు ఎదుర్కొంటూ మనశ్శాంతి కోల్పోతున్నారు. నిర్దిష్ట ప్రణాళికతో నిశ్చయాత్మకంగా ఆత్మవిశ్వాసంతో వెళ్లటం అలవాటు చేసుకోండి. దానికిగాను దత్తాత్రేయ పూజ చేయండి. మేడి చెట్టుకు ప్రదక్షిణం చేయండి.
తనిదల భారతి, ఇస్కపాలెం, నెల్లూరు
ప్ర: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా వుంటుంది?
సమా: మీలో ఆత్మవిశ్వాసం ఉంది. కాని గ్రహస్థితి అనుకూలంగా లేదు. రిస్క్ తీసుకొనేది కాకుండా సెక్యూరిటీ ప్రధానమైనవి ఎన్నుకోండి. భూమి కారకుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని మంగళవారం పూజించండి.
కె.ఉమాశంకర్, గుంతకల్, అనంతపూర్
ప్ర: ఉద్యోగం ఎపుడు - ఎక్కడ - ఏదిశ
సమా: జన్మస్థానానికి దూరంగా దిక్షిణ ఆగ్నేయ దిశలు- బహుశా తమిళనాడు- నవంబర్, డిసెంబర్‌లలో.
ఎమ్.సాధన, ఆదర్శనగర్, హైదరాబాద్
ప్ర:నాకు ప్రభుత్వోద్యోగం ఎప్పుడు ఎక్కడ?
సమా: దూర ప్రదేశంలో బహుశా బెంగుళూర్ కర్నాటకలో ఉద్యోగావకాశం ఉంది. వివాహం 2017లో జరుగును.
ఎమ్.వి.ఎన్.విశాలి, బీరంగూడ, హైదరాబాద్
ప్ర: ఎన్నో కష్టాలు- ఎప్పుడు సెటిల్ కాగలం- జీవితంలో సంతోషం ఉంటాయా?
సమా: మీ ప్రశ్నలో మరొకరి ప్రమేయం కూడా కనిపిస్తున్నది. జాతకాలు వాస్తు సరిచూసుకోండి.
పంజాల ప్రేమలత, సికిందరాబాద్
ప్ర:కుమారుని వివాహం
సమా: నవంబర్‌లో పూర్తి అవకాశం కలదు.
కోడూరి సరోజ, జగ్గయ్యపేట (కృష్ణా)
ప్ర:నాకు రచయిత్రిగా పేరు పొందే యోగం ఉందా? ఉంటే ప్రయత్నిస్తాను.
సమా: ఉంటే ప్రయత్నించడం కాదు- ప్రయత్నిస్తే యోగం ఫలిస్తుంది.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com