భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.వి.ఎల్.నరసింహమూర్తి, నరసరావుపేట (గుంటూరు)
ప్ర:గజకేసరీయోగం అంటే ఏమిటి? పుష్యమీ నక్షత్ర జాతక లక్షణం ఎలా వుంటుంది?
సమా:గజఃకేసరీ యోగం అంటే జ్యోతిషశాస్త్రంలో గురుగ్రహం. చంద్రగ్రహం కలసి, కర్కాటక- ధనుస్సు- మీనరాశుల్లో ఉంటే ఘటిస్తుంది. అంతేకాక ఇరువురూ తమ తమ మిత్ర స్థానాలలో కాని- ఉచ్ఛస్థానాలలో కాని ఉండి పరస్పర వీక్షణములు కలిగి ఉన్నా కూడా గజకేసరీయోగం చెప్పవచ్చు. ఈ యోగం ఉన్నవారు గొప్పవారవుతారు. సమాజానికి బాగా ఉపయోగపడతారు. కాని వ్యక్తిగతంగా మాత్రం శ్రమపడతారు. సుఖం ఉండదు. ఒక విధం గా చెప్పాలంటే రెండు పరస్పర విరుద్ధమైన ఉత్తమ లక్షణాల సంఘర్షణ వీరి జీవితంలో ఏర్పడుతుంది. గజము (ఏనుగు)- కేసరి (సింహము) పరస్పర శత్రువులు కదా! పుష్యమీ నక్షత్ర జాతకులుగా మీది కర్కోటక రాశి, శని దశ- మనశ్శాంతి కొంచెం తక్కువ.
కె.చంద్రశేఖర్ - పేనుమాక - గుంటూరు
ప్ర:ఉద్యోగ విషయం
సమా:శ్రద్ధగా చేస్తూ ఉండండి. పర్మినెంట్ అవుతుంది.
ఎన్.రామచంద్రారెడ్డి (ట్రస్టీ చైర్మన్),
వెంకటేశ్వర దేవాలయం, అనంతాద్రి, మానుకోట
ప్ర:మా దేవాలయ పూజారి సలహా ప్రకారం పుష్కర బ్రహ్మోత్సవానికి ఆమోదం తెలిపారు. అందరి సహకారము లభించునా? చేయగలమా?
సమా:దైవకార్యానికి సంకోచాలు- సందేహాలు పనికిరాదు. సత్సంకల్పానికి దైవం తప్పక సహకరిస్తాడు. అందునా కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి కార్యానికి ఎవరు మాత్రం అడ్డుచెపుతారు. చక్కగా కొనసాగించండి. నమో వేంకటేశాయ.
గజానన్ మహరాజ్, నిజామాబాద్ (తెలంగాణ)
ప్ర:పండిట్‌జీ! గణేశ్‌జీ మూర్తి పాలు తాగటం అనేదాన్ని గురించి మీరేమంటారు చెప్పండి?
సమా:గణేశ్‌మూర్తి పాలు తాగటం- మేరీమాత పాలు తాగటం- తాబేలు దేవుని చుట్టూ తిరగటం- ఇలాంటి సంఘటనలన్నీ కూడా భాద్రపదమాసంలోనే జరుగుతుంటాయి. వార్తలు వస్తూ ఉంటాయి. భాద్రపదంలో రవి కన్యాణీతుడైనప్పుడు మరణించిన ఆత్మలు భూమికి వాయురూపంలో కాని ‘ఈదరియల్’ బాడీలుగా గాని చేరుకుంటాయి. అందులో కర్మహీనంగా చనిపోయిన అశాంతితో అలమటించే ఆత్మలు- భౌతికవాసనలు పోని ఆత్మలు -ప్రేత త్వం పోని కారణంగా మనం సమర్పించిన పాలు గ్రహిస్తాయి. అది గణేశుడు తాగాడని మనమనుకుంటాం. అందుకే అనాథ ప్రేతలకు తప్పక సం స్కారం చేయాలని మన పితరు దేవతలను శ్రద్ధాదులు ఈ మహాలయంలో పెట్టాలని పెద్దలు నిర్దేశించారు. ‘పితృమేధసారం’ అనే గ్రంథం ఆధారంగా.
పైడి సాయితేజ, గుడివాడ, కృష్ణా
ప్ర:విద్యా విఘ్నాలు-
సమా:కాణీపాక విఘ్నేశ్వరుని వద్ద పదకొండు రోజులు భక్తిశ్రద్ధలతో సేవించండి. ఆ తరువాత బాసర సరస్వతీ క్షేత్రంలో మూడు రోజులు శ్రద్ధ్భాక్తులతో దీక్ష చేయండి. మీలో ‘అద్భుతమైన మార్పు’ వస్తుంది.
ఎమ్.గాయత్రి, విజయవాడ, కృష్ణా
ప్ర:బాల్య వివాహం విచ్ఛిన్నమైంది. నాకు మళ్లీ వివాహయోగం వుందా?
సమా:మీ జాతకంలో- కుజ- శుక్ర - శని దోషాలు ఉన్నాయి. మంగళవారం ఏకభుక్తంగా ఉపవసించి నాలుగు వారాలు సుబ్రహ్మణ్యేశ్వరవ్రతం చేయండి. ఆ తరువాత పదకొండు శుక్రవారాలు సంతోషీమాత వ్రతం చేసి మూడు పాలకోవా పాకెట్లు (పావుకిలో చొ.) రెండు - రెండూ - రెండుగా రూపాయల దక్షిణతో ముగ్గురు బ్రాహ్మణ ముత్తయిదువలకు దానమివ్వండి. శుభం జరుగుతుంది.
నాయని ప్రభాకరరెడ్డి, మహబూబాబాద్ (వరంగల్)
ప్ర:మా అన్నదమ్ముల మధ్య పరిష్కారమెప్పుడు?
సమా:వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరిలో జరుగుతుంది- మీకు వ్యక్తిగతంగా అన్నదమ్ముల వలన శుభమే జరుగుతుంది.
మండాల అరవింద్, గుడివాడ (కృష్ణా)
ప్ర:నా స్వంత సంపాదన ఉద్యోగం వలననా? వ్యాపారం వలననా?
సమా:ఉద్యోగమే- వ్యాపారం అనుకూలం కాదు.
తేలపూడి ఆదినారాయణ, జగ్గయ్యపేట (కృష్ణా)
ప్ర:ఇరవై సం.లనుండి వ్యాపారం చేస్తున్నాను. ఎదుగుదల లేదు. అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి?
సమా:మీ జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేడు. సంకష్టహర గణేశవ్రతం చేసి సిద్ధ లక్ష్మీగణేశ యంత్రం వ్యాపార స్థానంలో పెట్టుకుంటే అభివృద్ధి కలుగుతుంది.
బి.బాలసుబ్రహ్మణ్యం, బుడిగిపెంట (చిత్తూరు)
ప్ర:ఒక ఉద్యోగానికి రాజీనామా చేశాను. మరో ఉద్యోగంకోసం ఎంత ప్రయత్నించినా దొరకటంలేదు. తిరిగి ఉద్యోగం లభించగలదా?
సమా:మొదటి ఉద్యోగం వదిలివేయటం మీరు చేసిన పొరపాటు. ఆ చరిత్ర కారణంగానో మరో ఉద్యోగం లభించటం లేదు. అయినా కూడా దూర ప్రాం తంలో ఎండోమెంట్ శాఖలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది- ఆలస్యంగా.
ఎమ్.జయశ్రీ, పాలకొల్లు, ప.గో.
ప్ర:వివాహ విషయం
సమా:మీరు భావిస్తున్న విధంగా బలమైన కుజదోషం- అష్టమ కర్కాటక శని దోషాలు బలంగా వున్నాయి. అయితే వివాహ విషయంలో నవాంశ లగ్నం చాలా ప్రధానం. ఏమైనా దోష పరిహారానికి నిరంతరంగా జరిగే దీక్ష ఉండాలి. ఎప్పుడో కొన్ని పూజలు సరిపోవు. ‘స్వయంవర కళాసౌభాగ్య లలితా యంత్ర రక్షాధారణ’ ఉత్తమం. మంగళవారం - శనివారాలు ఏకభుక్త ఉపవాస దీక్ష పాటించండి.
ఎమ్.అమ్ములు, నరసాపురం (ప.గో.)
ప్ర:శనిదోషాలు - దారిద్య్రం పోవాలంటే ఏం చేయాలి?
సమా:శ్రీవేంకటేశ్వర శనివార వ్రతం- శని దోషాలను పరిహారం చేస్తుంది. అది చేయండి.
ఎమ్.స్వరూప, సరిపల్లె, (ప.గో.)
ప్ర:నా భూమి పరుల ఆక్రమణలో వుంది. ఏం చేయాలి?
సమా:పూర్తి వివరాలు తెలియనిదే దోషాన్ని నిర్థారించలేను. చెప్పలేను.
భార్గవి, ప్రకాశం జిల్లా (ఊరిపేరు లేదు)
ప్ర:పునర్వివాహం ఎప్పుడు?
సమా:పూర్వం జరిగినదాని ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు.
శ్రీ్ధర రాజేశ్వరి, గుంటూరు (ఆం.ప్ర.)
ప్ర:శారీరక అనారోగ్యం- ఎప్పుడు ఏదో ఒక బాధ.
సమా:నలభై రోజులు సద్బ్రాహ్మణుని చేత సశాస్ర్తియంగా సుందదరకాండ పారాయణం చేయించండి. మీకు మీరుగా ప్రతి రోజూ మూడు పూటలా హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆరు అరటిపండ్లు ఆంజనేయస్వామికి నివేదన చేయండి.
జి.వెంకట సుబ్బయ్య, హిందూపురం (ఆం.ప్ర)
ప్ర:ఉద్యోగ నిర్వహణలో చీకాకులు- కోర్టు తీర్పు అమలు జరుగుతుందా?
సమా:ఉద్యోగం అనే మాటకు నేటి కాలంలో సర్వీసు- అంటే సేవ- ప్రతి సర్వీసులోనూ సాధక బాధకాలుంటాయి. కొన్ని సమస్యాత్మక శాఖలుంటా యి. అటువంటివాటిలో సమయోచితంగా వ్యవహరించాలి. ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతం’ అనే సుమతి శతకపద్యం గుర్తుపెట్టుకోండి. కోర్టు తీర్పు ఆలస్యం.
పామర్తి నాగభూషణం, మచిలీపట్నం, ఆం.ప్ర.
ప్ర:కుమారుడి జీవిత సమస్యలు
సమా:ఎప్పుడో ఒకప్పుడు స్ర్తి మూలకంగా వివాదంలో చిక్కుకోవటమో- అవమానం పొందడమో జరిగినట్టుంది. గ్రహస్థితులు కూడా బాగా లేవు. వీలయితే వ్యక్తిగతంగా కలవండి. లేదా ఫోన్లో సంప్రదించండి.
విన్నకోట సత్యనారాయణ, సికింద్రాబాద్
ప్ర:క్రింద పడ్డాను- నొప్పి తీవ్రంగా ఉంది. ఎప్పుడు బాగుపడతాను?
సమా:మరోసారి ప్రమాదం జరిగే అవకాశం వుంది- జాగ్రత్తగా ఉండండి. లేదా ఏదైనా వాగ్వాదంలో ఆవేశపడే సందర్భం కూడా కలగవచ్చు. శాంతంగా ఉండండి. ఆంజనేయస్వామికి ప్రతి మంగళ శనివారాలు మన్యుసూక్తంలో అభిషేకం చేయించి వడమాల- పాయస నైవేద్యం చేయించండి. శుభం కలుగుతుంది.

సేట్ బ్రిజ్‌మోహన్‌దాస్, చందూలాల్ బారాదారి, హైదరాబాద్
ప్ర:మా కుమారుని వివాహం- రాజస్థానీ కుండలి జాతకం పంపిస్తున్నాను. దయచేసి చెప్పండి.
సమా:మొదట జరిగిన కొన్ని సంఘటనలు ఆటంకంగా ఉన్నాయి. వ్యక్తిగతంగా కలిస్తేనే వివరించగలను. స్థానికులే కనుక వ్యక్తిగతంగా కలవండి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

- ఉమాపతి బి.శర్మ సెల్: 9246171342