భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్.నరసింహారావు, విజయవాడ (ఆంధ్ర)
ప్రశ్న:సిద్ధాంతిగారూ! మీరు చెప్పినట్లుగా (పదినెలల క్రిందట) ఈ సంవత్సరం నా కోర్టు సమస్య నాకనుకూలంగానే తీర్పు వచ్చింది. మీ భవిష్యద్వాణికి నమోవాకాలు. అయితే ఇది మధ్యంతర తీర్పని తుది తీర్పు మేలో రాగలదని మా లాయర్‌గారు చెప్పారు. దయచేసి దాని గురించి చెప్పండి.
సమాధానం:అది కూడా మీకు అనుకూలంగానే ఉండగలదు. మధ్యంతర తీర్పు రాబోయే తీర్పుకు ‘కోరాబరేటివ్’గా ఉపయోగపడుతుంది.
ఎ.శేషాద్రిరెడ్డి, కిర్‌కేరా (అనంతపురం)
ప్ర:గురువుగారూ! మీరు సూచించిన గృహ వైద్యం పాటిస్తున్నాను. గుణం కనిపిస్తున్నది. రాబోయే సంవత్సరంలో ఆర్థిక సంబంధంగా అభివృద్ధికి సూచనలివ్వండి.
సమా:మీ యింట్లో మీ కులదేవత ఫొటోముందు లేదా విగ్రహం ముందు- వీలయితే కుబేర యంత్రం (యక్షిణీ సహితమైనది) సంపాదించిగాని ముందు 24 గంటలూ వెలిగే విధంగా ఆవు నెయ్యి- ఆముదము- నువ్వుల నూనె- కలిపి దీపారాధన చేస్తూ ఉండండి. నివేదనగా దీపం ముందు జిలేబి నివేదన చేయండి. చీమలకు కొంత వదిలేయండి. ఇంట్లో నిత్యశ్రీ నిత్యమంగళంగా అభివృద్ధి చెందగలదు.
పి.శంకరరావు, విజయవాడ (ఆంధ్ర)
ప్ర:అనారోగ్యం- ఎక్కిళ్లు- త్రేన్పులు- నోటివెంట లాలాజలం- గ్యాస్ట్రిక్ సమస్య- పరిష్కారం చెప్పండి.
సమా:హిందువులకు ‘వంట ఇల్లే ఒక వైద్యశాల’ అన్నాడు వినోబాభావే- మన శరీర తత్వము- పదార్థ వస్తు తత్వము తెలుసుకుంటే చిన్న చిన్న విషయాలకు డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన పని ఉండదు. నిమ్మపండురసం- జీలకర్ర- సైంధవ లవణం- అల్లం ముక్కలు నాలుగు తులములు సమానంగా తీసుకొని రాత్రి నానవేసి ఉదయం పరగడపున తింటూ ఉంటే నాలుగు రోజుల్లో అజీర్ణ వ్యాధి అంతవౌతుంది. దేవతా సేవగా ఆంజనేయస్వామికి 108 ప్రదక్షిణలు చేసి ఆదివారము నాడు తెల్ల జిల్లేడు పూలహారం- ఆరు అరటిపండ్లు నివేదన చేయించండి. మేలు జరుగుతుంది.
కె.మానేశ్వరరావు, కొత్తపేట, గుంటూరు
ప్ర:మా తాతగారు ద్వారా మాకు సంక్రమించిన స్థలములో ఇల్లు నిర్మించగలనా?
సమా:అది మీ ఇష్టాఇష్టములకు సంబంధించిన విషయం. ఇల్లు నిర్మించాలనుకుంటే స్థల వాస్తు పరీక్ష చేయించండి.
రమాదేవి- అనంతపురం (ఆంధ్ర)
ప్ర:మా అమ్మాయికి డాక్టర్ కావాలని ఉంది. కాగలదా?
సమా:కాగలదు. ఆమె నక్షత్రం వైద్య విద్యకు అనుకూలం. ఆ దిశగా ప్రణాళిక వేసుకోండి.
ఎన్.శివరామయ్య, నంద్యాల (ఆంధ్ర)
ప్ర:గ్రహణి- మధుమేహ వ్యాధి- పరిష్కారం చెప్పండి.
సమా:‘పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతి’ అని పెద్దలు చెప్పిన మాట- సమర్థుడైన పండితుని చేత ‘మహాసౌరము’ పారాయణ చేయించి తీర్థం తీసుకోండి.‘బడబానల నీలకంఠాస్త్ర యంత్ర రక్షాధారణ కూడా చాలా మంచిది. గృహ వైద్యంగా చింతగింజల చూర్ణము- నేల వేము చూర్ణము అర చెంచా అరచెంచా చొప్పున ఆవు మజ్జిగలో కలిపి పుచ్చుకుంటే గుణం కనిపిస్తుంది. ఈ చూర్ణాలు ఆయుర్వేద షాపుల్లో దొరుకును.
భగవతి - బెంగుళూరు- కర్ణాటక
ప్ర:నా భర్త వ్యాపారంలో దెబ్బతిన్నాడు. ఎప్పుడు తిరిగి బాగుపడగలడు?
సమా:మీ భర్తగారి సమస్యకు ఆయనే సంఖ్య చెప్పాలి. మీరు చెప్పిన సంఖ్య ప్రకారం గుణిస్తే 2017 చివర భాగంలో మీకు అనుకూల పరిస్థితులు రాగలవు.
ఎన్.కోటేశ్వరరావు, నర్సరావుపేట (గుంటూరు)
ప్ర:వ్యాపారంలో ఒడిదుడుకులు
సమా:వ్యాపారంలో ఒడిదుడుకులేమీ లేవు. మీరే ఒక వ్యక్తి సలహా వలననో- మోసం వలననో ధననష్టానికి గురియైనట్టు కనిపిస్తూంది. స్ర్తి మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. శివారాధన చేయండి. ప్రతి సోమవారం ఆయనకు దాణా పెట్టండి.
సి.హెచ్.ఎన్.వి.ఎస్.సత్యనారాయణ, గన్నవరం (ఆంధ్ర)
ప్ర:ఆరోగ్యం - ఉద్యోగం- కుటుంబ సౌఖ్యం-
సమా:అన్నిటికీ ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి మార్పేమీ లేదు.
తోట నిర్మల , కొత్తపేట- విజయవాడ
ప్ర:స్వంత యిల్లు ప్రయత్నం ఫలిస్తుందా?
సమా:తప్పకుండా ఫలిస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలై ఉండాలి. 2017 మధ్యభాగంలో పూర్తి ఫలితం.
ఎన్.జగదీశ్, తెనాలి (గుంటూరు)
ప్ర:ప్రభుత్వోద్యోగం-
సమా:ఆలస్యంగా దూర ప్రదేశంలో ‘్ఫల్డ్‌వర్క్’ చేసే ఉద్యోగం లభిస్తుంది.
డి.సతీశ్, విజయనగరం (ఆంధ్ర)
ప్ర:విద్యా సంస్థ పేరు మార్పు-
సమా:మీరు ఎన్నుకొన్న పేర్లు అనుకూలంగా లేవు. వీలయితే ‘దీ’ అనే అక్షరం కాని ‘దే’గా పలుకబడే అక్షరం ద్వారా కాని శుభం జరుగవచ్చు. ప్రయత్నించండి.
ఎమ్.హేమలక్ష్మి, నర్సరావుపేట (ఆంధ్ర)
ప్ర:కుటుంబ కలహాలు తీరెదెప్పుడు?
సమా:పెరిగే అవకాశమే ఉంది. సహనం వహించండి.
శ్రీమతి వారణాసి కోటేశ్వర శర్మ, బాపట్ల (గుంటూరు)
ప్ర:మావారి పేరు కోటేశ్వర శర్మ- చెన్నైలో ఉన్నారు. వేద తారా నక్షత్రం- స్థలమార్పు ఉందా?
సమా:స్థలమార్పు ఉన్నది. ప్రస్తుతం ఉన్న దిశ నుండి పశ్చిమ నైఋతి దిశలందు యోగం కలదు. శుభం
బొడ్డుపల్లి వెంకటేశ్వర శాస్ర్తీ, బాపట్ల (గుంటూరు)
ప్ర:ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం మాని మరో ఉద్యోగంలో చేరగలనా? నాకు వివాహ యోగం కలదా? లేదా? నా వయస్సు 30 సంవత్సరములు.
సమా:ప్రస్తుతం మీరు ఏవీ పెద్ద నిర్ణయములు చేయకండి. 2017 ఏప్రిల్ - మే నెలల్లో మీకు కొన్ని శుభాలు జరిగే అవకాశము ఉన్నది.
గోదాసు బాలయ్య, యాదాద్రి (తెలంగాణ)
ప్ర:నా భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా:ఈ చిన్న కాలంలో మీ పూర్తి భవిష్యత్ చెప్పటం సాధ్యమని ఎలా అనుకున్నారు. వీలయితే మీ జాతక వివరాలతో వ్యక్తిగతంగా కలవండి.
ఉప్పు సత్యనారాయణ, తెనాలి (ఆంధ్ర)
ప్ర:ప్రస్తుతం నా పరిస్థితి
సమా:ప్రస్తుతం గురువు బాగున్నాడు- కొంత మంచి జరుగగలదు. ముఖ్యంగా సంతాన విషయంలో శని మాత్రం కంటక శనిగా ఇబ్బందులు కలిగిస్తాడు. ముఖ్యంగా వృద్ధుల కారణంగా కాని- వృత్తి వ్యాపారాలలో కాని ఇబ్బందులు రాగలవు.
కె.ఎస్.ఎన్.మూర్తి, బరంపురం (ఒడిసా)
ప్ర:స్వగృహయోగం?
సమా:ఆలస్యంగా మీరున్న దిశనుండి ఆగ్నేయ దిశలో స్వగృహ యోగము కలదు. పాత యింటినే కొని పడగొట్టి నూతన గృహ నిర్మాణము చేసే యోగం సూచిస్తోంది.
జి.సాయిశ్రీ, కొత్తగూడెం (తెలంగాణ)
ప్ర:నమస్కారం గురూజీ- నాకు ప్రభుత్వోద్యోగ యోగం ఉన్నదా?
సమా:పూర్తి అవకాశాలు కన్పిస్తున్నాయి. జన్మస్థలానికి దూరంగా ఉత్తర- వాయవ్య దిశల్లో- జీవితబీమా- వైద్య సంబంధ సంస్థలు- వాటిలో దొరికే అవకాశం వుంది.
చందా మీనేశ్వరరావు, గార్ల మండలం (తెలంగాణ)
ప్ర:స్వగృహయోగం- తోట అమ్మి ఋణవిముక్తి పొందగలనా? మీ ఫోను నెంబరు తెలపండి. వ్యక్తిగతంగా కలిసి కొన్ని విషయాలు చర్చించాలి.
సమా:2017లో మీకు ధనలాభము- స్వగృహయోగం కలుగగలదు. నా సెల్ నెం.9246171342
గాయత్రి, ఖమ్మం (తెలంగాణ)
ప్ర:నాది పూర్వాషాఢ- మావారిది పుష్యమి- వివాహం జరిగింది- దోషము అంటున్నారు.
సమా:షష్టాష్టకాలయితే దోషం- అష్టషష్టకాలు దోషం కాదు- అనే వాదం ఉంది. ఏదయినా మీది కొంచెం దూకుడు స్వభావం. ఆయనది నెమ్మదితనం- అందువలన కొన్ని ఇబ్బందులు రావచ్చు. పార్వతీ పరమేశ్వరులను పూజించండి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ