భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.కుమారి, నాగరాజుపేట, (ప.గో., ఆంధ్ర)
ప్ర:నాది ఆర్ద్ర నక్షత్రం- నోటిలో ఎప్పుడూ మంటగా వుంటుంది. నీళ్ళు తాగినా మంటగానే ఉంటుంది. దీనికి పరిష్కారమేమిటి?
జవాబు: సహజంగానే ఆర్ర్దా నక్షత్రం వారికి శరీరం వేడి తత్వం- కాలేయ (లీవర్) సంబంధంగా దోషం కనిపిస్తోంది. గృహవైద్యంగా పైపూతగా జాజికాయ, గంధము తీసి నాలుక మీద రాయండి. తరువాత కడుగుకోండి. కాచిన పాలల్లో (గ్లాసు) సగభాగం నెయ్యి- తేనె కలిపి పుక్కిలించి ఉమ్మినా గుణం కనిపిస్తుంది.
అయ్యగారి చంద్రశేఖర్, రామంతాపూర్ (హై)
ప్ర:వివాహం ఆలస్యం- ఎప్పుడు కాగలదు
జవాబు: 2017లో అవకాశం పూర్తిగా ఉంది.
బ్రిజేశ్ బిజాజ్, మదనపల్లి (చిత్తూరు)
ప్ర:పండిట్‌జీ! మేరేలియే కౌన్సీ బిజినెస్ జమతాహై- ముంబయి- చెన్నై. ఇన్ దోనోంమే మై కహా ముఖద్దర్ కా సికింద్ బన్‌సక్తాహూ..
జవాబు:ఆప్ మే హిమ్మత్ హై హిక్మత్ భీ హై జరూర్ ఆప్ ముఖద్దర్ కా సికిందర్ బన్ సక్తే హై- ముంబయి సే హీ షురువాత్ కీజియే-
చంద్రావతీ టాగోర్ - సింగపూర్ (సింగపూర్)
ప్ర:సింగపూర్‌లో స్థిరాస్తి సంప్రాప్తించాలనుకుంటున్నాను- సాధించగలనా?
సమా:మీ ఆశయానికి మీ కుటుంబంలో వారే అంగీకరిస్తున్నట్టు లేరు. అనుకున్నంత సులభంగా జరగదు.
కాలేయ (లీవర్) సంబంధంగా దోషం కనిపిస్తోంది. గృహవైద్యంగా పైపూతగా జాజికాయ, గంధము తీసి నాలుక మీద రాయండి. తరువాత కడుగుకోండి. కాచిన పాలల్లో (గ్లాసు) సగభాగం నెయ్యి- తేనె కలిపి పుక్కిలించి ఉమ్మినా గుణం కనిపిస్తుంది.
అయ్యగారి చంద్రశేఖర్, రామంతాపూర్ (హై)
ప్ర:వివాహం ఆలస్యం- ఎప్పుడు కాగలదు
జవాబు: 2017లో అవకాశం పూర్తిగా ఉంది.
బ్రిజేశ్ బిజాజ్, మదనపల్లి (చిత్తూరు)
ప్ర:పండిట్‌జీ! మేరేలియే కౌన్సీ బిజినెస్ జమతాహై- ముంబయి- చెన్నై. ఇన్ దోనోంమే మై కహా ముఖద్దర్ కా సికింద్ బన్‌సక్తాహూ..
జవాబు: ఆప్ మే హిమ్మత్ హై హిక్మత్ భీ హై జరూర్ ఆప్ ముఖద్దర్ కా సికిందర్ బన్ సక్తే హై- ముంబయి సే హీ షురువాత్ కీజియే-
బి.మహేశ్‌బాబు, నల్లకుంట, హైదరాబాద్
ప్ర:నేను మూడు సంవత్సరాలుగా కాళీ మంత్రోపాసన చేస్తున్నాను. కాని సంసారంలో గొడవలు- వ్యాపారంలో నష్టం- దీనికి పరిష్కారమేమిటి?
జవాబు: ప్రప్రథమంగా కాళీ ఉపాసనకు - మీ వ్యాపార నష్టానికి ఏ మాత్రం సంబంధం లేదు. కామ్యకంగా చేసే దేవతా సేవలో ‘‘యన్న క్షేత్రే తదైవత్యాసు అధిషు కార్యం’’ అన్నది శాస్త్ర వాక్యం. కాళీ-వీరభద్రుడు- చండీ- ఆంజనేయస్వామి వంటి దేవతలు క్షాత్ర దేవతలుగా శాస్త్రం నిర్వచించింది. వ్యాపారమూ - ధన ధాన్యాభివృద్ధి- వ్యాపార లాభమూ మొదలైన కామ్యకాలకు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించాలి. లక్ష్మీ గణేశ- మహాలక్ష్మీ- కుబేరాది దేవతలు వ్యాపారానికి అధిదేవతలు- ముఖ్యంగా కర్కాటకం- ఆశే్లషా నక్షత్ర జాతకులైన మీకు లక్ష్మీ గణేశ మంత్రోపాసన చాలా శ్రేష్ఠం. అది చేయండి! ఇక సంసారంలో గొడవలకు కేవలం స్ర్తి దేవతోపాసన చేసినవారికెవ్వరికీ దాంపత్య సంబంధమైన అనుకూల్యత తక్కువ- తప్పకుండా ఈశ్వరాభిషేకం చేయాలి. అప్పుడే స్ర్తి దేవతోపాసన సిద్ధిస్తుంది. పైగా ‘ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్’ అని శాస్త్ర వాక్యం- ప్రతి రోజూ రుద్రాభిషేకం నియమంగా పెట్టుకోండి- శివాభ్యాం చూడాలంకృతకలాభ్యాం’- శివానంద లహరి శ్లోకం గుర్తుకు తెచ్చుకోండి. జాతకరీత్యా మీకు వ్యయస్థానం- ధనస్థానం పాపగ్రహణాకాంతమై ఉంది. ఈశ్వరారాధన చేయండి.
అద్దేపల్లి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ (ఆంధ్ర)
ప్ర:నాకు సంబంధించిన స్థిరాస్తులలో అన్నీ ఏదోవిధంగా ఆక్రమణలకు గురి అవుతున్నవి. పరిష్కారమేమిటి?
జవాబు:మీరు చెప్పిన సంఖ్య ప్రకారం ఆక్రమింపబడిన ఆస్తులలో యాజమాన్యపు హక్కు లోపభూయిష్టంగా కనబడుతోంది. డాక్యుమెంట్ల నమోదుల్లో లొసుగులు ఇతరులకు ఆక్రమణకు అవకాశాన్ని కలిగిస్తాయి. మీ జాతకంలో కుజ-బుధగ్రహ స్థితికి సరియైన దైవిక శాంతి, విష్ణు చండీ యాగం- అది చేయండి. సమస్యలు పరిష్కారమవుతాయి.
ఎస్.ఆంజనేయప్రసాద్, జోసెఫ్‌నగరం, అనంతపురం
ప్ర:రుణబాధలు- పరిష్కారమేమిటి?
జవాబు: ప్రతి మంగళవారం ఋణవిమోచన అంగాకర వ్రతం చేయటం ఒక్కటి సులభమార్గం. రెండవ ఋణవిమోచన పాశుపత రుద్రాభిషేకం. ఇది కొంచెం కష్టసాధ్యం- మూడవది ధనలక్ష్మీ కుబేర యంత్ర కంకణం కుడి చేతికి ధరించడం.
కె.వెంకటేశ్వరరావు, చిలకలూరిపేట, ఆంధ్ర
ప్ర:మా అబ్బాయి వెంకట నాగహనుమంతరావు ఇంట్లోనుండి వెళ్లిపోయినాడు. చాలాకాలం గడిచింది. వస్తాడా? బాగున్నాడా? తెలుపగలరు.
జవాబు:2017 జూన్-జూలైలలో అతని గురించిన వర్తమానం మీకు తెలియగలదు.
వి.లీలామనోహరి - తాడేపల్లిగూడెం (ఆంధ్ర)
ప్ర:వివాహం ఎప్పుడు?
జవాబు:2017 మధ్యభాగంలో జరుగును.
వై.రాధామాధవ్, అనంతపురం, ఆంధ్ర
ప్ర:నాలుగు సంవత్సరాలు తన దగ్గరే పనిచేస్తే తన షాపు నాకిచ్చేస్తానంటున్నాడు మా యజమాని- ఇస్తాడా?
జవాబు:ఈ సంవత్సరం మధ్యభాగంలో జరిగే ఒక మంచి సంఘటన మీ ప్రశ్నకు సమాధానాన్ని కలిగిస్తుంది. మీ సందేహం తీరుతుంది.
జి.విజయలక్ష్మి, బనగానపల్లె (కర్నూలు)
ప్ర:ఎన్ని సంబంధాలు చూసినా కుదరటంలేదు. పరిష్కారం చెప్పండి.
జవాబు:ప్రతిరోజు ఉదయం తులసీ పూజ చేసిన తరువాత శ్రీమద్భాగతంలో రుక్మిణీ కళ్యాణాన్ని పఠించండి. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా పఠించండి. త్వరలోనే వివాహం జరుగుతుంది.
ఎల్.గోవిందరాజులు, సోమందేపల్లి (అనంతపురం, ఆంధ్ర)
ప్ర:ప్రభుత్వోద్యోగ యోగం ఉందా?
జవాబు:ఆగ్నేయంగా కాని ఉత్తర వాయవ్యంగా కాని దూర ప్రాంతంలో ప్రభుత్వోద్యోగం దొరికే అవకాశం ఉంది. బహుశా తమిళనాడు- కర్నాటకలు కావచ్చు.
ఎస్.కె.దిలావర్, కొండపల్లి, కృష్ణా
ప్ర: స్వగృహయోగం- వెల్డింగ్ షాపు యోగించలేదు? ఏం చేయమంటారు?
జవాబు:వెల్డింగ్ షాప్ మీకు అచ్చిరాదు- నిప్పుతో చేసే ఏ పనీ నీకు యోగించదు. పండ్ల షాపు- కిరాణా - బియ్యం వంటివి మీకు యోగిస్తాయి. ప్రభుత్వోద్యోగం లేదా.
బి.్భజంగరావు, రావికంపాడు (ఆంధ్ర)
ప్ర:్భమి తగాదా రాజీ కుదరటలేదు.
జవాబు:రాజీ కుదరదు. కోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉంది. భౌతికమైన దాడులు కూడా జరగవచ్చు! శాంతి సహనాలతో వ్యవహరించండి. ఈ సంవత్సరం చివరలోనో, మధ్యభాగంలోనో కొంత నష్టంతో పరిష్కారం కావచ్చును.
బి.కార్తీక, నిజామాబాద్ (తెలంగాణా)
ప్ర:కలహాల కాపురం- పరిష్కారం ఏమిటి?
జవాబు: ప్రతిరోజూ ప్రాతఃకాలంలోనే తులసీవ్రతం చేయండి. తులసీకోటముందు మహావిష్ణు రథం ‘సర్వతో భద్రమనే’ యంత్రం- ముగ్గుగా వేయండి. వీలయితే వ్యక్తిగతంగా కలవండి.
కె.మోహనసాయికుమార్, పెదపూడి (తూ.గో.)
ప్ర:ప్రభుత్వోద్యోగం యోగం ఉందా?
జవాబు:మే- జూన్‌లలో ఉద్యోగ యోగం కలుగుతుంది. మీ నక్షత్రాంశ రాజాంశ జీవితం మంచి స్థాయిలోనే గడుస్తుంది. కళారంగం (సినీ) వైపు వెళ్ళే అవకాశం ఉంది. ప్రయత్నించండి.
ఎమ్.్ఫయి, పెనుమంద గ్రామం (ప.గో. ఆంధ్ర)
ప్ర:వాస్తు దోషాలున్న అద్దె ఇల్లు- ఆర్థిక బాధలు- ఎన్ని మంచి పనులు చేసినా ఫలించటంలేదు. పరిష్కారం చెప్పండి.
జవాబు:ముందు వాస్తు దోషాలు ఉన్న ఇల్లు మారండి. వాస్తు దోషం గల ఇంట్లో ఏమీ ఫలించవు.
అల్లు పాపారావు, సీతానగరం (తూ.గో)
ప్ర: ఇంటి వాస్తు వివరణ- భార్యకు ఆపద- సంతానం ఇల్లు వదలిపోవుట
జవాబు:మీరు వివరించిన ప్రకారం మీ యింటికి ఆగ్నేయ వాయువ్యాలు దోషంగా కనబడుతున్నాయి. ఆగ్నేయ దోషం ఆడువారికి- వాయవ్య దోషం సంతాన ప్రవాసము- కారణవౌతాయి. వాస్తు సవరణలు చేయించండి.
బ్రిజేశ్‌కుమార్ బజాజ్, చిత్తూరు (ఆంధ్ర)
ప్ర: (హిందీలో ఉత్తరం) హమ్ మార్వాడీ హైఁ- ఆప్‌కే జ్యోతిష్ హమ్ బహుత్ చాహతేహై. తీన్‌బార్ మై ఖత్ లిఖా- లేకిన్ ఆప్ సే జవాబ్ నహీ మిలా- ఆప్ తెల్గుమే లిఖేతో భీ హమారే దోస్త్ హమ్‌కు సమ్‌జాతేహై- దయాకర్‌కే హమే యేతో సూచనా దీజియే. మేరా కారోబారీ బొంబాయి మే జమ్‌తాహై యా నహీతో మద్రాస్‌మే- మేరా జన్మ నక్షత్ర ‘మీఘా’ సింహ్‌రాశి-
జవాబు:ఆప్‌కో ముంబాయి హీ జమ్‌దాహై- వహీఁ సేహీ షురువాత్ కరో-
శైలజా శేషాద్రి రెడ్డి, హిందూపురం (ఆంధ్ర)
ప్ర:మా భవిష్యత్తేమిటి? మా ఇబ్బందులు ఎలా తొలగుతాయి?
జవాబు:ప్రస్తుతం మీ జన్మ నక్షత్రవశాత్తు కానీ, మీ వారి నక్షత్ర రీత్యా కానీ గ్రహస్థితి బాగా లేదు.
ప్రభుత్వ వ్యవహారాలు- సంతాన సంబంధం విషయాలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. శనివార శ్రీ వేంకటేశ్వర వ్రతం చేయండి. పదకొండు వారాలు - శుభం కలుగుతుంది.
ఎమ్.గోపి, కవిటి గ్రామం (శ్రీకాకుళం)
ప్ర:స్వగృహ యోగం?
జవాబు:ఈ సంవత్సరం ప్రయత్నాలు ఫలిస్తాయి.
బి.సునీత, పెబ్బేరు (తెలంగాణ)
ప్ర:2017లో జరిగే టెట్ పరీక్షలో నెగ్గగలనా? మంచి టీచర్‌ని కాగలనా?
జవాబు:పరీక్ష వ్రాసిన తరువాత ఈ ప్రశ్న వేయండి- ముందే కాదు-
చిలుకూరి బలరామస్వామి, (ప.గో) తిరుపతి
ప్ర:జాతక పరిశీలన
జవాబు:మీ జాతకంలో శుక్రుడు మాత్రం చాలా బాగున్నాడు. సింహం అనుకూల స్థానం కాకపోయినా కుల దీపిక యోగం కలిగిస్తాడు. అయితే వ్ఢ్యౌమి ఉందా లేదా అనేది గమనించాలి. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కనుక రచయితగాకాని కళారంగంలో కాని రాణించే అవకాశం ఉంది. కుజ దోషం కొంచెం ఇబ్బందికరం. గురు- రవి- శని- రాహులు బాధకులు- శివరాధన వలన శుభములు కలుగును. ఈ సంవత్సరం ఆగస్ట్‌లో ఏదైనా మంచి మార్పు రావచ్చును.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com