భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజనాల రామలింగేశ్వరరావు, చెన్నై, తమిళనాడు
ప్రశ్న:శర్మగారూ! భవిష్యకాలంలో జ్యోతిషేతరమైన విషయాలు కూడా మీరు విశే్లషిస్తూ వుంటారు. ‘జల్లికట్టు’ మంచి సంప్రదాయమేనా?
సమాధానం:నూటికి నూరుపాళ్ళు సత్సంప్రదాయం- సంప్రదాయమంటేనే సమాజానికి మంచి చేసే అలవాటు అని అర్థం. భారతీయ సంప్రదాయాలన్నింటిలో కూడా అంతర్లీనంగా మనోవిజ్ఞాన లక్షణాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విషయం నేటి కుహనా మేధావులైన పండితమ్మన్యులకు అర్థం కాదు. క్రీడల్లో క్షాత్ర క్రీడలు- సాత్విక క్రీడలు అని రెండు రకాలు- యువకుల్లో ధైర్యసాహసాలను ప్రేరేపించేవి క్షాత్రక్రీడలు. కుస్తీ, జల్లికట్టు, వేట, కోడిపందాలు, పొట్టేలు పందాలు సాహస క్షాత్ర క్రీడలు. చదరంగం, పాచికలు- (పుంజీతం- పచ్చీసు (తెలంగాణాలో ప్రసిద్ధం) ఇవి మేధస్సును పదునుపెట్టే సాత్విక క్రీడలు. హాకీ, కబడ్డీ- ఫుట్‌బాల్ వంటివి దేహోల్లాసాన్ని పెంచేవి. అందువల్ల జల్లికట్టు సాహస క్రీడ. మానవ బలంతో పశుబలాన్ని లొంగదీసుకునే సాహస క్రీడ. ఇందులో బలంగా పెంచిన కోడెలను రెచ్చగొడతారేమో కాని హింసించరు. ఆవులను కాచేటపుడు- విద్యాబుద్ధులు నేర్పించేటపుడు, నేలను దునే్నటప్పుడు - సాహస క్రీడలప్పుడు చేసే ప్రతికూల శిక్షలు హింస కాదు - శిక్షణ. శిక్షకు - శిక్షణకు భేదం తెలుసుకోవాలి.
బి.్భషణ్‌రావు, కట్టుపొదలవారిగూడెం (ఆంధ్ర)
ప్ర:అందరికీ అన్నం పెట్టేవారి భూమి అంటే నాకు చాలా ఇష్టం. 2017లో కొనాలనుకుంటున్నాను. మంచిదేనంటారా?
సమా:్భషైన నిర్ణయం- అందరూ ధనలక్ష్మి వెంటబడుతున్న ఈ సమాజంలో మీరు ధాన్యలక్ష్మిని సాధించాలనుకుంటున్నారంటే బహుధా అభినందనీయాలు. శుభస్యశీఘ్రం- తొందరగా కొనండి. అన్నదాతగా పేరు తెచ్చుకోండి.
అప్పల నరసమ్మ, కాశీబస్తీ (శ్రీకాకుళం)
ప్ర:మా అమ్మకు నేనొక్కర్తెనీ కూతురును. ఆస్తి అంతా వేరొకరికి వ్రాసి యిచ్చింది. కోర్టులో వేశాను- గెలవగలనా?
సమా:లాయర్‌గారు చెప్పవలసిన సమాధానం. నాకు తెలిసినంతవరకు ఆస్తి ఆమె స్వార్జితమైతే వీలునామానే చెల్లుతుంది. అనువంశీకమైతే మీకూ చెందుతుంది.
కాశెట్టి రాజేందర్, ధర్మపురి (తెలంగాణ)
ప్ర:సినిమా పాటల రచయితగా నాకు అవకాశం వస్తుందా?
సమా:ముందు మామూలు రచయితగా పేరు తెచ్చుకోండి. ఆ తరువాత మీ కోరిక ప్రకారం ప్రయత్నించండి. ఏ రంగానికైనా ప్రతిభ మాత్రమే సరిపోదు. చొరవ పట్టుదల - ఓర్పు ఉండాలి.
ఎమ్.రాజేశ్‌కుమార్, కప్రా, హైదరాబాద్
ప్ర:జీవితంలో స్థిరత్వం
సమా:జాతకరీత్యా మీది చరరాశి- అందువల్ల అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఏదైనా ‘్ఫల్డ్‌వర్క్’ ఉద్యోగం ప్రయత్నించండి. ‘టేబిల్ వర్క్’ ఉద్యోగం మీకు సరిపోదు.
జి.లింగయ్య, చైతన్యపురి, హైదరాబాద్
ప్ర:స్వగ్రామంలో ఇల్లు అమ్మకం
సమా:లోగడ మీ ప్రశ్నకు సమాధానమిచ్చాను. ఇప్పుడూ అదే సమాధానం- మీ భార్య అంగీకారం లేకుండా ఇల్లు అమ్మలేరు.
ఎస్.కె.శహనాజ్ - కొండపల్లి (కృష్ణా)
ప్ర:స్వగృహ యోగం?
సమా:ఆలస్యంగా మీ సంతానము అదృష్టంవల్ల ఆగ్నేయ దిశలో సిద్ధిస్తుంది.
సంసద్, గౌరీబిద్నూరు, కర్ణాటక
ప్ర:నేను డాక్టర్‌ను కాగలనా?
సమా:పూర్తి అవకాశాలున్నాయి. గట్టిగా ప్రయత్నించండి. మంచి సర్జన్ కాగలరు.
చాట్ల వెంకటేశ్వర్లు, ప్రకాశం, చీమకురు (ఆంధ్ర)
ప్ర:ఎన్నో వ్యాపారాలు చేసాను. ఏదీ కలిసి రావటంలేదు. ఏ వ్యాపారం చేయమంటారు?
సమా:మీరు ప్రతి వ్యాపారంలోనూ వెంటనే ఫలితాన్ని ఆశిస్తూ, అందకపోతే వదిలేస్తున్నారు. తొలుత అపజయాలకు బెదిరిపోకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు ప్రయత్నించండి.
రాచపూటి చంద్రప్రసాద్‌రావు, నవాబుపేట (నెల్లూరు)
ప్ర:అనేక రకాల సమస్యలు
సమా:ప్రతీ శుక్రవారమూ సంతోషీమాత దేవాలయంలో ఆరు కోవా పేడా పాకెట్లు- ఆరు అరటిపండ్లు - ఆరు రూపాయలు సమర్పించండి.
ఎస్.రాజేశ్, సిరిసిల్ల (తెలంగాణ)
ప్ర:జీవితంలో స్థిరత్వం
సమా:ఈ సంవత్సరం ఏప్రిల్ - మే నెలల్లో కొన్ని మంచి సంఘటనలు జరుగును.
గుండు శ్రీశైలం -సిద్ధిపేట (తెలంగాణ)
ప్ర:మా యింటికి దక్షిణాన కొంత స్థలం అమ్మకం కాగలదు. కొనవచ్చునా? దక్షిణం పనికిరాదంటున్నారు.
సమా:ఆ స్థలం మీరున్నదానికంటే ఎత్తులో ఉంటే కొనవచ్చును.
ఎమ్.జ్యోతికుమారి, సిద్ధిపేట (తెలంగాణ)
ప్ర:వివాహ ప్రశ్న
సమా:ఈ సంవత్సరంలోనే జరిగే అవకాశం ఉంది. జాతకంలో గురు శుక్రులు బాగున్న కారణంగా దాంపత్య జీవితం బాగుంటుంది.
పి.సత్యనారాయణ, రాజమండ్రి (ఆంధ్ర)
ప్ర:కన్న కుమారునితో అభిప్రాయ భేదాలు
సమా:మీ సమస్యకు మీరు చెప్పినవి మాత్రమే కారణాలుగా కనిపించటంలేదు. కొన్ని స్థిరాస్తి మూలకమూ - డాక్యుమెంట్ల సంబంధము కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆలోచించండి!
ఎమ్.సి.గుర్రప్ప, తాడిపత్రి (అనంతపురం)
ప్ర:నాకు భార్యా పిల్లలు లేరు. నాకున్న ఆస్తిని ఎవరి పేరున పెట్టమంటారు? అన్న - తమ్ముడు - చెల్లెండ్రు-
సమా:మీ మనసులో చెల్లెండ్ల వైపు మొగ్గుతున్నట్టున్నారు. అలాగే కానివ్వండి. కాని అపర కర్మలకు మాత్రం అన్నదమ్ములకే అధికారముంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
అరుణాచల శేషాద్రి రెడ్డి- హిందూపురం (ఆంధ్ర)
ప్ర:తిరుపతిలో స్థిరపడాలని తిరుపతి పాలకవర్గంలో పనిచేయాలనే కోరిక నెరవేరుతుందా?
సమా:చిత్తశుద్ధి - భక్తిశ్రద్ధలే కారణమైతే స్వామి అనుగ్రహిస్తాడు. లౌకిక కారణాలు కారణమైతే మాత్రం ‘గుడికి దగ్గరైతే దేవుడికి దూరవౌతారు’ అనే సామెత వర్తిస్తుంది- ఆలోచించండి.
ఎస్.కృష్ణప్రియ - విశాఖపట్టణం - ఆంధ్ర
ప్ర:ఇల్లు అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు సమస్య- ఏం చేయమంటారు?
సమా:మీ ప్రశ్నకు సమాధానం ఐ.టి. నిపుణులు మాత్రమే చెప్పగలరమ్మా! నేను కాదు.
వి.విజయచంద్ర - వనస్థలిపురం (హైదరాబాద్)
ప్ర:రెండు వివాహాలు ఫలించలేదు. మూడవది అవకాశం ఉన్నదా?
సమా:మీ జాతకాన్ని సంపూర్ణంగా పరిశీలించాలి.
శే్వతా పాల్ పాడి- దిందిగల్ (తమిళనాడు)
ప్ర:వివాహం
సమా:జూన్ - మేలలో అవకాశం ఉంది.
ఎలిమి వెంకటేశ్ - మెదక్ (తెలంగాణ)
ప్ర:ఆర్థిక బాధలు - ఋణపీడలు - పరిష్కారం చెప్పండి.
సమా:శ్రీ వేంకటేశ్వరస్వామికి 40 రోజులు అఖండ నెయ్యి దీపారాధన- బూందీ లడ్డూ నివేదన చేయండి.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

ఉమాపతి బి.శర్మ