భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడూరి గోపీకృష్ణ, అద్దంకి (ప్రకాశం)
ప్రశ్న: ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వేప చెట్లు నాటాను. అవి నాకు లాభమేనా? వేరే పంట వేయమంటారా?
సమాధానం:తెలివిగా మార్కెటింగ్ చేయగలిగితే వేప కల్పవక్షమే. ఆయుర్వేదంలో వృక్ష ఔషధ కల్పంలో వేప పువ్వు- వేపపండ్లు- వేప పట్టా- వేప ఆకులు- వేప బెరడు చూర్ణం చేస్తే పంచాంగ చూర్ణంగా మరికొన్ని దినుసులతో అష్టవిధ కుష్టువ్యాధులకు దివ్యౌషధంగా చెప్పబడింది. కలప కూడా గృహ నిర్మాణాలకు ఉపయోగమే.

కటకం పిచ్చయ్య, ఖమ్మం (తెలంగాణ)
ప్ర:దేవుళ్లందరికీ మూర్తి రూపంలో పూజలున్నాయి. శివునికి లింగరూపమెందుకు?
స:శివునికి భృగుమహర్షి శాపంవలన లింగరూపార్చన ప్రసిద్ధమైంది (శ్రీవేంకటేశ్వరావతార చరిత్ర చదవండి). హేతుబద్ధంగా శాస్త్ర బద్ధంగా కూడా ఈ అనంత విశ్వం- బ్రహ్మాండంగా చెప్పబడింది. అండ రూపం లింగ రూపమే. లిం-గం- అంటే అనంత విశ్వంలో లీనమైనదని అర్థం.

దామర్ల రమాదేవి, మంగళగిరి (గుంటూరు)
ప్ర:శారీరకంగా మోకాళ్లనొప్పులు- నడుము నొప్పి- మానసికంగా అవమాన బాధలు- జ్ఞాపకశక్తి క్షీణించింది. పరిష్కారం చెప్పండి.
స:మీ వయస్సెంతో తెలియదు. సహజంగా నలభై దాటితే స్ర్తిలకు కొన్ని రుగ్మతలు చోటుచేసుకుంటాయి. సమర్థులైన వైద్య సహాయం పొందండి. వైద్యుని సలహాతో ప్రతిరోజూ ఉదయం కొంచెం నీరుల్లిరసంలో తేనె కలుపుకొని సేవించండి- బలహీనత దూరమవుతుంది. దైవసేవగా తెల్ల జిల్లేడు పూలతో ప్రతి సోమవారం దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేయించండి.

నాగమణి, పుట్టపర్తి (అనంతపురం)
ప్ర:దాంపత్య సమస్య
స:మనసులోని కోరిక (్ధర్మబద్ధమైనదిగా) సంకల్పంతో దుర్గాదేవికి కాని గ్రామ దేవతలకుగాని- సుబ్రహ్మణ్యస్వామికి కాని ప్రతి మంగళవారం తొమ్మిది నిమ్మపండ్లు ఎఱ్ఱదారంతో దండగా కూర్చి ఎఱ్ఱగనే్నరు పూలు, కుంకుమ పూజతో అర్చించి ఆ దండ ఆ దేవత మెడలో వేసి జిలేబీ నివేదన చేయండి. చీమలకు బియ్యపు పిండి వేయండి. శుభం జరుగును.

కె.రవిచంద్ర, రామకృష్ణాపురం, హైదరాబాద్
ప్ర:ప్రస్తుత ఉద్యోగంకన్నా మెరుగైన ఉద్యోగం లభిస్తుందా?
స:అర్హతల విషయంలో లోపం కనిపిస్తున్నది. మీకు మీరే ప్రయత్న లోపాన్ని కూడా ఏర్పరచుకునే సందర్భం కనిపిస్తోంది. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి.

గుడిపూడి వెంకరామప్రసాద్, వీరవల్లి (కృష్ణా)
ప్ర:నన్ను మెడికల్ ఏజెన్సీ తీసుకోమన్నారు. దేన్ని తీసుకోమంటారు?
స:మీ పెట్టుబడి స్తోమతను బట్టి ఆయుర్వేద ఏజెన్సీ తీసుకోండి, లాభిస్తుంది.

సి.్భమశంకర్రావు, దెందులూరు (ఆంధ్ర)
ప్ర:నా జాతకం ఎలా వుంది? త్వరలో ఏదైనా అభివృద్ధి ఉందా?
స:నూరేళ్ల జాతకం ఈ చిన్నకాలంలో ఎలా చెప్పగలమనుకుంటున్నారు? గోచార రీత్యా మీది ధనుర్రాశి- (నామనక్షత్రవశాత్) శనిదేవుడు అనుకూలంగా లేడు. గురువు ఏకాదశ స్థితి కొంత శుభం కలిగించగలదు.

ఎన్.శ్రీనివాసవర్మ, విజయవాడ (కృష్ణా)
ప్ర:ఆర్థిక సమస్యలు ఎప్పుడు తీరతాయి. స్వంత యింటి యోగం ఉందా?
స:స్వంత యిల్లు తొలుత వివాదాస్పదంగా మారిన తరువాత సానుకూలం కాగలదు.

కొత్తరాఘవరావు, గురునానక్‌పురా, జయపూర్ (రాజస్థాన్ స్టేట్)
ప్ర:వివాహ విషయం?
స:ఇంకా ఆలస్యం ఉంది. 2017 జూన్‌లో ఏమైనా శుభం జరిగే అవకాశం వుంది. ఆగ్నేయ దిశ కాని ఉత్తర దిశ కాని యోగదాయకం.

ఎన్.గురుప్రసాద్, నెల్లూరు (ఆంధ్ర)
ప్ర:తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు కాగలరో చెప్పగలరా?
స:‘తినబోతూ రుచి అడగటం లేదికి’ అని విదియ నాడు కనిపించని చంద్రుడు, తదియనాడు వాడే కనిపిస్తాడని సామెతలు గుర్తుంచుకోండి. భవిష్యకాలంలో అడగవలసిన పనిలేదు. ఇప్పటికే అది తెలిసి వుండాలి.

ఏ.అన్నపూర్ణ, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర:స్వగృహ యోగం?
స:ఈ సంవత్సరం చివరి భాగంలో వాయవ్య దిశలో ఆ ప్రయత్నాలు ప్రారంభవౌతాయి.

పి.రమాదేవి, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:అన్నా వదినల నిరాదరణ- మిగతావారితో బాగా ఉంటుంది. మా వరకు ఇంటి ఆడపడుచులు అని కూడా మర్యాద చూపదు. కారణం ఏమిటి?
స:అంతర్లీనంగా ఏవో స్థిరాస్తి వ్యవహారాలు కనబడుతున్నాయి. మీరేమైనా ఆశిస్తారేమోనని దూరంగా ఉంటుందేమో?

పి.వి.లక్ష్మి, పెదకాకాని (గుంటూరు)
ప్ర:నాది శతభిషం నక్షత్రం- కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. మనస్సు ప్రశాంతంగా లేదు. దయచేసి సలహా ఇవ్వండి.
స:మీది కుంభరాశి. ఇన్నాళ్ళూ శనిదేవుడు బాగాలేడు. ఇప్పుడు ఏకాదశంలోకి శని- నవమంలోకి గురువు ప్రవేశం- తప్పక మీకు మంచి జరుగుతుంది. దగ్గర్లో ఉన్న గ్రామ దేవతల గుళ్ళో దీపం వెలిగించి చీమలకు బియ్యపు పిండి వేయండి. గోధుమ పిండి అయితే శర్కర కలపాలి.

రావూరి వెంకటేశ్వర్లు, గొల్లగట్టు (ప్రకాశం)
ప్ర:వివాహ విషయం- ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. కారణం తెలియకుండా మరలిపోతున్నాయి. కారణమేమిటి?
స:సంపూర్ణ జాతకం పరిశీలించనిదే చెప్పలేను.

సి.వి.రాజేంద్రబాబు, ఒంగోలు (ప్రకాశం)
ప్ర:నా ఆర్థిక సమస్యలకు మా నాన్నగారిని సహాయం కోరదామనుకుంటున్నాను. సానుకూలం కాగలదా?
స:అతి కష్టంమీద కొంత మాత్రమే సహాయం. అది కూడా ఆలస్యంగా లభించగలదు.

ఎన్.రంగమ్మ, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:తీవ్రమైన అనారోగ్య బాధలు
స:ప్రతిరోజూ నీరుల్లిరసంలో కొంచెం తేనె కలుపుకొని తాగండి. కొంత మార్పు రాగలదు. దైవసేవగా అమృత పాశుపత రుద్రాభిషేకం చేయించండి.

వెంకటస్వాతి, తెనాలి (గుంటూరు)
ప్ర:వివాహ ప్రశ్న
స:ఈ సంవత్సరం చివరలో అవకాశం వుంది.

మూరెళ్ళ వెంకటేశ్వర్లు, కావలి (నెల్లూరు)
ప్ర:నేను ఏమి చేసినా కలిసి రావటంలేదు. ఏం చేయాలి?
స:కొన్నాళ్లు సంకష్టహర గణేశవ్రతం నియమబద్ధంగా చేయండి.

కె.పవన్‌కుమార్, కూచిపూడి (కృష్ణా)
ప్ర:పెద్దల ఆస్తి వివాదాలు- వివాహాలస్యం- వ్యాపారానికి పెట్టుబడి సమస్య
స:మీరు మీ జన్మస్థలానికి చాలా దూరంలో దక్షిణ దిశలో స్థిరపడతారు. జన్మస్థానం మీకు యోగించదు.

జి.యామిని, కొత్తపేట, హైదరాబాద్
ప్ర:ఉమ్మడి పొలం అమ్మిన ధనంతో ఎందులో పెట్టుబడి పెట్టవచ్చును.
స:ఆర్థిక శాస్త్ర నిపుణులను అడగండి.

డి.మహేశ్, కామారెడ్డి (తెలంగాణ)
ప్ర:వివాహ ప్రశ్న
స:కొన్ని అభ్యంతరాలు- అంగీకారాలతో మే, జూన్‌లలో అవకాశాలున్నాయి. ఈశాన్య దిశ యోగకారకం- అయితే మధ్యలో కొన్ని స్థిరాస్తి మూలక విషయాలు కారణంగా ఆలస్యం కావచ్చు!

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com