భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవళ్ళ ద్వారకాపతి శర్మ, విజయవాడ (కృష్ణా)
ప్ర: శివలింగానికీ, శ్రీచక్రానికీ భేదం ఏమిటి? దేనిని పూజించటంవలన విశేష ప్రయోజనం?
సమా: ‘‘శ్రీచక్రం శివయోర్వపుః’’ అని శాస్త్ర వాక్యం- శివశక్తులు విడదీయరానివి- శ్రీచక్రం శివుని శరీరం వంటిది. ‘శివః శక్త్యాయుక్తో’ అనే సౌందర్య లహరి ఆది శ్లోకంలోనే ఆదిశంకరులవారు అభేద స్వరూపాన్ని నిర్వచించి ‘శివాభ్యాం’ అని శివానందలహరిలో వర్ణించారు. అయితే విశే్లషించి వర్ణిస్తే ‘శివలింగం’ శక్తి స్థాణు స్వరూపం- భౌతిక శాస్త్ర రీత్య పరమాణువుల సంఘటిత స్వరూప జడత్వం కూడా శక్తికారణమే అన్నది నిరూపిత సత్యం. అయితే శ్రీచక్రం చక్ర స్వరూపం అంటే చక్రానికి సంచలనమూ, భ్రమణమూ సహజ లక్షణం- శక్తి సంచలన మార్గ స్వరూపం శ్రీచక్రం. శ్రీచక్రం స్ర్తి శక్తి- శివలింగం పురుష స్వరూపం రెండూ అభిన్నమే- ఒకటి (శివలింగం) ఆధారం- రెండవది శ్రీచక్రం ఆధేయం. రెంటినీ కలిపి ఆరాధిస్తే అనంతమైన పుణ్యం. భారతీయ వేదవిజ్ఞానం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఎన్నో రెట్లు ముందున్నది.
ఉదా:-ఒకటి విద్యుచ్ఛక్తి- ఒకటి విద్యుద్వాహకం
కె.వి.కె.రావు, మేడ్చెల్ (తెలంగాణ)
ప్ర: గ్రహ జపాలకున్న ప్రాముఖ్యత ఏమిటి? వాటివలన గ్రహ దోషాలు దూరమవుతాయా?
సమా: మానవ జన్మ పరిణామక్రమంలో లభించిన వరం- అయితే పూర్వ జన్మలోని చెడు కర్మల కారణంగా మనకు గ్రహ దోషాలు సంక్రమిస్తాయి. ఆ దోషాలు జపాదుల వలన తొలగించుకోవాలి. చెడు కర్మను మంచి కర్మ చేత అధిగమించాలి. అయితే ఆ చెడు కర్మలు మూడు రకాలు- దృఢకర్మ- అదృఢకర్మ - సుదృఢకర్మ- అదృఢ కర్మలు శాంతి కర్మల వలనల నివారించబడతాయి. దృఢ-సుదృఢ కర్మల్లో ఇంటెన్సిటీ ఎక్కువ కనుక ఫలితం అనుభవించక తప్పదు. అయితే ఏది- ఎంత మాత్రం మనకు తెలియదు కనుక శాంతి కర్మలూ చేస్తూనే ఉండాలి. పూర్వజన్మలోని దోషాలే జాతక చక్రంలో ప్రతిబింబిస్తాయి- జ్యోతిషం ఒక డయాగ్నెజింగ్ శాస్త్రం- మంత్ర జపాదులు మందు వంటివి.
డి.అమీర్‌బాషా, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:మా ఇంటికి ఉత్తరం వైపున కొన్ని నిర్మాణాల కారణంగా వాస్తు దోషా లు- ధననష్టమూ జరుగుతున్నది- దీనికి సులభమైన నివారణ చెప్పండి.
సమా: ఉత్తర దిశలో తులసి చెట్టుకాని- మారేడు మొక్క (శ్రీవృక్షం) లేదా మనీ ప్లాంటు నాటి నిరంతరం నీటితో తడుపుతూ ఉండండి. తులసి-మారేడులు విశేష ఫలం ఇవ్వగలవు.
బోళ్ళ కమలాకర్, గోదావరిఖని (తెలంగాణ)
ప్ర: జాతకచక్ర పరిశీలన- స్వగృహయోగం-
సమా: మీ జాతకాన్ని పరిశీలిస్తే గృహస్థానం రాశిచక్రంలోనూ, నవాంశలోనూ శన్యాక్రాంతమై కుజ ప్రభావంలో ఉంది. ఆలస్యంగా కొన్ని ఇబ్బందులతో సంతాన యోగం బలంవల్ల కాని- స్ర్తి సహాయంవల్లకాని స్వగృహ యోగం కలదు. ప్రమాదాలనుండి జాగ్రత్తగా ఉండండి.
కె.ఆదినారాయణ- అనకాపల్లి (ఆంధ్ర)
ప్ర: జీవితంలో మొదటినుండీ ఋణ బాధలు- ఎప్పుడు నివారణ
కాగలదు?
సమా: జాతకంలో కొందరికి ఋణమేధన యోగంగా ఉంటుంది. అది గ్రహబలాన్ని బట్టి కొందరికి యోగిస్తుంది. కొందరిని బాధిస్తుంది. మొదటి నుండీ అంటున్నారు కనుక ఋణం తీసుకోవటం అలవాటుగా మారినట్టుంది. ఒక ఋణం తీర్చటానికి మరో అప్పు చేయటం కూడా మంచిది కాదు. దైవసేవగా ఋణవిమోచన అంగారక వ్రతం చేయండి. ఈ సంవత్సరం చివరి భాగంలో కొంత శుభం జరుగును.
ఎమ్.శ్రీను, రాజమండ్రి (ఆంధ్ర)
ప్ర: ఎంత ప్రయత్నించినా మద్యపానాన్ని మానలేకపోతున్నాను- సమాజంలో ఉన్నత స్థానం నా కోరిక- స్వగృహం మరో కోరిక- నెరవేరే ఉపాయం చెప్పండి?
సమా: మీ ప్రశ్న చూస్తే పెద్దలు చెప్పిన ఒక సామెత గుర్తుకువస్తోంది. ఒకాయన చీమల పుట్టమీద కూర్చొని చీమలు కుడుతున్నాయి బాబోయ్ అంటూ అరిచాడట. మద్యపానాన్ని మొదట మానండి- సమాజ సేవకు పాటుపడండి. మిగతావి వాటంతట అవే వస్తాయి.
జి.కాంతయ్య, హుజూర్‌నగర్ (తెలంగాణ)
ప్ర: నా జన్మ నక్షత్రం అశ్విని- ఒకటవ పాదం- మా బట్టల వ్యాపారం మునుపటిలా లేదు. ఏం చేయమంటారు?
సమా: సంవత్సరం చివరలో కొంత మార్పు వచ్చే అవకాశం వుంది. శాశ్వత పరిష్కారం కోసం విక్రయ వృద్ధి యంత్రాన్ని కాని విక్రయ ధన కుబేర యంత్రాన్ని కాని దుకాణంలో పెట్టుకొని పూజించండి. వీలయితే పణ్యహోమం జరిపించండి. వ్యక్తిగతంగా కలవండి.
బచ్చుగ గణేశ్, కల్లూరు (ఆంధ్ర)
ప్ర: జాతక పరిశీలన- సంతాన విషయం
సమా: విజయవాడ వద్ద మోపిదేవి క్షేత్రానికి ముడుపు కట్టండి, శుభం జరుగును.
ఎమ్.ఆదినారాయణ, హిందూపూర్ (ఆంధ్ర)
ప్ర: అనారోగ్యం- ఆర్థిక సమస్యలు- పరిష్కారం చెప్పండి.
సమా: అనారోగ్యానికి యంత్రబలం కల్గిన పూజా పునస్కారాలు జరిగే ఆంజనేయస్వామికి ప్రతి మంగళవారం తగు సంకల్పంతో, అరటిపండ్లు- మినప వడలు 108 మాలగా - పాయసం నివేదనగా అర్చన చేయించండి. ఆర్థిక సమస్యలకు ప్రతి బుధవారం శ్రీ వేంకటేశ్వరస్వామికి బూందీ లడ్డూలతో నివేదన చేసి పూజించి బూందీ లడ్డూలు కొన్ని చిన్న పిల్లలకు పంచిపెట్టండి.
బండి నాగరాజు, అరకువేలి (విశాఖపట్టణం)
ప్ర: పొలంలో దొరికిన చేయి లేని అమ్మవారి విగ్రహాన్నిఏంచేయాలి?
సమా: భిన్నమైన విగ్రహాన్ని నదిలో వదిలివేయాలి. ఎవరో ఆ పని చేయలేక పొలంలో వదిలినట్టున్నారు. నదిలో వేయండి. భిన్న విగ్రహం ప్రతిష్ఠ చేయకూడదు.
ఎం.బి.కృష్ణమూర్తి (అడ్వకేట్) తుని (ఆంధ్ర)
ప్ర:మానసిక వ్యగ్రత్వం- సైకిక్ కాంప్లెక్సిటీ-
సమా:జాతకంలో బుధ ప్రభావం కలిగిన రాశిలో కాని లగ్నంలో కాని జన్మించి రవి-రాహువుల సంయోగం కలిగివుంటే అటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. ప్రతిరోజూ దైవసేవగా శ్రీమత్సుందరకాండ ఒక సర్గ చొప్పున పారాయణం చేస్తూ అరటిపండ్లు నివేదన చేయండి. ఔషధ సేవగా రాత్రివేళ కర్పూరాదివటి (ఒక మాత్ర) వేసుకొని (పడుకొనే ముందు) నిద్రపోండి. మానసిక ప్రశాంతత అలవడుతుంది. మరిన్ని వివరాలకు వ్యక్తిగతంగా కలవండి.
ఎస్.ఉమాదేవి, అనంతపురం (ఆంధ్ర)
ప్ర: ఆరోగ్య విషయం-
సమా: పాదాలు- ఉదరం (కడుపు) రోగ స్థానాలు- పాదాల విషయంలో గాయాలనుండి జాగ్రత్త- ఉదరం విషయంలో కాలేయ దోషాలు- తగు వైద్యాన్ని పొందండి.
పి.అంజని, ఎల్లారెడ్డిగూడా, సికింద్రాబాద్
ప్ర: శరీరానికి చర్మవ్యాధి
సమా: దైవసేవగా ఆంజనేయస్వామికి ప్రతిరోజూ నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయండి. గోధుమ పిండి- శర్కర చీమలకు పోయండి- స్నానం లో- నీటిలో సైంధవ లవణం, నిమ్మరసం, వేపనూనె, హారతి కర్పూరం వేసుకొని స్నానం చేయండి. వైద్యుని సలహాతో కాడ్‌లివర్ ఆయిల్ (చేపనూనె) ఔషధంగా సేవించండి. ప్రమాణం వైద్యుని సలహా.
పేరు (తెలపటం ఇష్టంలేదు), గార్ల గ్రామం, మహబూబాబాద్
ప్ర: అనాధను దత్తత తీసుకోవచ్చా?
సమా: చాలా మంచి పని. అమ్మాయి అయితే మరీ శ్రేష్టం. కన్యాదాన ఫలం లభిస్తుంది. పేరు పెట్టే సమయంలో మాత్రం మీ వంశవృక్ష జలాలలో సంస్కరించి అనువైన పేరును ముగ్గురు ముత్తయిదువులతో ముందుగా పిలిపించి అదే పేరుతో దత్తత తీసుకోవాలి. వంశవృక్షం తెలియని పక్షంలో ఆడపిల్ల అయితే మారేడు పత్ర జలం- మగ పిల్లవాడు అయితే మోదుగ వృక్ష పత్ర జలంతో సంస్కరించాలి.
వై.లక్ష్మణ్‌సింగ్, భారతంమిట్ట (చిత్తూరు)
ప్ర: అమ్మాయి మానసిక విపరీత ప్రవర్తన-
సమా: అమ్మాయి పూర్తి జాతకం చూడనిదే చెప్పలేను. వీలయితే వ్యక్తిగతంగా కలవండి.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com