భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెడ్డిచర్ల రఘునాధ్, విజయవాడ (ఆంధ్ర)
ప్ర:గురువుగారికి నమస్కారం. మీరు చెప్పినది చెప్పినట్లుగా గడువులోపలే నాకు ప్రభుత్వం నుండి ఇల్లు మంజూరు అధికారికంగా అందినది. మీ వాక్కుకు నమోవాకములు. ఆర్డర్ నెంబరు జిరాక్స్, ఆర్.సి.నెం.10/ఎ2/2015, తేదీ 19-10-2016. మీ ఆశీస్సులు అందించండి.
సమా:శుభాశీస్సులు- శుభాశంసలు
బండి నాగరాజు, అరకువేలి (వైజాగ్)
ప్ర:మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు స్పష్టంగా పలకనని నన్ను హేళన చేస్తుంటారు. అందువల్లే ఉద్యోగం రావటంలేదు. మాట స్పష్టత కోసం ఏం చేయాలి.
సమా:దైవసేవగా కర్నాటకలోని ‘మూకాంబికా’ దేవిని దర్శించి మూడు రోజులు సేవించండి. గృహ వైద్యంగా వస కొమ్ము చూర్ణము- పొంగించి శుద్ధిచేసిన పటిక చూర్ణము ఉసిరిక రసములో మడూ రోజులు ఉంచి ఆ తరువాత ఆ చూర్ణమును ప్రతిరోజూ చిటికెడు చప్పరించండి. వాక్సుద్ధి కలుగును. దైవసేవ మాత్రం అత్యవసరం.
పెద్ద్భిట్ల గీతారావు, విజయవాడ (కృష్ణా)
ప్ర:మా పుట్టింటివారు వేలూరువారు- ‘నాగ సర్పములను’ అనేకమును చంపిన దోషం మాకంటింది. ఆ కారణంగా అనేక బాధలు పడుతున్నాము. దీనికి పరిష్కారం చెప్పండి.
సమా:సశాస్ర్తియంగా నాగేశ్వర దేవతా ప్రతిష్ఠ శాశ్వత పరిష్కారం- తాత్కాలికంగా నాగేశ్వర యంత్రార్చన ప్రతి మంగళవారం ఏకభుక్తోపవాసం యంత్రం ముందు కాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు కాని సంపెంగ నూనెతో దీపారాధన- ప్రతినెలా మోపిదేవి క్షేత్ర దర్శనం ఆచరించండి.
దేవరాం జీవన్, జాలూరు (రిజస్తాన్ స్టేట్)
ప్ర:బేపార్ బహత్ డల్ హై. క్యా కర్నాహై. ఆజ్ఞా దీజియే-
సమా:వ్యాపార్ కారోబారీ కర్నేకే స్థాన్‌పర్ ‘పణ్యహోవన్’ నామక్ హవన్ కర్వాయియే- లక్ష్మీగణేశ్ కా యంత్ లగ్వాయియే-
బి.ఎస్.రెడ్డి, ప్రగతినగర్, హైదరాబాద్
ప్ర:అనారోగ్యం- ఆర్థిక ఇబ్బందులు. ఏ దైవాన్ని పూజించాలి?
సమా:ముందుగా మీ యింటి కులదైవాన్ని తప్పక పూజించాలి. తరువాత ఇష్టదైవాన్ని పూజించుకోవాలి. మూడవదిగా గ్రహచార సంబంధంగా జాతక సంబంధంగా శాంతి పూజలు చేసికోవాలి.
ఎమ్.నేతాజీ, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర:విపరీతమైన ఋణబాధ- కటిక చీకటిలో ఉన్నాము. పరిష్కారం చెప్పండి.
సమా:చీకటి ముసరే సమయంలోనే చిరుదీపం వెలిగించుకోవలసింది. కటిక చీకటి అలుముకునేదాకా ఎందుకూరుకున్నారు. ఇప్పటికిప్పుడే ఏ పరిష్కారమూ దొరకదు. ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామికి బూందీ లడ్డూలు నివేదన, నెయ్యి దీపం పెట్టి లడ్డూలు చిన్నపిల్లలకు పంచి పెట్టండి.
ఎ.శ్రీవెంకట చాందినీ, భీమవరం (ఆంధ్ర)
ప్ర:నాకు ఎం.బి.బి.ఎస్‌లో సీటు వస్తుందా?
సమా: వైద్య విద్యలోనే రాణిస్తారు.
సత్యశ్రావణి, వైజాగ్ (ఆంధ్ర)
ప్ర:కాపురంలో కలహాలు - పరిష్కారం
సమా:గౌరీ పంచాక్షరీ మంత్రోపదేశం సిద్ధపురుషుడైన ఆచార్యుని ద్వారా పొంది అనుష్ఠించండి.
బి.ప్రసాదరావు, బరంపురం, ఒడిశా
ప్ర:ఆర్థికంగా బలహీనుణ్ణి- స్వంత యిల్లు లేదు. నా భవిష్యత్తేమిటి?
సమా:ఏదీ తనంత తానై నీ దరికి రాదు. సాధించి శోధించాలి. అదియే ధీరగుణం. శ్రీశ్రీ గారి గీతం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోండి. ‘ద వీకెస్ట్ పాయింట్ వి మస్ట్ మేక్ ఇట్ ఆయిస్ స్ట్రాంగెస్ట్ పాయింట్’ (్దళ తీళళరీళఒఆ ఔ్యజశఆ తీళ ౄఖఒఆ ఘౄరీళ జఆ ఘఒ డఆ్యశళఒఆ ఔ్యజశఆ) వినె్సంట్ ఫీల్ మహాశయుని సూక్తి మీకంటే బలహీనంగా ఉంది. పూర్వ విజయాలు సాధించినవారు చాలా ఉన్నారు.
కె.కోటేశ్వరరావు, నరసరావుపేట (ఆంధ్ర)
ప్ర:నాకు నూనెల వ్యాపారం ఎలా ఉంటుంది?
సమా:నూనెల వ్యాపారం మీకు ఏ విధంగానూ యోగించదు. ఏదైనా దినుసులు కాని- విత్తనాల వ్యాపారం కాని అనుకూలం.
కె.్భలేరామశర్మ, రెడ్డిగూడెం (తెలంగాణ)
ప్ర:ఇల్లు ఆధునికీకరణ- వాహన ప్రయత్నం- త్వరలో యోగిస్తుందా?
సమా: ‘మే, జూన్’లలో ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతాయి.
యాతం రామభార్గవ, కొత్తపాలెం (ప.గో)
ప్ర:వివాహం ఎప్పుడు జరగవచ్చు?
సమా:ఈ సంవత్సరంలోనే జరిగే అవకాశం ఉంది.
జె.మహానందేశ్, ఆదోని (కర్నూలు)
ప్ర:వివాహయోగం
సమా:‘కన్యా పాశుపత విధానం’గా ఈశ్వరునికి అభిషేకాలు మూడు శుక్రవారాలు చేయించండి.

పూసర్ల రామారావు, విశాఖ, (ఆంధ్ర)
ప్ర:నాకు వ్యాపారం కలిసి రావటంలేదు. ఏంచేయాలి?
సమా:కలసివచ్చే వ్యాపారం భాగస్వామ్యంగా చేయించండి.
మాడిశెట్టి రాజేశం గుప్తా, సిద్ధిపేట
ప్ర:నవరత్నాంగుళీయకం ధరించటంవలన మంచి జరుగుతుందా?
సమా:సశాస్ర్తియంగా ‘సర్వతోభద్రమండల’ రూపంలో చేయించి నలభై రోజులు సంస్కారం చేసి ధరిస్తే మంచిది.
ఆర్.పరుశురాం, మల్కాజ్‌గిరి (హైదరాబాద్)
ప్ర:లాభం రెండు లక్షలు- ఖర్చు ఆరు లక్షలు. ఋణం తప్పనిసరి. నివారణ ఏమిటి?
సమా:స్థానికులే కనుక వ్యక్తిగతంగా కలవండి.
కె.సాయి శ్రీనివాస్, సామర్లకోట (తూ.గో.)
ప్ర:వివాహం యోగం- ఉద్యోగం
సమా:రెండూ ఇంకా ఆలస్యమే. ఈ సంవత్సరం చివరలో కొన్ని శుభ సూచనలు రాగలవు.
బి.రామమోహనరావు, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర:నా భార్యతో పిల్లలతో తగవులు- నా డబ్బంతా వారి చదువులకు పెట్టాను. కృతజ్ఞత లేదు.
సమా:‘ఋణానుబంధ రూపేణ పతి, పత్నీ సుతాలయాః వారంతా ఋణరూపులు. ‘దారేషణ - ధనేషణ- పుత్రేషణ’ అనేవి తాపత్రయాలు- మనస్సు దైవం వైపు త్రిప్పండి. భగవద్గీతా పారాయణం చేయండి. పరిష్కారం దొరుకుతుంది.

**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

ఉమాపతి బి.శర్మ