భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతాప వంశీ కృష్ణ, గుంటూరు
ప్ర: ఉదర సంబంధమైన వ్యాధులు-కీళ్ల నొప్పులు-ఉపశమనం చెప్పండి.
స్వంత ఇంటి ప్రయత్నం చేయవచ్చా!
సమా: మీ నక్షత్ర జాతక రీత్యా హృదయము-జీర్ణాశయము బలహీన స్థానాలు-తేలికగా జీర్ణమయ్యే ఆహారం-దోస-బీర వంటి జల ప్రధానమైన కూరలు తినడం శ్రేష్ఠం. ఒకేసారి సుష్టుగా భోజనం చేయకండి. తరచుగా కమలాఫలం వంటివి తినండి. తేలికపాటి వ్యాయామం చేయండి. కీళ్ల నొప్పులకు కానుగు చెట్టు వేళ్లు ఎండగొట్టి చూర్ణము చేసి నీటితో ముద్ద చేసి, నువ్వుల నూనెతో కాచి వడబోసి మిగిలిన తైలము కీళ్లపైన మర్దన చేయండి. వీలయితే వజ్రాసనం వేయండి. పక్క మీదనే చేయగల సులభమైన ఆసనం. మీకు తప్పక రెండు స్వగృహముల యోగం కలదు. శుభం భవతు.
కె.చందన, రావికంపాడు (ఆంధ్ర)
ప్ర: ఉన్నత చదువులకు జంగారెడ్డి గూడెం, ఏలూరు, ద్వారక- వీటిలో ఏది అనుకూలం.
సమా: జంగారెడ్డి గూడెం బాగుంటుంది.
జె.రవిప్రకాశ్, సైదాబాద్ కాలనీ (హైదరాబాద్)
ప్ర: నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది. ఈ జన్మలో సాధ్యమేనా?
సమా: మోక్షమనేది మార్కెట్లో లభించే వస్తువు కాదు. ఈషణత్రయాలను విసర్జించకుండా మోక్షం వైపు అడుగు వేయలేరు. సులభంగా కావాలనుకుంటే ‘సత్సంగత్వే నిస్సంగత్వం-నిస్సంగత్వే నిర్మోహత్వం-నిర్మోహత్వే నిశ్చల తత్వం-నిశ్చల తత్తే జీవన్ముక్తిః అన్న ఆదిశంకరుల వారి సూక్తులను ఆచరణలో పెట్టండి!
యలమద్ది సాయిమహిత్, జగ్గయ్యపేట (ఆంధ్ర)
ప్ర: ఆరోగ్యం-్భవిష్యత్తు
సమా: ఆరోగ్యరీత్యా తల-గొంతు సంబంధ విషయాలపై జాగ్రత్తగా వుండండి. భవిష్యత్తు వయో ధర్మ దశలను బట్టి ఉంటుంది.
చెరుకుమిల్లి రామకృష్ణ, నూజివీడు (కృష్ణా)
ప్ర: విద్య-్భవిష్యత్తు
సమా: విఘ్నాలతో విద్యపూర్తి. మీది డ్యూయల్ సైకాలజీ. దాన్ని గుర్తించి నిర్ణయాత్మకంగా వుంటే భవిష్యత్తు భాగుంటుంది.
ఎన్.శివశంకరరావు, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: హోటల్ నిర్వహణ ప్లాటు కాంప్లెక్స్‌లో పొరుగువారి అభ్యంతరం-పరిణామాలు ఎలా ఉంటాయి.
సమా: రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో మార్కెటింగ్ సంస్థలు ఉండకూడదు. కమర్షియల్ టాక్స్ జుర్మానా పడుతుంది. ఇతరులు అభ్యంతరం చెపితే మరీ ప్రమాదం. రాజీమార్గంలో వెళ్లండి.
బొడ్డుపల్లి వెంకటేశ్వర శర్మ, ఆనందనగర్ (హైదరాబాద్)
ప్ర: కాళ్ల వాపు-నడుము నొప్పి
సమా: కాళ్ల వాపుకు ఆయుర్వేదంలో ‘నిత్యానందరీస్’ చెప్పబడింది.వైద్యుని సలహాతో వాడండి. మామూలుగా అశ్వగంథ (పెనే్నరు)చూర్ణం ప్రతి రోజు స్వల్పంగా మజ్జిగతో పుచ్చుకోండి. ‘పేరులేని రోగానికి పెనే్నరు మందు’ అని సామెత. ఇవి సలహాలు మాత్రమే. డాక్టర్ నిర్ణయం తప్పనిసరి.
ఎన్.నవీన్, నరసారావుపేట (గుంటూరు)
ప్ర: స్వంత వ్యాపారం-వివాహం?
సమా: వ్యాపారం-వస్తమ్రులు-అలంకార ద్రవ్యాలు-మధుర పానీయాలు-వివాహం ఆలస్యం-ఆగ్నేయ దిశ యోగం.
ఎల్.అర్జున్‌రావు, అయిదుగ్రామం (శ్రీకాకుళం)
ప్ర: ఊరిలో నవగ్రహ దేవాలయ నిర్మాణం-శ్లాబు (పైకప్పు) పైన శివాలయం నిర్మాణం సరియైనదేనా?
సమా: పూర్తిగా పొరపాటు. ఆగమ శాస్త్రానికి పూర్తి విరుద్ధం. పనికిరాదు. మంచిది కాదు. ఇలాంటి పనులు చేస్తారనే గోపుర నిర్మాణం నిర్దేశించింది ఆగమశాస్త్రం.
సారవకోట అప్పారావు, సారవకోట (శ్రీకాకుళం)
ప్ర: దైవదర్శనంలో ఎటువంటి పద్ధతులుపాటించాలి?
సమా: ముందుగా ప్రధాన ద్వార గడపకు నమస్కరించి కుడికాలు ముం దుంచి ఆవరణలో ప్రవేశించి ధ్వజానికి నమస్కరించాలి. ప్రదక్షిణంగా వెళ్లి మళ్లీ ధ్వజం చేరుకుని వైష్ణవ ఆలయమైతే గరుత్మంతుని-శైవాలయం అయితే నందీశ్వరుని ప్రార్థించి మంటపంలో ప్రవేశించి మూడుసార్లు ఘంటానాదం చేసి మూల స్వామికి అర్చనో-ప్రార్ధనో చేయాలి. ఆ తరువాతనే ఉపాలయాలు.
కృష్ణమూర్తి, మచిలీపట్నం (ఆంధ్ర)
ప్ర: శ్రీ మద్రామయణంలో శంభాసురుని వధను గురించి చెప్పండి-
సమా: బహుశా మీ అభిప్రాయం శంభకుడు అనుకుంటాను. శంభకుడు రాక్షసుడు కాడు-రామరాజ్యంలోని ఒక పౌరుడు. దీనిమీద ఏది చెప్పినా వివాదాస్పదంగా భావించే అవకాశం ఉంది-ఆధునిక కాలంలో-
కె.శ్రీనివాస్, పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర: జీవితంలో నేను ఏ రంగంలో స్థిరపడగలను.
సమా: నగదుతో చేసే వ్యాపారం-ఫైనాన్స్-వంటివి
టి.హరికృష్ణ, బద్వేలు (ఆంధ్రప్రదేశ్, కడప)
ప్ర: చాలా సమస్యలు-కొన్ని చట్టానికి సంబంధించినవి. కొన్ని మనోభావాలకు సంబంధించినవి.
సమా: మీ ప్రశ్నలకు పత్రికా ముఖంగా సాధ్యం కాదు. వీలయితే వ్యక్తిగతంగా కలవండి.
బి.్భస్కరశాస్ర్తీ, రెడ్డిగూడెం (తెలంగాణ)
ప్ర: ఉమ్మడి కుటుంబాన్ని గొడవలు లేకుండా నా మాట మీద నడపగలనా?
సమా: ఆ కుటుంబంలో మీ స్థాయి-పాత్ర మీద ఆధారపడి ఉంది. అది మీరు తెలుపలేదు.
సామల కిరణ్, జాలపల్లి పెద్దపల్లి-తెలంగాణ
ప్ర: నా భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా: మీరు ఆంధ్రభూమి కూపన్ ద్వారా ప్రశ్నించలేదు. జతపరచలేదు కూడాను. నియమం పాటించండి.
కె.జి.పవన్, విజయవాడ, ఆంధ్ర
ప్ర: నా ఆరోగ్య స్థితి-
సమా: పాదాలు-గొంతు సంబంధంగా జాగ్రత్తలు తీసుకోండి.
పి.శ్రీనివాస్, విజయవాడ (ఆంధ్రా)
ప్ర: ఆదాయానికి మించిన ఖర్చులు-మనసు ప్రశాంతత లేదు.
సమా: సహజమే. డబ్బు సరిపోకపోతే ఇబ్బందే. ‘ఉన్నది పుష్టి మానవునకు, తిన్నది పుష్టి ఆవులకు’ అన్నాడు కవి. పొదుపు అలవాటు చేసుకోండి. దేశ దేశాలే ఖర్చు విషయాల్లో ఆస్టిరిటీ మెషర్స్ పాటిస్తున్నాయి. గుర్తుంచుకోండి.
గుండా మాధవ్, హుజూర్‌నగర్ (తెలంగాణ)
ప్ర: ప్రస్తుతం బట్టల షాప్‌లో ఉద్యోగం-మారమంటారా?
సమా: వద్దు. అదే బాగుంటుంది-్భవిష్యత్తు ఉంది.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ