Others

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేమూరి భాస్కరమూర్తి, బజార్‌ఘాట్ (హైదరాబాద్)
ప్ర:శర్మగారూ! మీరు ఘంటానాదం మూడుసార్లు అని చెప్పారు. మరి తిరుమల మున్నగు క్షేత్రాలలో హారతి- నివేదన సమయాలలో అదేపనిగా గంట వాయిస్తారు కదా! అది పొరపాటా?
సమా:కాదు! ఎంతమాత్రం కాదు. ఘంటానాదం మూడు రకాలు. ఒకటి ప్రప్రథమంగా భక్తుడు ప్రవేశించినపుడు మంటపంలో చేసే ఘంటానాదం, అది మూడుసార్లు మాత్రమే మ్రోగించాలి. రెండు- అర్చక స్వాములు పూజా ప్రారంభంలో చేసే ఘంటానాదం- ‘ఆగమార్థంతు దేవానాం.. కురుఘంటారవం తత్ర దేవాహ్యన లాంఛనం’ అనే మంత్రంలో మంత్రం పూర్తయ్యేవరకు ఘంటానాదం చేయాలి. మూడవది- జేగంట- అంటే జయఘంట- అది హారతి సమయంలో- నివేదన వంటి సమయాలలో భక్తులకు హెచ్చరిక సంకేతంగా చేసే దీర్ఘఘంటారావం. ఒక్కొక్కప్పుడు ‘్ఢంకా’నాదం కూడా మోగిస్తారు. పూర్వం ఓ గంటానాదం ఊరి దేవాలయం నుండి వినేవరకూ బ్రాహ్మణులు ఇళ్ళల్లో భోజనం చేసేవారు కాదట.
రెడ్డిచర్ల రఘునాధ్, విజయవాడ (కృష్ణా)
ప్ర:గురువుగారూ! మీరు చెప్పినట్లుగా నాకు జూన్ నెలలోనే ఇల్లు ప్రభుత్వం నుండి మంజూరైనది- అది ఎక్కడ- జక్కంపూడిలోనా- బాంబే కాలనీలోనా అనేది స్పష్టం కాలేదు. దయచేసి చెప్పండి.
సమా:బాంబే కాలనీగా అవకాశం కనిపిస్తోంది.
బొడ్డుపల్లి వెంకటేశ్వర శర్మ - ఆనందనగర్ (హైదరాబాద్)
ప్ర:మూలలు- విదిక్కులు- ప్రధాన దిక్కులు కావటం మంచిదేనా? లక్ష గడప దాటితే వాస్తు దోషం ఉండదంటారు. నిజమేనా?
సమా:విదిక్కులు (సబ్‌డైరెక్షన్స్) ప్రధాన దిక్కులు కావటం- దిక్సూలదోషం- అయితే ఈశాన్యమైతే కొంత శుభమే అయ్యే అవకాశం ఉంది. లక్ష గడప- వేయిగడప అనేది సరియైన సమర్థన కాదు. ఆపద్ధర్మ సమర్థన మాత్రమే.
అనగాని సుబ్బారావు - గుంటూరు (ఆంధ్ర) - (చిన్నపులివర్రు)
ప్ర:మూలా నక్షత్రంలో జన్మించిన మా చిన్నమ్మాయి మాకు వేదన కలిగిస్తోంది.
సమా:పుట్టిన 27 రోజులలోపు శాంతి చేయించవలసినది- అభుక్త మూల చాలా దోషం. నాలుగవ పాదం కొంతవరకు నయం- శాంతి జరిపించండి.
జి.జగన్నాధరావు, పాలకొల్లు (ప.గో.)
ప్ర:చనిపోయిన వ్యక్తి బ్రతికి ఉన్నపుడు మమ్మల్ని బాధించాడు- చనిపోయి కూడా ప్రేతాత్మగా పీడిస్తున్నాడు. దంపతులమధ్య అనుమానాలు- అపోహలు సృష్టిస్తున్నాడు- నివారణ చెప్పండి.
సమా:ఆయన జీవించి ఉన్నపుడు చేసిన బాధలు మీమీద తీవ్రంగా ప్రభావం చేసి- చనిపోయిన తరువాత కూడా పీడిస్తున్నట్టు భ్రమలు కలుగుతున్నాయి. ఏమైనా ఇంట్లో ఉదక శాంతి చేయించి పదకొండు రోజులు మంచి విప్రుని చేత భాగవత పారాయణం చేయించండి. ప్రేత పీడ దూరమవుతుంది.
పి.సూర్యప్రకాశరావు, బాలాజీనగర్ (నెల్లూరు)
ప్ర:ఆరోగ్యం గురించి?
సమా:ఉదర సంబంధంగా ముఖ్యంగా కాలేయ సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి.
వల్లపాటి మారుతీ గౌతమ్, పండరీపురం (గుంటూరు)
ప్ర:నేను ఏ వృత్తిలో రాణించగలను? వివాహం,ఆర్థిక, ఆరోగ్య సమస్యలు?
సమా:స్వతంత్ర వ్యాపారం. అలంకార ద్రవ్యాలు- ఆహార పదార్థాలు- సౌందర్య వస్తువులు- మిగతా సమస్యలు కాలానుగుణం.
మల్లిక, ఆదోని (కర్నూలు)
ప్ర:మా బావగారు నా మీద కేసు పెట్టారు.
సమా:మీ బావగారి కేసు నిలిచేది కాదు, విచారించకండి! గెలుపు మీదే!
జి.చక్రపాణి, హిందూపూర్ (ఆంధ్ర)
ప్ర:నాకు ఉద్యోగమా? వ్యాపారమా?
సమా:కొన్నాళ్ళు ఉద్యోగం చేయటమే మంచిది. వచ్చిన అవకాశం వదులుకోకండి.
ఎన్.రమణమూర్తి, బరంపురం (ఒడిశా స్టేట్)
ప్ర:నేను స్వతంత్రంగా ఎప్పుడు వ్యాపారం చేస్తాను- ఎటువంటిది?
సమా:మీకు భాగస్వామ్యమే మంచిది. అనుభవజ్ఞులైన పెద్దల సహాయంతో ప్రభుత్వ రంగ కాంట్రాక్టులు ప్రయత్నించండి.
వి.శ్రీదేవి, తెనాలి, గుంటూరు
ప్ర:కుటుంబ శ్రేయస్సుకోసం- సంతాన సంతోషం కోసం ఏం చేయాలి?
ప్ర:సూర్యోదయాత్పూర్యం స్నానం చేసి తులసికి గోవుకు పూజ చేయండి. వీలయితే ‘గోపద్మవ్రతం’ చేయండి. శుభం.
గరిమెళ్ళ భాస్కర కుమార్, వెల్లటూరు (గుంటూరు)
ప్ర:వివాహం ఎపుడు?
సమా:ఆగ్నేయ దిశనుండి వచ్చు సంబంధము నిర్ణయమగును. అక్షరములు- వ, క, న, ర, ల-
శ్రీరామచంద్రమూర్తి, వైజాగ్ (ఆంధ్ర)
ప్ర:అనారోగ్య సమస్య?
సమా:పాదాలు- తల - ఇంకా కొన్ని డాక్టర్లు మాత్రమే చెప్పగలిగే రుగ్మతలు కనిపిస్తున్నాయి. క్రమక్రమంగా బాగుపడుతుంది. ఆంజనేయస్వామిని పూజించండి.
ఘనశ్యాం దాస్ చందూలాల్, లాల్‌బజార్ (హైదరాబాద్)
ప్ర:హమ్ ఏక్ కామ్ కే బారేమే సోచ్ రహే హై- సఫలతా మిలే గీయా నహీ-
సమా:విచార్ ధారాకే సాత్ సాత్ సదాచార్ కర్నే భీ అచ్ఛీ రహేతో సఫలతా మిలేగీ జరూర్-
క్రొవ్విడి రమేశ్- సజ్జాపురం (ప.గో.)
ప్ర:వివాహమెపుడు?
సమా:ఈ సంవత్సరం జరుగుతుంది.
వై.పుష్పాంజల, సోమందేపల్లి (ఆంధ్ర)
ప్ర:ఆరోగ్యం, చదువు?
సమా:ఆరోగ్యమూ, చదువూ ఆటంకాలతో ఉంటుంది. అదృష్టం- భాగ్యవృద్ధి బాగుంది.
టి.రామారావు, వైజాగ్ (ఆంధ్ర)
ప్ర:వ్యాపారం
సమా:మీకు ఆయిల్ వ్యాపారం సరిపోదు. వస్త్ర వ్యాపారం, భాగస్వామ్యంతో ఆలోచించండి.
దర్శనాల కిరణ్‌కుమార్, జాలిగామ (తెలంగాణ)
ప్ర: విదేశీయానం- ఉద్యోగం- వివాహం?
సమా:మీ విద్యా స్థాయి- మొదలైనవి తెలియకుండా - తెలుపకుండా చెప్పటం సాధ్యం కాదు.
కె.చంద్రిక - కె.కోట (తెలంగాణ)
ప్ర:తాతగారూ! ఇంటర్‌లో నాకు ఏ గ్రూపు బాగుంటుంది.
సమా:ఏదైనా టెక్నికల్‌గాని- ఆర్కిటెక్ట్- సంబంధంగాని తీసుకో తల్లీ!
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com