భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.సూర్యప్రకాశరావు, నెల్లూరు
ప్ర: శర్మగారూ! నమస్కారం- నిజంగా మీ సమాధానానికి ఆశ్చర్యపడుతున్నాను. అద్భుతం అనిపిస్తోంది. కేవలం ఒక నంబరు చెప్పగానే నాకున్న అనారోగ్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మీరు చెప్పిందే వైద్యులూ నిర్థారించారు. ఉదరంలో నీరు చేరిందన్నారు. ఇది పూర్తిగా నయమవుతుందా?
సమా:తప్పకుండా నయమవుతుంది. ఆగస్ట్ తరువాత మంచి మార్పు రాగలదు. హోమియోలో ‘నేట్రమూర్’ 6ఎక్స్ జర్మనీ ప్రొడక్ట్- కాస్టికమ్ 6 ఎక్స్ డాక్టర్ చేత ఔననిపించుకొని వాడండి. తప్పక గుణమిస్తుంది.
వై.పుష్పాంజలి, సోమందేపల్లి
ప్ర:లోగడ నా ప్రశ్నలో కొన్ని విషయాలకు సంబంధించి సమాధానమిస్తూ మొదట ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడండి అన్నారు. మీ మాట అక్షరాలా నిజమయింది. అనారోగ్య సమస్యే తలెత్తింది. నివారణ చెప్పండి.
సమా: మీ అనారోగ్యానికి కారణం జాతకంలోని శుక్రదోషం. శుక్రదోష నివారణకు విష్ణు సహస్రనామ పారాయణం చేయించి ప్రతి శుక్రవారం ఐదు గోధుమరొట్టెలు దరిద్ర నారాయణులకు (బిచ్చగాళ్ళకు) దానం చేయండి. శుభం జరుగును.
పి.అయ్యపురెడ్డి, కావలి, నెల్లూరు
ప్ర:నాకు స్వగృహయోగం ఉన్నదా? రిటైర్మెంట్ తరువాత ఎక్కడ స్థిరపడమంటారు?
సమా:ఆలస్యంగా పశ్చిమ దిశలో మీకు స్వగృహయోగం స్థిరపడిన చోట కలదు. మీకు యోగించే అక్షరాలు- బ - వ- స-
విమల్ పాండే, ముంబాయి (మహారాష్ట్ర)
ప్ర:పండిత్‌జీ! మై బొంబే మే రహానే వాలీహూ . కాచీగూడామే రహనే వాలీ మేరే బహన్‌కీ సూచనాపర్ ప్రశ్న్ పూజ్ రహేహూ. క్యా మై ఐఎఎస్ బన్‌సక్తాహూ?
సమా:అవశ్య్- ఆప్‌కీ తమన్నా పూరే హోగీ దీక్షా సే ప్రయాస్ కర్‌తే రహీమే.
డాకుపాటి ఓంప్రకాశ్, అత్తిలి
ప్ర:గురువుగారూ! నమస్కారం! మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. భవిష్యత్తు ఏమిటి?
సమా:మీరు అదృష్ట జాతకులే. అయితే బాల్యంలో కష్టాలు- వయస్సు వచ్చిన కొద్దీ సుఖపడతారు. జన్మస్థానానికి ఆగ్నేయ దక్షిణ దిశలో చాలా దూరంలో స్వార్జితంతోనే స్థిరపడతారు. 2018లో మంచి యోగం కలదు.
బసవరాజు సూర్యప్రకాశ్, మధిర, ఖమ్మం
ప్ర: మూలా నక్షత్రం, నాలుగవపాదం. వివాహయోగం ఎప్పుడు?
సమా:మూలా నాల్గవ పాదం కావటం శుభమే కానీ మూలా నక్షత్రం అమ్మాయినిచ్చిన మామగారికి గండ కారణంగా చెపుతారు. బహుశా అందుకే దగ్గరదాకా వచ్చిన సంబంధాలు దూరమైపోతున్నాయి. అక్టోబర్‌లో మీకు వివాహ యోగం రాగలదు.
బి.సాయిరామ్, బాలాజీనగర్, గుంటూరు
ప్ర:ఎమ్.బి.ఏ ప్యాసయ్యాను. అసంబంధంగా ఉన్నత డిగ్రీలను కూడా చదువుతున్నాను. మనశ్శాంతి లేదు. స్థిరత్వం లేదు. వివాహితుణ్ణి. ఆర్థిక సమస్యలున్నాయి. మంచి ఉద్యోగం రాగలదా?
సమా:ఆలస్యంగా సంఘర్షణాత్మకంగా అభివృద్ధి సాధించగలరు. మీకు తలకు సంబంధించిన ఒక ఒత్తిడి కారణంగా కాని ఘాత కారణంగా కాని బాధ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఉష్ణ పదార్థాలు తగ్గించుకోండి. ఏదైనా వ్యసనం కూడా ఉండే అవకాశం ఉంది. నియంత్రణ పాటించండి. అదృష్టం బాగుంది.
ఎ.కిషన్‌కుమార్, జగన్నాధపురం, కాకినాడ
ప్ర:వివాహయోగం?
సమా:ఇంకా ఆలస్యం ఉంది. ‘కన్యా పాశుపత రుద్రాభిషేకం’ చేయించండి.
బి.వి.శాస్ర్తీ, ఉప్పల్, హైదరాబాద్
ప్ర:నేను బ్యాంకు ఉద్యోగంలో కొనసాగగలనా?
సమా:కొనసాగుతారు.
పి.చక్రపాణి, హిందూపూర్, ఆంధ్ర
ప్ర:నాకు లెక్చరర్ ఉద్యోగమా? సాఫ్ట్‌వేర్ ఉద్యోగమా?
సమా:లెక్చరర్ ఉద్యోగమే వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ యోగం కూడా బాగానే ఉంది. ఆగస్ట్, సెప్టెంబర్‌లలో శుభం జరుగును.
ఎల్.వెంకట సుబ్బారావు, రేపల్లె, గుంటూరు
ప్ర:వివాహం ఏ దిశ- ఏ అక్షరాలు?
సమా:దక్షిణ- ఆగ్నేయ దిశలు- వ - క - స అక్షాలు
వి.జె.ఈశ్వరి, విజయవాడ
ప్ర:మా బాబుకు విద్యా విఘ్నాలు కలుగకుండా ఏం చేయాలి?
సమా:విఘ్నేశ్వరునికి తేనెలో ముంచిన కుడుములు ప్రతి సోమవారం నివేదన చేయండి.
వి.సౌమ్య, విజయవాడ
ప్ర:ఇంటర్ తరువాత ఏది యోగిస్తుంది?
సమా:లెక్చరర్‌గా ఉండటానికి అనువుగా తీసుకోండి.
డి.ఎన్.రాజ్యలక్ష్మి, తెనాలి
ప్ర:నా వయస్సు 73 సంవత్సరాలు. ఆరోగ్యం ఫర్వాలేదు. నా శేషజీవితం కొరకు సంతాన శ్రేయస్సు కోసం ఏం చేయాలి?
సమా:సిద్ధ పురుషులనుండి గౌరీ పంచాక్షరీ ఉపదేశం పొందండి. అక్షర లక్షలు జపం చేయండి. అన్నీ సిద్ధిస్తాయి.
ఎన్.దుర్గావల్లి, గుంటూరు
ప్ర:నేను ఒక సీనియర్ న్యాయవాది వద్ద పనిచేస్తున్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా:మీ జాతకంలో శని దోషం ఉంది. శనివార వెంకటేశ్వర వ్రతం చేయండి. అంకితభావంతో పనిచేయండి. ఆలస్యంగా అభివృద్ధికి రాగలదు.
నాగ సాయి లక్ష్మీదుర్గ, చీరాల
ప్ర:నాకు ప్రభుత్వోద్యోగమా? ప్రైవేటా?
సమా:ప్రభుత్వోద్యోగ యోగం ఉంది.
బూదే అశ్వినీ, గుంటూరు,
ప్ర:నాకు కెనడా వెళ్ళే యోగం కలదా?
సమా:జూలై, ఆగస్టులలో కొంత శుభము జరుగును.
హేమమల్లికార్జునరావు, గుంటూరు
ప్ర:టింబర్ డిపో వారి లీగల్ నోటీసు పరిణామాలు చెప్పండి.
సమా:మీ వైపు కేసు బలహీనంగా ఉంది. వివాదాన్ని పెంచుకుంటే మరింత ధననష్టమే- రాజీతో పరిష్కరించుకోండి.
కె.రేఖ, బేగంపేట, హైదరాబాద్
ప్ర:వివాహయోగం ఎప్పుడు?
సమా:మీ జాతకంలో శని-శుక్ర- బుధ గ్రహాలు దోషంగా ఉన్నాయి. ఇంట్లోనే ఒక పదకొండు శనివారాలు వేంకటేశ్వర కల్యాణం చేయండి. తప్పక శుభం జరుగుతుంది.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

ఉమాపతి బి.శర్మ