భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ.పూర్ణచంద్రరావు, నాయుడుపేట (ఆంధ్ర)
ప్ర: హిందూ మతంలో ధర్మశాస్త్రానికున్న ప్రాశస్త్యం మరే మతంలోనూ లేదు. కారణమేమిటి?
సమా: మొట్టమొదటగా మనం గుర్తించవలసినది, హిందూత్వ మతం కాదు- (మతమంటే వ్యక్తిగతమైన ఒకరి అభిమతం)- హిందూత్వం అపౌరుషేయమైన వేదవిజ్ఞానానికి సంబంధించిన సనాతన జీవన విధానానికి ఆధారం. ‘సత్యధర్మాలు’- వ్యక్తి- సమాజ చరాచర ప్రకృతి- ఆత్మ- పరమాత్మ- విషయ సమాహార అధివాస్తవికతలు ‘సత్యధర్మాలు’. స్థూలంగా ధర్మ- అర్థ- కామ-మోక్షాలనే పురుషార్థాలు- వాటి నిర్వహణలో ఏర్పడే ఆటంకాలైన కామ- క్రోధ - లోభ - మద - మోహ- మాత్సర్యాలనే అరిషడ్వర్గాలనే దుర్గుణాలని గుర్తించి తన్నివారణగా సత్య ధర్మాలను ఆధారం చేశారు. అందుకే మనకు ధర్మశాస్త్ర ప్రాశస్త్యం ప్రాధాన్యం ఎక్కువ. మిగతా మతాలు కొందరు ప్రతిభావంతులైన ఆధ్యాత్మిక జీవనులు ఏర్పరచిన వ్యక్తి యొక్క స్వయం ఆలోచనా విధానం లేని విశ్వాస ప్రధానమైన ఆచరణాలు- అందుకే అవి మతాలు- మనవి సత్యధర్మాలు- ధర్మశాస్త్రాలు-

ఎ.శేషాద్రిరెడ్డి, హిందూపురం (ఆంధ్ర)
ప్ర: నేను ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. నాకు ఆ బుద్ధి ఎందుకు కలిగింది?
సమా: దైవ విశ్వాసం- శాస్త్ర విశ్వాసం లేనందువలన అలా జరిగింది. దైవాన్ని నమ్మండి.

జి.వి.డి.వి. - సింగపూర్
ప్ర: మావారు జూలైలో అమరనాథ్ యాత్రకు వెడుతున్నారు. నాలో ఏదో తెలియని గాభరా- ఆవేదన- ఆందోళన కలుగుతోంది. దయచేసి పరిష్కారం చెప్పండి.
సమా: మీకు సంస్కృత పరిజ్ఞానముంటే కనక ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం ప్రతిరోజూ మూడుసార్లు పారాయణం చేయండి! లేదంటే మంచి పండితులతో శ్రీమత్సుందరకాండ పారాయణ చేయించండి (ఆయన యాత్ర ముగించి వచ్చేదాకా)-

రమాదేవి, అనంతపురం (ఆంధ్ర)
ప్ర: ఎంతో ప్రేమగా ఉండే అన్నయ్యతో అభిప్రాయ భేదాలు వచ్చాయి. మనశ్శాంతి లేదు. తొలగాలంటే ఏం చేయాలి.?
సమా: ‘వౌనేన కలహం నాస్తి’ ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఎవ్వరి ముందూ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయకండి. కొందరు కలహాన్ని పెంచాలని ఏవేవో చెపుతుంటారు. అలాంటివి వినకండి, అనకండి! కొన్నాళ్లు వౌనంగా ఉండండి. అవే సర్దుకుంటాయి.
ఎస్.వి.రావు, నెల్లూరు, (ఆంధ్ర)
ప్ర: అన్నదమ్ములమధ్య ఆస్తి వివాదం- అన్నయ్య కూతురు అధిక్షేపణ వాక్యాలు- మనోవేదన- పరిష్కారం చెప్పండి.?
సమా: ‘పెద్ద నోటితో అని చిన్న నోటితో పడవద్దు’ అని సామెత- మీకంటే చిన్నవారితో వాదించకండి. మీ బంధువులలో పెద్దవారి సలహా సహకారం పొందండి.

ఎన్.వి.జ్యోతిప్రసాద్, విజయవాడ (కృష్ణా)
ప్ర: శర్మగారూ! మన దేశానికి రాష్టప్రతి ఎవరు కాగలరో చెప్పగలరా? జ్యోతిష శాస్త్ర ఆధారంగా.
సమా: ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే అధికారం నాకు లేదు. అయితే కాబోయే రాష్టప్రతి ప్రథమాక్షరాలు మాత్రం ‘ర, ప, వ, క, స’తో ప్రారంభవౌతాయి. కన్యా- మిథున- కర్కాటక- తులారాశులవారు అయ్యే అవకాశం ఉంది. సాయన పద్ధతిలోనైనా- నిరయన పద్ధతిలోనైనా- నేనూ గుర్తుంచుకుంటాను - మీరూ గుర్తుంచుకోండి.

వి.రామకృష్ణ, చిన్నబారాటం (శ్రీకాకుళం)
ప్ర: వివాహం ఎప్పుడు జరగవచ్చు?
సమా: మీ జాతకంలో కుజ- శని దోషాలు కళత్ర స్థానానికి సంక్రమించాయి. ఇంకా ఆలస్యముంది. తగు నివారణ శాంతి పూజలు చేయించుకోండి.

బొట్ల అమరనాధ్, జోగిపేట (తెలంగాణ)
ప్ర: ఉద్యోగమా? - వ్యాపారమా? దేన్లో రాణించగలను?
సమా: వ్యాపారమే- ఇనుము - సిమెంట్- గృహ నిర్మాణ, నిర్వహణ పరికరాలు యోగిస్తాయి. గవర్నమెంటల్ స్టాంప్స్ కూడా అనుకూలమే.

కేతేపల్లి చిట్టెమ్మ, కొత్తగూడెం (తెలంగాణ)
ప్ర: నేను రెండు సంవత్సరాలలో మూడుసార్లు క్రిందపడ్డాను. ఆపరేషన్ అయినది. కారణమేమిటి? పరిష్కారమేమిటి?
సమా: జన్మ జాతకంలో కుజ - శనుల కారణంగా ఏర్పడే గండ యోగాలవలన అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఆది- మంగళవారాలు తెల్ల జిల్లేడు పూలతో మినప వడలు నైవేద్యంగా ఆంజనేయస్వామికి పూజలు జరిపించండి!

కె.వి.లక్ష్మి, మచిలీపట్నం (కృష్ణా)
ప్ర: వివాహ విషయంలో మీరు చెప్పిన పరిష్కార పద్ధతులు పాటిస్తున్నాను. వివాహ యోగం ఎప్పుడు?
సమా: మీరు ‘సంఖ్య’ వ్రాయటం మరచిపోయారు. ఇంకా ఆలస్యముంది!

పూసర్ల రామారావు, కొత్తపాడు (ఆంధ్ర)
ప్ర: నాకు వాహనయోగం- స్థానచలనం- గృహ మార్పు వున్నదా?
సమా: వాహనయోగం అనుకూలంగా లేదు. ఇల్లు మారతారు- దక్షిణ- ఆగ్నేయ దిశల వైపు స్థానచలనం ఉన్నది.

వి.మహంద్ర- మంగళగిరి - (గుంటూరు)
ప్ర: ఇల్లు అమ్మకం ఎప్పుడు జరగవచ్చు?
సమా: మీలో స్థిర నిశ్చయం లేదు- ఆలస్యం కాగలదు.

సమీద్, కర్నూలు (ఆంధ్ర)
ప్ర: స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు- మళ్లీ కలవగలమా?
సమా: తప్పక కలవగలరు. మీ స్నేహితుడే కొంచెం తొందర పడ్డట్టున్నాడు. తెలుసుకుంటాడు. మంచి జరుగుతుంది.

వై.సంపత్, వికారాబాద్ (తెలంగాణ)
ప్ర: ఉద్యోగమా? వ్యాపారమా?
సమా: రెండూ చేసే అవకాశముంది. బహుశా భార్యామూలకంగా వ్యాపార ధనం లభించవచ్చు.

వెలువర్తి ఇందిరాదేవి, విజయవాడ (కృష్ణా)
ప్ర: ఇల్లు అమ్మకం సాధ్యమేనా?
సమా: త్వరలోనే అమ్మకం కాగలదు. ఎవరైనా మహిళ కొనుక్కునే అవకాశముంటుంది. అయితే కొనేవారికి మాత్రం బేరం జరిగిన తరువాత కొన్ని ఆటంకాలు రావచ్చు. ఆ కారణంగా కొనుగోలు వ్యవహారం ఆలస్యం కావచ్చు. జాగ్రత్త అవసరం.

గంటా కామేశ్, రాజమండ్రి, తూ.గో.
ప్ర: వివాహం - భార్య అనుకూలవతి ఔతుందా?
సమా: వివాహం- నైరుతి దిశ నుండి యోగం మిమ్ములను అనుకూలురుగా చేసుకోగల చతురమతి రాగలదు.

ఎన్.వి.రత్నాజీరావు, అనకాపల్లి (విశాఖపట్నం)
ప్ర: విపరీతమైన ఋణబాధలు వేధిస్తున్నాయి.- ఈ జన్మకు ఇంతేనా?
సమా: క్రమపద్ధతిలో ప్రతి మంగళవారం అహోబల నరసింహస్వామిని దర్శించి అర్చించండి. మంచి జరుగుతుంది.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ