భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్.ప్రియ, కౌంతేయ గ్రామం (ప.గో.)
ప్ర: కంటిచూపు ఎడమవైపు కాటరాక్ట్ వలన పోయింది. ఆపరేషన్ చేయించుకొనే స్థోమత లేదు. ఏ గ్రహ దోషంవలన ఇలా జరిగింది. పరిష్కారం చెప్పండి.
సమా: జాతకంలో రవిగ్రహ దోషంవలన నేత్ర దృష్టి మీద ప్రభావం చేస్తుంది. ప్రతి ఆదివారం కొన్ని గోధుమలు, పది రూపాయలు ఎఱ్ఱని దేహఛాయగల బ్రాహ్మణునికి దానం చేయండి. హోమియోలో మంచి మందులున్నాయి. బెల్లడొన, నేట్రమూర్ 6ఎక్స్, పల్సటిల్లా వంటివి చెప్పారు. డాక్టర్‌గారి సలహాతో నేట్రమూర్ 6ఎక్స్ వాడండి. డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోండి. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక శుభ్రమైన గుడ్డను నోటిలో లాలాజలం తగిలేట్టుగా కంటిపైన అద్దండి. కొంత మార్పు కనిపిస్తుంది.
జి.మంగతాయారు, చినమామిడిపల్లి (ప.గో.)
ప్ర: నాకు జాతకంలో రవిచంద్రుల దోషం కారణంగా నా ఆస్తి పరుల పాలయింది. పరిహారం- పరిష్కారం చెప్పండి.
సమా: మీ ఆస్తి పరులపాలు కావటానికి రవిచంద్రుల దోషం కాదు. రాహు కేతువుల దోషం. మంచి సద్బ్రాహ్మణుని చేత విష్ణుసహస్రనామాలతో వేంకటేశ్వర పూజ చేయించండి. శుభం కలుగును.
ఎమ్.ప్రియాంక, నరసాపురం (గుంటూరు)
ప్ర: స్వగృహం లేక అద్దె ఇళ్ళల్లో నరకయాతన అనుభవిస్తున్నాను. స్వగృహయోగానికి ఏం చేయాలి?
సమా: గత జన్మలో కాని ఈ జన్మలో కాని పిట్టగూళ్ళు- చీమల పుట్టలు- పాముల పుట్టలు వంటివి చెడగొట్టితే ఆ పాప ఫలం గృహ సుఖం లేకుండా చేస్తుంది. నెలకొకసారి చొప్పున తిరుమలను కాలినడకన వెడుతూ ప్రక్కనగల చెట్లల్లో చిన్నగా రాళ్ళతో కాని, మట్టితో కాని గుజ్జనగూళ్ళు ఏడు సంఖ్యతో కట్టండి. మీకు ఎటువంటి స్వగృహం లభిస్తే అలాంటిదే వెండితో చిన్నగా చేయించి హుండీలో వేస్తామని స్వామికి మొక్కండి. స్వగృహం కలుగుతుంది. తరువాత తప్పక మొక్కు చెల్లించండి.
ఎమ్.సూర్య, వరిధనం (ప.గో.)
ప్ర: భూసమస్యలు తీరాలంటే కుజగ్రహానికి ఏమి పూజ చేయాలి.
సమా: ప్రతి మంగళవారం కుజ గౌరీవ్రతం చేయండి. సుబ్రహ్మణ్యస్వామికి నిమ్మ పండ్ల పులిహోరతో, జిలేబీల నివేదనతో ఎఱ్ఱని పూలతో అర్చన చేయించండి. వీలయితే మంగళవారం రాత్రి భోజనంగా ఉపవాసం పాటించండి.
వి.విక్రమాచారి, యూసుఫ్‌గూడ, హైదరాబాద్
ప్ర: బుద్ధపౌర్ణమినాడు జన్మించాను. భవిష్యత్తు ఎలా ఉంటుంది.
సమా: బాగా దేశాటనం చేస్తారు. బాగానే ఉంటుంది.
--- వెస్ట్‌మారేడ్‌పల్లి, సికింద్రాబాద్ (తెలంగాణ)
ప్ర: జయమాలిని అనే అమ్మాయి గురించి జగతిగారి ప్రశ్న?
సమా: ఆ అమ్మాయి జన్మతేదీ తెలిపితే బాగుండేది. లీలగా పరిశీలిస్తే ఆమెపైన ఏదో జలగ్రహ దోషం పీడిస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే నీటిలోబడి చనిపోయినవారి ఆత్మ పీడన- ఈ అమ్మాయికి నీటిలో ప్రమాదం జరిగినపుడే సోకినట్లుగా కనిస్తోంది. ఆమె పూర్తి జాతకం తెలిపితే బాగుండేది. ఏమైనా ఆమెకు నీటి ప్రమాదం ఏదైనా జరిగిందా తెలుసుకోండి.
టి.ఎస్.మైత్రేయి, దిల్‌సుక్‌నగర్, హైదరాబాద్
ప్ర: సౌఖ్యం లేని వివాహం- మనశ్శాంతి లేదు- ఎలా కొనసాగుతుంది?
సమా: ‘సంతృప్తి అనేది సహజసిద్ధమైన సంపద’ అని ఇంగ్లీషులో సామెత- మీరిచ్చిన సంఖ్య ప్రకారం మీకు కుటుంబంలోకంటే సామాజిక రంగంలో ఏదో చేయాలనే తపన ఉన్నట్టు కనిపిస్తోంది. పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతుల సేవలో దాంపత్య బాధలు దూరమవుతాయి.
రెడ్డిచర్ల రఘునాధ్, విజయవాడ, కృష్ణా
ప్ర: నాకు కళాకారుల పెన్షన్ వస్తుందా? ప్రయత్నం ఫలిస్తుందా?
సమా: నవంబర్ తరువాత 2018లో ఒక మంచి మార్పు వచ్చే అవకాశం వుంది.
మేకల రాజు, చిన్నకోడూర్, యాదాద్రి
ప్ర: వివాహాలస్యం- జీవితంలో అంతా ప్రతికూలమే-
సమా: మీలో ఒకవిధమైన అనిశ్చిత స్థితి ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకే ఒక లక్ష్యంతో ఒకే ఒక స్థిరనిశ్చయంతో ప్రయత్నించండి. ఇతరుల ప్రభావం మీ మీద తొందరగా పనిచేస్తుంది. స్వతంత్రమైన ఆలోచన చేయండి.
వై.శకుంతల, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్
ప్ర: అనారోగ్యం- ఉద్యోగ సమస్య
సమా: అనారోగ్యం ఉదర భాగంలో కనిపిస్తోంది. స్కానింగ్ చేయిస్తే విషయం బోధపడుతుంది. ఉద్యోగ విషయంలో కాని కుటుంబ విషయకంగా కాని డిసెంబర్ తరువాత సంతృప్తిని కలిగిస్తుంది.
ఎస్.్భస్కర్, హన్మకొండ, వరంగల్
ప్ర: వివాహం - ఉద్యోగం-
సమా: వివాహం- తూర్పు వైపు యోగం- ఎస్- ఎమ్- సి- బి- అక్షరాలు. ఉద్యోగం నైఋతి దిశలో దూర దేశంలో బహుశా కర్నాటక బెంగుళూర్ కావచ్చు.
ఆర్.దీపమాల, మల్కాజిగిరి, హైదరాబాద్
ప్ర: వివాహం ఎప్పుడు- నా యోగ సాధన ఎలా వుంటుంది?
సమా: రెండూ పరస్పర విరుద్ధమైన ప్రశ్నలు- మీ మనస్సులో వివాహం గురించి తపన లేదు. ధనార్జన- ప్రయాణం- బంధు విషయాలు కనబడుతున్నాయి. ఇవి మాత్రం డిసెంబర్ నెలలో మంచి మార్పు రాగలదు. వివాహం ఆలస్యం- మీ కారణంగానే యోగ సాధన- ఆటంకాలు లేకుండా సాధన చేయాలి. ఆరోగ్యం ఊపిరితిత్తులు బలహీనత-
వి.కృష్ణ- ప్రకాశనగర్, నరసరావుపేట
ప్ర: నేను వైద్య విద్యలో సర్జన్‌గా రాణించగలనా?
సమా: మొదట విద్యా కోర్సు పూర్తిచేయండి. విదేశీయాన యోగం కూడా వుంది.
జగతీబాయి, మల్కాజిగిరి, హైదరాబాద్
ప్ర: నాకు ఒక పెద్ద మనిషి- అమ్మవారు కలలో కనిపించి మోక్షం ఇస్తుందని చెప్పినాడు. కాని ఏమీ కనిపించలేదు. కారణం చెప్పండి.
సమా: భ్రమల్లో పడకండి. మోసపు మాటలు వినకండి. మీకు తోచిన దేవతా సేవ నిర్మలమైన మనస్సుతో చేయండి.
ఖండవల్లి వీరభద్రరావు, రామచంద్రాపురం
ప్ర: ఈ సంవత్సరం ఆరంభంనుండి కుటుంబ సమస్యలు ప్రారంభమయ్యాయి. పరిష్కారం చెప్పండి.
సమా: ప్రతిరోజూ త్రిశూల పాశుపత విధానంతో ఈశ్వరాభిషేకం చేయించండి. గ్రహస్థితులు అనుకూలిస్తాయి.
రాజగోపాలరావు, బరంపురం (ఒడిస్సా)
ప్ర: గురువుగారూ! మీ సమాధానాలు ఎందరికో ఉపకరిస్తున్నాయి. నాకూ మీ మీద గురి గౌరవం- భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తూంటాను. నాది చిత్రా నక్షత్రం- తులారాశి మేషలగ్నం- నా భవిష్యత్తు ఎలా వుంటుంది?
సమా: మీకు నా ధన్యవాదాలు. మీరు వ్రాసిన వ్రాలు- మీ నంబరు రీత్యా గుణిస్తే మీరు వృషభలగ్న జాతకులుగా కనిపిస్తున్నారు. మేషలగ్నం కాదు. డిసెంబర్ నుండి వచ్చే సంవత్సరమంతా మీకు బాగుంటుంది. దైవసేవ మరువకండి.
జి.సురేష్, చినమామిడిపల్లి (ప.గో.)
ప్ర: గురుచండాల యోగానికి నివారణ ఏమిటి?
సమా: గురువారం ఉపవాసం- దత్తాత్రేయ స్వామికి అర్చన నివారణ
ఆదిమూలం శ్రీకాంత్, గాజువాక, వైజాగ్
ప్ర: నేను మైనింగ్ ఎక్స్‌పోర్ట్ బ్రోకర్‌గా ప్రయత్నిస్తున్నాను. ఎప్పటికి రాణించగలం
సమా: బాగానే రాణించగలరు కాని కొంతకాలం వరకు మాత్రమే- ఇందు ఒక సంవత్సరకాలం చక్కగా ఉంటుంది. ఆ తరువాత మీ వ్యాపారంలో మరొకరు కూడా ప్రవేశించే అవకాశం ఉంది. దాని కారణంగా సమస్యలు రాగలవు.

ఎమ్.దీప, పాలకొల్లు (ప.గో.)
ప్ర: అనారోగ్యం- అవయవాలన్నీ తడారిపోతున్నాయి. నీరసించిపోతున్నాను. దైవసేవ- ఔషధ సేవ తెలుపండి.
సమా: దైవసేవగా శ్రీమత్సుందరకాండ సద్బ్రాహ్మణునిచేత చేయించి (నలభై రోజులు) పారాయణ- తీర్థం తీసుకోండి. ఔషధసేవ హోమియోలో కార్బోలెజ్ 6ఎక్స్ కాని డాక్టర్ చెప్పిన పోటెన్సీలో వాడండి. మార్పు రాగలదు.
ఎస్.సి.ఆర్ (పూర్తిపేరు లేదు), విజయవాడ (కృష్ణా)
ప్ర: ఆరోగ్య సమస్య- మానసికంగా అశాంతి- కోర్టు సమస్యలు
సమా: కోర్టు లాయర్‌గారి ఖర్చుకంటే ‘మన్యుపాశుపత’ విధానంగా మంచి బ్రాహ్మణుల చేత ఈశ్వరాభిషేకం చేయించండి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ................................................................... ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

దివ్యజ్ఞాన విభూషణ ఉమాపతి బి.శర్మ