భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్.కోమలకుమారి, పాయకరావుపేట (వైజాగ్)
ప్ర: పక్షవాత రోగంతో బాధపడుతున్నాను. రోగ విముక్తి కలుగుతుందా?
సమా: అమ్మా! ‘పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతి’ అని పెద్దలు చెప్పిన శాస్తవ్రాక్యం. పక్షవాతం వంటిది దీర్ఘకాలిక రోగం. ప్రారంభ దశలోనే జాగ్రత్తపడితే కుదురుకుంటుంది. ముదిరిన తరువాత చాలా కష్టం. హోమియోలో ఫలితం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మంచి హోమియో వైద్యం- ఫిజియోథెరపీతో నివారణ జరుగవచ్చు. దైవసేవగా సద్బ్రాహ్మణుని చేత శ్రీమత్సుందరకాండ పారాయణం నలభై రోజులు దీక్షగా చేయించి తీర్థప్రసాదం తీసుకోండి.

పి.ప్రసాదరావు, గుంటూరు, ఆంధ్ర
ప్ర: నాకు జ్యోతిష్యం - సంఖ్యాశాస్త్రం- వాస్తు మొదలైన వాటిలో చెప్పుకోతగ్గ ప్రవేశం ఉంది. రాణింపు లేదు. వృత్తిపరంగా ఏం చేయమంటారు?
సమా: ఏ విద్యయైనా రాణించాలంటే ఉపాసనా బలం ఉండాలి. జ్యోతిష గౌరీ పరమేశ్వర మహామంత్రాన్ని ఉపదేశం పొందండి! బాసర క్షేత్రంలో కాని- మూకాంబికా క్షేత్రంలో కాని నిష్టగా జపానుష్ఠానం చేయండి. ఫలిస్తుంది.

పి.లావణ్య, విజయనగరం (ఆంధ్ర)
ప్ర: వివాహయోగం?
సమా: 2018 మే, జూన్‌లలో పడమర దిశ నుండి యోగం- రీ - న - ప - ల అక్షరాలు.

ఆర్.మోహన సాత్విక, కాకినాడ (ఆంధ్ర)
ప్ర: నాకు విద్యాయోగం గురించి చెప్పండి?
సమా: స్వతహాగా మీ స్వభావం కష్టపడే స్వభావం కాదు. ఏదోవిధంగా ప్రారంభించినది గట్టెక్కగలరు. విద్యావంతులకంటే తెలివికలవారు అనిపించుకోగలరు.

కె.వి.వి.ఎస్.కుమార్, విజయనగరం (ఆంధ్ర)
ప్ర: నేను ఏ రంగంలో రాణించగలను? భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా: చంచల స్వభావం- గొప్పవాణ్ణి కావాలనే మహత్వాకాంక్షలూ ఉన్నాయి. ఏదైనా క్షేత్రస్థాయి వృత్తిలో (్ఫల్డ్‌వర్క్) రాణించగలరు. జీవిత భీమా- ఏజెన్సీ వ్యాపారాలు సాంఘిక సేవా కార్యక్రమాలు బాగుంటాయి. అయితే జీవితం సంఘర్షణాత్మకంగా అనేక మార్గాలుగా ప్రయాణిస్తుంది. ఏక లక్ష్యంతో ప్రయత్నిస్తే మంచిది.

జె.పూజిత, హనుమాన్‌పాలెం (ప్రకాశం)
ప్ర: వివాహం ఎపుడు?
సమా: తూర్పు వైపు యోగం- స - ప - మ - జ అక్షరాలు. 2018లో అనుకూలం. స్వయంవరం కూడా కావచ్చు!

ఎమ్.అనూరాధ, పాలకొల్లు (ప.గో.)
ప్ర: నేను ఏ చదువు చదివితే మంచిది. విదేశీ ప్రయాణం యోగం ఉందా?
సమా: భాషా సంబంధం (లిటరేచర్), చరిత్ర సంబంధం- జల భూగర్భ శాస్త్రాలు- పత్రికా రచన గ్రంథాలయ ఉద్యోగాలు బాగుంటాయి. మెడిసిన్ కూడా ఫరవాలేదు. విదేశీ ప్రయాణయోగం ఉంది.

ఎల్.వెంకట సుబ్బారావు, రేపల్లె (గుంటూరు)
ప్ర: ఉద్యోగమా? వ్యాపారమా?
సమా: వ్యాపారమే- మెడికల్- కెమికల్ - అలంకార ద్రవ్యాలు- స్పోర్ట్స్ ఉపకరణాలు మొదలైనవి.

ఇ.పి.ఆర్.స్వామి, కర్నూలు (ఆంధ్ర)
ప్ర: నరాల జబ్బు- పాదాలు - కాళ్ళల్లో ఉబ్బు- నీరు- తగ్గుతుందా?
సమా: మీ సమస్యకు మధుమేహం కూడా కారణం కావచ్చు. ‘షుగర్’ పరీక్ష చేయించుకోండి. సహజంగా నడక లేకపోయినా ఆ సమస్య వస్తుంది. రక్తహీనతవల్ల కూడా వస్తుంది. ఆయుర్వేదంలో అశ్వగంధం లేహ్యం (షుగర్ లేకపోతే), హోమియోలో కార్బోవెజ్, బరైటా కార్బ్‌లు డాక్టర్ సలహాతో వాడండి.

వై.కృపాచారి, నామాలగుండు (సికింద్రాబాద్)
ప్ర: ప్రస్తుతం చీటీల వ్యాపారం (చిట్టీల వ్యాపారం) చేస్తున్నాను. కలిసి రాగలదా?
సమా: మీ వ్యాపారం సమూహానికి సంబంధించినది కనుక వారి జాతక గ్రహచార ప్రభావాలూ పనిచేస్తాయి. ఖచ్చితంగా చెప్పటం సాధ్యంకాదు. జాగ్రత్త అవసరం.

డి.శ్రీనివాసులు, అత్తాపూర్, హైదరాబాద్
ప్ర: అబ్బాయి- వివాహం- జాతక చక్ర పరిశీలన.
సమా: మీ అబ్బాయి జాతకంలో బలమైన శుక్రదోషం ఉంది. దాని ప్రభావంవలన వివాహం తరువాత కూడా సమస్యలు రావచ్చు! తగు విధంగా పరిహార శాంతులు చేయించండి. వీలయితే వ్యక్తిగతంగా కలవండి.

తోట నిర్మల, విజయవాడ (కృష్ణా)
ప్ర: ప్రభుత్వం నుండి ఇంటికోసం ప్రయత్నం చేస్తున్నాను. ఫలించగలదా?
సమా: ఫలించే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నించండి. విఘ్నకారకులకు ప్రతిగా విఘ్నేశ్వర సేవ జరపండి.

కె.రామారావు, ఎమ్మిగనూరు (కర్నూలు)
ప్ర: కుమారుని జాతక పరిశీలన- వివాహ ప్రశ్న
సమా: మీ కుమారుని జాతకంలో కళత్రస్థానానికి కుజ- శుక్ర- కేతుయుతి- శని నీచ దోషాలు ఉన్నాయి. తగు విధమైన పరిహార దైవ సేవలు చేయించండి. వీలయితే వ్యక్తిగతంగా కలవండి.

బి.వి.సుబ్రహ్మణ్యశాస్ర్తీ, ఉప్పల్, హైదరాబాద్
ప్ర: ఆరోగ్య సమస్య?
సమా: మీకు సర్జరీ తప్పేట్టు లేదు. తగు జాగ్రత్తలతో దైవ సేవతో వైద్యుల సలహాతో ముందుకు వెళ్లండి.

పి.వెంకట శివప్రసాద్, అద్దంకి (ప్రకాశం)
ప్ర: పాతికేళ్లుగా ‘బుక్‌షాప్’ ఎదుగుదల లేదు. ఏం చేయమంటారు?
సమా: ప్రతిరోజూ నియమం తప్పకండా శివాలాయంలో శివలింగానికి పంచామృతాభిషేకం చేయండి. తగు సంకల్పంతో కూడా అభివృద్ధి కలుగుతుంది.

ఎ.దక్షిణామూర్తి, బాలాజీనగర్, సికింద్రాబాద్
ప్ర: అమ్మాయి వివాహం. పది సంవత్సరాలుగా విఫల ప్రయత్నం?
సమా: వర పాశుపత రుద్రాభిషేకాలు చేయించండి.

భరత్‌సాయి, నెల్లూరు, ఆంధ్ర
ప్ర: ప్రభుత్వోద్యోగ యోగం
సమా: నైఋతి దిశలో కూడా బాంకింగ్ రంగంలో అవకాశం వుంది.

దోర్నాల జగదయ్య, చిన్నకొండూర్, యాదాద్రి, భువనగిరి
ప్ర: ఉద్యోగం- వివాహం?
సమా: వివాహం మీ మూలంగానే ఆలస్యం. ఉద్యోగం- ప్రభుత్వోద్యోగ అవకాశాలు లేవు. స్వంత వ్యాపారం ఇనుము సిమెంట్ వంటివి యోగిస్తాయి.

బి.జాహ్నవి, పెదకడిమి (ప.గో.)
ప్ర: కుటుంబంలో దాంపత్య సమస్యలు- దగ్గరి బంధువులతో వివాదం
సమా: మాట విననివారి ముందు ‘వౌనమే’ సరియైన మార్గం- అందరినీ దారికి తేగలగటానికి జీవితం సినిమా కాదు. మీ వరకు మీరు వివాదాస్పదం కాకుండా వౌనాన్ని పాటించండి.

ఎమ్.అనూహ్య, తెల్లంపర్రు, ప.గో.
ప్ర: అష్టమ శని దోషానికి ఏం చేయాలి?
సమా: శనివార వెంకటేశ్వరస్వామి వ్రతం చేయండి. శుభం కలుగుతుంది.

* * *
పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

ఉమాపతి బి.శర్మ ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ