భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.రమాదేవి, అనంతపురం (ఆంధ్ర)
ప్ర: నవరాత్రుల సందర్భంలో కొబ్బరికాయ కొడితే అది మురుగుకాయగా తేలింది. దానివలన ఏమయినా దోషమా?
సమా: భగవంతుని ముందు కొట్టిన కొబ్బరికాయ మురుగు చూపితే వెంటనే మరొక మంచి కాయ కొట్టి సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టినంతనే సమర్పించినట్లుగాదు- మంత్ర పూతంగా నివేదించినప్పుడే అది నివేదన అవుతుంది. అందువల్ల వెంటనే మంచి కాయ తెప్పించి కొట్టాలి. కొబ్బరికాయ మురుగు రావటం యాదృచ్ఛికం- చెడు మాత్రం కాదు. అనవసరమైన అపోహలు పెంచుకోకండి!
ఎమ్.రాజు, హుజూరాబాద్ (తెలంగాణ)
ప్ర: నాకు ముక్తి- మోక్షం- ఈ జన్మలోనే పొందాలని ఉంది. దానికి మార్గం చెప్పండి.
సమా: మోక్షం అనేది కోరంగానేనో- లాటరీలాగానో వచ్చేది కాదు. జన్మ జన్మాంతర కర్మల (సత్కర్మల) పరిణామ ఫలం మోక్షం- ఇక సులభంగా కావాలనుకుంటే చిత్తశుద్ధితో ఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తూ- బ్రహ్మ చర్య గృహస్థాశ్రమ వానప్రస్థ సన్యాస ధర్మాలను అనుసరించాలి. అయితే అన్నీ శాస్త్ర పద్ధతిలో క్రమపద్ధతిలో జరగాలి.
పెండ్యాల సుబ్రహ్మణ్య ప్రసాద్, కరీంనగర్, తెలంగాణ
ప్ర: పండుగ సందర్భంగా పటాకలు (టపాకాయలు మొదలైనవి) కాల్చరాదని కోర్టు నిర్ణయించటం భావ్యమేనా? ప్రతిరోజూ ఉదయం నుండి 24 గంటలు పనిచేసే ఫ్యాక్టరీల ధూళి- ధూమం- ప్రత్యక్షంగా వాయు జల కాలుష్యాలను కలిగిస్తోంది. ఇంకా ఎనె్నన్నో కారణాలవలన వాయు కాలుష్యం - జల కాలుష్యాలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ వదలి ఏడాదికొకసారి అది కూడా ఒక రోజు రాత్రి మాత్రమే జరుపుకొనే పటాకల సంబరాన్ని నిషేధించటం సమంజసమేనా?
సమా: న్యాయస్థాన నిర్ణయాలను చట్టపరిధిలోనే ప్రశ్నించాలి. కోర్టులోనే పిటీషన్లు వేయవచ్చు. కోర్టువారు ఏదీ తమంత తాముగా కల్పించుకోదు. ఎవరో పిటీషను వేస్తే చట్టబద్ధంగా తీర్పు ఇచ్చి ఉంటారు. దాన్ని చట్టబద్ధంగానే ఎదుర్కోవచ్చు. కాని మన హిందూ సమాజం స్తబ్ద సమాజం. మొద్దు నిద్దురలో మనలను మించినవారు లేరు. అన్నిటికీ ఫర్వాలేదులే అనుకోవటం అలవాటుగా మారింది. కాలక్రమంలో జాగృతి రావచ్చు!
క్రొవ్విడి లక్ష్మీ నరసింహం, సజ్జాపురం (ప.గో.)
ప్ర: ఏ దేవత ఉపాసన వలన ధ్యానం సిద్ధిస్తుంది?
సమా: ధ్యానసిద్ధికి మూలకారణం ఉపాస్య దేవత కాదు. ఉపాసకుని స్వభావం- చిత్తశుద్ధి- గురువు అనుగ్రహం- అచంచల విశ్వాసంతో కూడిన సాధనాబలంవలన ధ్యానసిద్ధి లభిస్తుంది. మహారాష్ట్ర దేశంలోని ‘్భక్త విజయం’ గ్రంథంలోని భక్తుల చరిత్రలు చదవండి, ధ్యానం అంటే తెలుస్తుంది.
బూదే దుర్గా మాధురి, షార్జా, దుబాయ్
ప్ర: పుత్ర సంతానం
సమా: పుత్ర సంతాన ప్రాప్తికి మీరు ఇచ్చిన సంఖ్య ప్రకారం గుణిస్తే- స్ర్తి సంతానమే ప్రధానంగా కనిపిస్తోంది. పుత్ర సంతానం కోసం ప్రత్యేక దేవతా పూజలు, ఇష్ట యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ దగ్గరలో వున్న మోపిదేవి క్షేత్రాన్ని దర్శించండి. మ్రొక్కులు మొక్కండి. శుభం భవతు!
గుండా మాధవి, హుజూర్‌నగర్, తెలంగాణ
ప్ర: నాది శ్రవణా నక్షత్రం- బట్టల వ్యాపారం ఎలా ఉంటుంది?
సమా: మామూలు వస్త్ర వ్యాపారం కంటే రెడీమేడ్ గార్మెంట్స్ ఎక్కువగా లాభించే అవకాశం ఉంది.
బి.నాగేశ్, పెద్దపల్లి సుల్తానాబాద్ (తెలంగాణ)
ప్ర: వివాహయోగం-
సమా: 2018లో మీకు తప్పక వివాహం సిద్ధిస్తుంది. నైరుతి దిశ నుండి యోగం కలదు. శుక్రదోషం కారణంగా కొన్ని ఆటంకాలు కలిగి -మ - ప - ర - న అనే అక్షరాలు బలంగా ప్రభావం చేస్తాయి.
ఎ.ఉషారాణి, మైలవరం (కృష్ణా)
ప్ర: అబ్బాయి వివాహం
సమా: సంఖ్య అబ్బాయి చేత చెప్పించండి. కారణం తెలుపగలను.
డా భాస్కర్ల శర్మిష్ఠ, సికింద్రాబాద్ (స్థానికం)
ప్ర: నేను డెంటల్ సర్జన్‌గా ప్రాక్టీసు పెట్టుకొని రాణించలేకపోయాను. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. నా భవిష్యత్తు ఏమిటి?
సమా: మీకు దూర దేశంలో నైఋతి దిశలో వృత్తి యోగం కనిపిస్తోంది. విదేశాలలో కాని (ముఖ్యంగా అరబ్ దేశాలలో) లేదా బెంగుళూరులో కాని ప్రయత్నించండి. రాణింపునకు రాగలరు. భవిష్యత్తు బాగుంది.
రేజర్ల జంగారెడ్డి, నల్లగొండ (తెలంగాణ)
ప్ర: సిద్ధాంతిగారూ! మన తెలంగాణా ముఖ్యమంత్రి ఏది చేసినా జయప్రదవౌతుంది. జాతక ప్రభావమేనా?
సమా: మీరడిగింది జ్యోతిష సంబంధమైన శీర్షిక కనుక ఆ విధంగానే విశే్లషించాలి. ఆయన జాతకం నాకేమీ తెలియదు. కాని నా ఊహ ప్రకారం ఆయన జాతకంలో ‘చంద్ర మంగళస్తు యోగం’ ఉండి ఉండాలి. రవి బలం చక్కగా ఉండాలి. చంద్రుని కారణంగా మనిషిలో ఊహాశక్తి బాగుంటుంది. మంగళుడు అంటే కుజుని కారణంగా తార్కికమైన ఆలోచన ఉంటుంది. అంటే మామూలుగా చెప్పాలంటే ‘సమజ్‌దార్’- రవి బలం కారణంగా పదవీ యోగం కలుగుతుంది. ఏమైనా సమర్థుడైన మంచి సీఎం.
ఎన్.సురేంద్రబాబు, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: గురువుగారూ! నమస్కారం! నాకు ఉద్యోగ యోగం ఎప్పుడు- భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది.
సమా:మీకు ఒకే రకమైన ఉద్యోగయోగం లేదు. వివిధ రకాలుగా ఉంది. చివరగా స్వతంత్ర వృత్తి కనిపిస్తోంది. అదృష్టవంతులే ఆలస్యంగా వివిధ రకాలుగా అభివృద్ధి-
వై.ఎస్.చక్రవర్తి, శాలివాహనగర్, హైదరాబాద్
ప్ర: నాకు ముంబాయి నుండి హైదరాబాద్‌కు బదిలీ ఎప్పుడవుతుంది?
సమా: ఇంకా ఆలస్యముంది. మీకు నైఋతి దిశయే వృత్తియోగం?
జాలాది పురుషోత్తం, కృష్ణానగర్, హైదరాబాద్
ప్ర: మా బంధువుల దగ్గర ఉన్న నా డబ్బు నాకిస్తారా లేదా? తెలియజేయగలరు.
సమా: మీ ప్రశ్నకు సమాధానం వారి జాతక ప్రభావం కూడా చూడాలి. వాళ్ళు మీకు వ్యయస్థానంలో ఉంటే రావటం కష్టమే.
ఎ.నాగరాజు, బరంపురం (ఒడిస్సా)
ప్ర: స్వగృహ యోగం?
సమా: ఆలస్యంగా నైఋతి దిశలో సిద్ధిస్తుంది.
కె.సౌభాగ్యలక్ష్మి, చంద్రశేఖర పురం (ఒంగోలు)
ప్ర: దూర దేశంలో అయినవారికి దూరంగా ఉద్యోగం- అనారోగ్య సమస్యలు- ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉందా?
సమా: ఇంకా ఆలస్యముంది. ఒకవేళ బదిలీ అయినా నైఋతి దిశవైపు వస్తుంది.
దొడ్డి సోమరాజు, అనకాపల్లి (విశాఖ)
ప్ర: నేను ఏ వ్యాపారం చేయమంటారు?
సమా: పుస్తకాలు- స్టేషనరీ- రెడీమేడ్ దుస్తులు- అలంకార ద్రవ్యాలు మీకు యోగిస్తాయి.
పీసపాటి మార్కండేయ శాస్ర్తీ, ఏలూరు (ప.గో.)
ప్ర: స్వగృహ యోగం- ఏ సంవత్సరం?
సమా: రాబోయే ఆరు నెలల్లో ఆ దిశలో ప్రయత్నాలు ప్రారంభమవుతాయి.
ఆర్.శ్రీనివాసరావు, విజయనగరం, ఆంధ్ర
ప్ర: నా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరును?
సమా: ఆర్థిక ఇబ్బందులు అందరికీ అన్ని వేళలా ఉంటాయి. మీకు భాగస్వామ్య వ్యాపారమే యోగిస్తుంది.
సి.బదరీ నారాయణ, విజయవాడ (కృష్ణా)
ప్ర: ప్రస్తుతం నేనొక చిన్న బ్యాంకులో పనిచేస్తున్నాను. నాకు మార్పు ఉంటుందా?
సమా: మార్పు దానంతట అదే రాదు. మీరే మీ యిష్టంతోనో వేరే కారణంగానో మారతారు. కాని ఆ మార్పు మీకు అనుకూలించదు. తరువాత విచారిస్తారు.
ఎస్.్భస్కర్, హన్మకొండ, వరంగల్
ప్ర: వివాహ యోగం?
సమా: నైఋతి దిశ నుండి యోగం- కొన్ని ఆటంకాలు- నిర్ణయ మార్పులు జరుగుతాయి. ప - మ - న - ర - క- అనే అక్షరాలు ప్రభావం చేస్తాయి.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ