బిజినెస్

పేదరిక నిర్మూలనలో బ్యాంకుల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: పేదరిక నిర్మూలన, కొత్త ఆర్ధిక విధానాల రూపకల్పనలో బ్యాంకుల పాత్ర కీలకమైనదని ఎన్‌ఐఆర్‌డి డైరక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి అన్నారు. అట్టడుగు వర్గాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వారి జీవనోపాధిని మెరుగుపర్చాలని అన్నారు. సోమవారం నాడిక్కడ స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలెప్‌మెంట్ (ఎస్‌బిఐఆర్‌డి)లో జరిగిన సూక్ష్మ రుణాల జాతీయ సదస్సులో రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ సమస్యకు, నానాటికీ తరుగుతున్న అభివృద్ధి సమస్యల నివారణకు సూక్ష్మ రుణాలు ఎంతగానో ఉపకరిస్తాయని కొనియాడారు. దీన దయాళ్, అంత్యోదయ యోజన తదితర ప్రభుత్వ పథకాల ద్వారా జీవనోపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ అంశాలన్నింటిలో బ్యాంకులది అద్భుతమైన పాత్ర అని కొనియాడారు. ఈ సదస్సును స్టేట్ బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ దిబాకర్ మహంతి తొలుత ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో స్టేట్ బ్యాంక్‌కు చెందిన సుమారు 100 మందికి పైగా సీనియర్ ఆఫీసర్లు పాల్గొని ‘సమ్మిళిత వృద్ధి-్భగస్వామ్యాలు, జీవనోపాధి కోసం సమ్మేళనం’ అనే అంశంపై చర్చిస్తారని మహంతి తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, ముద్ర రుణాలు, ఉమ్మడి బాధ్యతల బృందాలు తదితర సూక్ష్మరుణ సహాయ సంస్థల ద్వారా అర్హులైన పేదలందరికి రుణ సహాయాన్ని అందించి, ఆర్ధిక అసమానతలను తొలగించే ఉద్దేశ్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌బిఐఆర్‌డి ప్రిన్సిపాల్, జనరల్ మేనేజర్ ఎం.జయశ్రీరెడ్డి తదితరులు ప్రసంగించారు.

చిత్రం..