భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెక్రటరీ- ఆర్.ఎన్.ప్రసాద్, శ్రీ లక్ష్మీ నృసింహ ఆర్యవైశ్య సత్రం, చాగలమర్రి, అహోబిళం, కర్నూలు
ప్ర: ఆర్యవైశ్య సత్ర నిర్మాణంలో ఆటంకాలు- కాణీపాకంలో అధర్వ శీర్ష గణపతి హోమం మీ సలహా ప్రకారం చేయించాం. ఇంకా ఏం చేయమంటారు- మీ మాట మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది.
సమా: మొదటి విషయం- వాస్తు సరి చూసుకోండి. రెండవ విషయం - నవగ్రహ మంత్ర సంపుటితో సుదర్శన హోమం చేయించండి. మూడవ విషయం- శాశ్వత రక్షకు గాను అష్టముఖ గండభేరుండ నృసింహ యంత్రం పూజాస్థానంలో ఉంచండి. ప్రతి మంగళవారం గుమ్మడి పండు నివేదన చేయండి. ఐదుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. మంచి అభివృద్ధికి రాగలదు. మీరు ఆహ్వానిస్తే నేనూ రాగలను.
ఎస్.కె.షరీఫ్ బాషా, కొండపల్లి (కృష్ణా)
ప్ర: నిశ్చయమైన కన్యతో వివాహం- ఆలస్యం జరుగుతోంది. పరిష్కారం చెప్పండి?
సమా: ఇన్షా అల్లా! రాగల ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని ఆటంకాలు కనబడుతున్నాయి. నివారణకుగాను శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామికి శుక్రవారం ప్రతి నాలుగు వారాలు మల్లెపూల దండలు(జాజిమల్లెలు) రెండు యధాశక్తి బూందీ లడ్డూలు సమర్పించండి. బీబీ నాంచారి కారణంగా వేంకటేశ్వరస్వామిని ముస్లింలూ పూజిస్తారు. ఢిల్లీ పాదుషా ఔరంగజేబు కూడా శ్రీవారిని కబీరు సలహాతో గౌరవించాడు. కానుకలిచ్చాడు.
జామీ అరుణకుమారి, లక్ష్మీ హోండాయి, విశాఖ పట్నం
ప్ర: పుట్టిన తేదీల ఆధారంగా అబ్బాయిల భవిష్యత్తు - ఏ రంగం బాగుంటుంది.
సమా: పెద్దబ్బాయి గోవర్థన్‌కు ‘్ఫల్డ్‌వర్క్, మార్కెటింగ్, ఇన్సూరెన్స్’ రంగాలు బాగుంటాయి. చిన్నబ్బాయి విష్ణువర్థన్ ఆర్థిక సంబంధమైన విషయాలూ- భూసంబంధమైన విషయాలూ- మైన్స్ (గనులు) వంటి విషయాలూ బాగుంటాయి. టైర్లు - లెదర్స్ వంటివి బాగుంటాయి.
జి.యాదగిరి, సిద్ధిపేట (తెలంగాణ)
ప్ర: రైల్వేలో ఉద్యోగ యోగం ఎప్పుడో చెప్పగలరా?
సమా: రైల్వే డిపార్టుమెంట్ వాళ్లు ఖాళీలు ప్రకటించినప్పుడు - నీవు అప్లయి చేసినప్పుడు.
దేవారాం లఖానీ, బిన్‌మాల్ (రాజస్థాన్ స్టేట్)
ప్ర: డబ్బు నిలవటంలేదు. ఏం చేయమంటారు?
సమా: ధనస్థానంలో మారేడు (బేల్‌కాఘాడ్) చెట్టు చెక్కతో చేసిన పెట్టె పెట్టుకొని అందులో డబ్బు ఉంచండి. కనీసం మారేడు చెట్టు చిన్న వేరు కాని ఉంచండి. డబ్బు నిలుస్తుంది.
మునగా హరినాధ్- విజయవాడ (కృష్ణా)
ప్ర: ఇంటినుండి పారిపోయిన కుమారుడు- జాతక పరిశీలన- ఎప్పుడు రాగలడు?
సమా: ఉత్తర దిశకు - వాయవ్య దిశకూ వెళ్లినాడు- బహుశా షిర్డీలోనో- కాశీలోనో తీర్థక్షేత్రాలలో ఉండాలి. ప్రాణభయం లేదు. తనంతట తానుగానే రాగలడు.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ