భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.వి.రామారావు, పుట్టపర్తి, అనంతపురం
ప్ర: వృద్ధాప్యం- అనారోగ్యం- వరుసగా ఆర్థిక నష్టాలు- మంచి రోజులు వస్తాయా?
సమా: వయసులో ఉన్నపుడు దీర్ఘాయుర్దాయం కోరుకుంటాం. కాని వృద్ధాప్యం అందులో ఒక భాగం అన్న విషయాన్ని విస్మరిస్తాం. ఇది లోక సహజం- వృద్ధాప్యంలో మీ మీద అన్ని బాధ్యతలు ఎందుకున్నాయి. సంతానం ఆసరా లేదా? బాధ్యతలు ఎవరికివారికి అప్పజెప్పండి. నిశ్చితంగా ఉండండి. ఇంకా ఏదో సంపాదించాలి- సాధించాలి అనే ఆలోచన మానండి.
గుండా మాధవ్, సూర్యాపేట (తెలంగాణ)
ప్ర: వివాహయోగం ఎపుడు?
సమా: మంచి యోగాలు మీ అనిశ్చిత స్థితి కారణంగా తప్పిపోయాయి. రాగల తొమ్మిది నెలల్లో శుభసూచనల అవకాశం ఉంది. నిర్ణయాత్మకంగా వ్యవహరించండి.
ఎస్.ఎస్.రావు, విజయనగరం (ఆంధ్ర)
ప్ర: సంతాన విషయం- వృత్తి మార్పు ఆలోచన తెలపండి?
సమా: సంతానం విషయంలో దంపతుల జాతకాలు పరిశీలించాలని చాలాసార్లు స్పష్టం చేశాను. అయినా ఒక్కరుగానే అడుగుతున్నారు. చెప్పటం సాధ్యం కాదు. వృత్తిలో ప్రస్తుతం ఉన్న వృత్తినే పత్రికా ఏజెన్సీ కానీ- పబ్లిషింగ్ సంస్థ కాని ప్రారంభించండి.
కోయా సునీల్, రాజమండ్రి (తూ.గో.)
ప్ర: పరిశోధనా రంగంలో ఉద్యోగం ఫలిస్తుందా?
సమా: ముందు దానికి తగిన విద్యార్హతలు- రికార్డు ట్రాక్ సాధించండి. ఆ తరువాత ప్రయత్నిస్తే ఫలిస్తుంది. ఊహాయాత్రపు కోరికలు ఫలించవు.
రమాదేవి, అనంతపురం (ఆంధ్ర)
ప్ర: అకారణంగా పొరుగువారితో నిందలు- సాధింపులు - ఒక్కొక్కసారి చనిపోదాం అనిపిస్తుంది. పాపకోసం జీవిస్తున్నాను.
సమా: ప్రశ్నలో మీవారి గురించికానీ మీ బంధువుల గురించి కాని ప్రసక్తే లేదు. పూర్తిగా ఒంటరివారా? అకారణంగా ఏదీ జరగదు. అయితే అసూయ కాని, ఇంకా మరేవైనా కారణాలు ఉండవచ్చు. అద్దె ఇల్లయితే ఇల్లు మార్చండి. అలా కాకపోతే వార్ని పట్టించుకోవడం మానేయండి. కొన్నాళ్లకు మార్పు వస్తుంది.
కె.సూర్యనారాయణ, కరీంనగర్ (తెలంగాణ)
ప్ర: మనుమని జన్మ కుండలి పరిశీలన వివరాలు ఇవ్వండి?
సమా: మీరు వ్రాసి పంపిన జన్మ కుండలిలో ఒక పొరపాటు ఉంది. జన్మ నక్షత్రం- ఉత్తరాషాఢ రెండవ పాదం అని వ్రాశారు. కుండలి చక్రంలో ధనుస్సులో చంద్రుణ్ణి వేశారు. దీని కారణంగా రాశి విషయంలో అస్పష్టత ఉంది. ఏమైనా మీ మనుమనిది స్వతంత్ర ప్రవృత్తి- కొంత పెద్దలపట్ల సంప్రదాయాలపట్ల ధిక్కారణ ధోరణి వుంటుంది. కాల సర్ప దోషం ఉంది.
కె.అనిల్‌కుమార్, బరంపురం (ఒడిసా స్టేట్)
ప్ర: బి.టెక్ చేసాను. ఉద్యోగమా? వ్యాపారమా?
సమా: మీలో స్వతంత్ర వృత్తి ఉంది. వ్యాపారమే మంచిది. ఆటోమొబైల్ షాపు కాని గృహ నిర్మాణ సామగ్రి (స్టీల్ సిమెంట్) వంటి వ్యాపారం ప్రారంభించండి.
ఇ.పాండురంగస్వామి, కర్నూలు, ఆంధ్ర
ప్ర: కాళ్ళు మొద్దుబారిపోవటం- నరాల జబ్బులు- పరిష్కారమేమిటి?
సమా: కాళ్ళు మొద్దుబారటానికి నాలుగు కారణాలుంటాయి. ఒకటి- పైలేరియా సంబంధం. దీనికి ఆయుర్వేదంలో నిత్యానందరీస్ బాగా పనిచేస్తుంది. రెండు- మధుమేహం (డయాబెటిక్) డాక్టర్‌గారి చేత తగు మందులు వాడండి. మూడు- విషకీటకం కరవటం. మట్టిదిబ్బపాము అనేది కరిస్తే కాళ్ళు మొద్దుబారిపోతాయి. ముఖ్యంగా వ్యవసాయ వృత్తివారిని ఇది బాధిస్తుంది. కరచినది కూడా మనకు తెలియదు. దీనికి నేచురోపతిలోనే మృత్తికా చికిత్స చేయించాలి. మోకాలి లోతు వరకు కాళ్లు ఒండ్రుమట్టిలో కొన్ని గంటలసేపు పాతి ఉంచాలి. నాలుగు- నరాలు బెణకటం. దీనికి హమియోలో ఆర్నికా 6ఎక్స్- బ్రయోనియా 6ఎక్స్- రూస్‌టాక్స్ 6ఎక్స్ కాని పనిచేస్తాయి. డాక్టర్ సలహాతో వాడండి.
పి.వెంకన్న, రాజమండ్రి (తూ.గో.)
ప్ర: రాగి- ఇత్తడి- స్టీలు పాలిష్ వర్క్ వ్యాపారం బాగానే ఉండింది. రాగి బిందెల ఫ్యాక్టరీ పెట్టాను. నష్టాలు మొదలయ్యాయి. కారణం తెలియదు. పరిష్కారం చెప్పండి?
సమా: ఫ్యాక్టరీ వాస్తు సరిచూసుకోండి. రాగి వ్యాపారం మీకు బాగానే వుంటుంది. వ్యక్తిగతంగా కలిస్తే మరిన్ని వివరాలు తెలుపగలను.
పట్కారి వెంకూసా, సిద్ధిపేట (తెలంగాణ)
ప్ర: మనస్సు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి?
సమా: సంతృప్తిని అలవరచుకోవాలి. దైవాన్ని- శాస్త్రాన్ని నమ్మాలి. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలి.
పి.వి.ఎస్.ఎల్.ఎన్.నాయక్, పి.శే్వత- గజపతిపేట, శ్రీకాకుళం
ప్ర: సంతాన విషయం తెలియజెప్పండి?
సమా: మీ ఇరువురి నంబర్ల ప్రకారం మీకు ప్రథమంగా స్ర్తి సంతాన యోగం ఉంది. అయితే నాగదోష సూచనలు ఉన్నాయి. విజయవాడ దగ్గరగల ‘మోపిదేవి క్షేత్రం’ దర్శించి మొక్కు మొక్కండి. వీలయితే నాగప్రతిష్ఠ చేయించండి.
జి.అరుణాదేవి, కొత్తగూడెం (తెలంగాణ)
ప్ర: పిల్లల భవిష్యత్తు ఏమిటి?
సమా: పిల్లల భవిష్యత్తు మీరు చెప్పిన సంఖ్యవల్ల ఎలా తెలుస్తుంది. వారి పుట్టిన తేదీలైనా వ్రాయలేదు. పేర్లు లేవు- వయస్సు లేదు.
రజనీశ్ బజాజ్, ముంబాయి (మహారాష్ట్ర)
ప్ర: మా స్నేహితుని సలహా ప్రకారం ప్రశ్నిస్తున్నాను. మహారాజ్! నాకు గుర్రపు పందాలు- పేకాటలు చాలా ఇష్టం. నాకు లాభిస్తాయా?
సమా: జూదాల గురించి జ్యోతిషాన్ని ఆశ్రయించటం అధర్మం- చెప్పలేను.
వై.శ్రీనివాసరావు, జగ్గయ్యపేట (కృష్ణా)
ప్ర: కుటుంబ పరిస్థితి ? స్వగృహ యోగం?
సమా: ఆలస్యంగా అభివృద్ధి- ప్రస్తుత స్థితి గ్రహచారవశాత్తు బాగాలేదు. దైవసేవ చేయండి.
జి.చక్రపాణి, హిందూపూర్ (ఆంధ్ర)
ప్ర: సార్! మీరు చెప్పినట్లుగానే నాకు సెప్టెంబర్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే అది నా క్వాలిఫికేషన్స్‌కు చాలా చిన్నది. నాకు తగిన ఉద్యోగం ఎప్పుడు రాగలదు?
సమా: ప్రస్తుతం లభించిన ఉద్యోగాన్ని శ్రద్ధగా చేయండి. 2020లో మీకు చాలా మంచి యోగం కలుగగలదు.
జి.పద్మ, నెల్లూరు (ఆంధ్ర)
ప్ర: నూతన స్వగృహ యోగం ఎపుడు?
సమా: మీరున్న దిశనుండి ఆగ్నేయ దిశలో స్వగృహ యోగం 2018లో కలుగును. కట్టిన గృహమునే కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బి.త్రివేణీ, విశాఖపట్నం (వెంకోజ్‌పాలెం), (ఆంధ్ర)
ప్ర: సంతాన నష్టం- ప్రారంభ దశలోనే రెండుసార్లు జరిగింది. నేను క్రిస్టియన్ పద్ధతిలోకి మారాను. మావారు హిందూ సంప్రదాయంలోనే ఉన్నారు. పరిష్కారం చెప్పండి.
సమా: సంతాన నష్టానికి కారణం- ‘కన్సీవ్‌మెంట్’ తరువాత సరియైన నియమాలు పాటించకపోవటం- దానికి కుజగ్రహదోషం కారణం- విజయవాడ సమీపంలో మోపిదేవి క్షేత్రాన్ని దర్శించి మొక్కండి. వీలయితే మంగళవారం రాత్రి భోజనం- ఉదయం ఉపవాసం పాటించండి.
కె.లక్ష్మీనారాయణ, కేతేపల్లి, కొత్తగూడెం (తెలంగాణ)
ప్ర: స్వగృహయోగం ఎపుడు?
సమా: ఇంకా ఆలస్యం- ఉత్తర దిశలో యోగం- ఆటంకాలతో నెరవేరగలదు. ప్రస్తుతం మీరు నివశిస్తున్న ఇల్లు వాస్తురీత్యా అనుకూలంగా లేదు.
ఎమ్.ఆంజనేయప్రసాద్, ఎద్దుమైలారం, సంగారెడ్డి (తెలంగాణ)
ప్ర: ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయా?
సమా: ప్రతిరోజూ వెంకటేశ్వరస్వామి ముందు ఉత్తరం ముఖంగా వెలిగేట్లు (కనీసం మూడు గంటలు) ఆవు నెయ్యి దీపం వెలిగించండి. శనివారం బూందీ లడ్డూలు నివేదన చేసి చిన్నపిల్లలకు పంచండి. ఆర్థికంగా కుదురుకుంటారు.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ