భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండేటి వెంకట రమణారావు, మూసాపేట, హైదరాబాద్

ప్ర: శ్రీగురుభ్యోన్నమః! గురువుగారూ! మీరు చెప్పినట్లుగానే నా పదోన్నతి ఫైలు పరిశీలనకు వచ్చింది. మా అమ్మాయి నిహారికకు కూడా మీరు చెప్పినట్లుగా నైఋతి దిశలో బెంగుళూరులో ఉద్యోగం (ప్రైవేటు) వచ్చింది. కాని ఆరోగ్య కారణాలవలన మానివేయవలసి వచ్చింది. ఆమె జాతక చక్రం- సంఖ్య పంపిస్తున్నాను. ఆమె భవిష్యత్తు చెప్పండి. ఆరోగ్యం- ప్రభుత్వోద్యోగం-
సమా: మీ అమ్మాయికి ఆరోగ్యం- గొంతు సంబంధం- ఉదర సంబంధం గాని (అబ్‌డామిన్) పొత్తికడుపు సంబంధంగా కాని ముఖ్యంగా కాలేయ సంబంధం అనారోగ్యం కనిపిస్తోంది. తగు చికిత్స చేయించండి. ఆమెకు నైఋతి వాయవ్యాలు బ - మ - ప అనే అక్షరాలు యోగ కారకాలు. హైదరాబాద్ అనుకూలం కాదు. ఆమెకు కార్యస్థానం ప్రభుత్వ సంబంధమూ- సుఖమును కలుగనీయదు- 2018 మధ్యభాగంలో వివాహం అనుకూలం.
ఎన్.కోటేశ్వరరావు, పాతూరు, నర్సరావుపేట (ఆంధ్ర)
ప్ర: స్వామీ! లోగడ నా వ్యాపారం విషయంలో మీరు చెప్పినది చెప్పినట్టు కరెక్టుగా జరిగింది. ప్రస్తుతం నా కుమారుడు చెప్పిన సంఖ్య ప్రకారం అతని వివాహం చెప్పండి!
సమా: మీ కుమారునికి వాయవ్య దిశ నుండి సంబంధము రాగలదు. క - వ - స - మ - ర - ల- అక్షరాలు కాగలవు. 2018లో వివాహము తప్పక జరుగును.
టి.శేషు, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: గోత్రాలు - శాఖలనుబట్టి జ్యోతిషం చూసే విధానం మారుతుందా?
సమా: గోత్ర భేదాలు- శాఖా భేదాలతో జ్యోతిషానికి సంబంధం లేదు. కేవలం జన్మదినం- జన్మ సమయం- జన్మస్థలం మాత్రమే ప్రధానం. వైదిక సంస్కారాల సందర్భంలో శాఖాభేదాలు- గోత్రభేదాలు కొన్ని మాత్రం చోటుచేసుకుంటాయి. ఉదా: ఆశ్విలాయన శాఖ- ఆపస్తంభ శాఖ- ఋగ్వేదీయము- యజుర్వేదీయము వంటివి.
సి.కె.్భజంగం - రామారావుగూడెం, ఆంధ్ర
ప్ర: తల్లిదండ్రులకు అపర కర్మ చేశాను. సంవత్సరం వరకూ గుడికి వెళ్లకూడదన్నారు- నిజమా?
సమా: సంవత్సరం వరకూ మృతాశౌచం ఉంటుంది. గుళ్ళో ధ్వజస్తంభ దర్శనం మాత్రమే చేసుకోవాలి. మహాక్షేత్రాలలో దేవాలయాలలోకి వెళ్లకూడదు. తీర్థస్నానాలు చేసి సంప్రదాయబద్ధంగా ఏవైనా దానాలు చేయవచ్చు.
ఎమ్.కాశీవిశ్వనాధ్, పొన్నూరు (ప్రకాశం)
ప్ర: సంతాన ప్రాప్తి కలుగుతుందా?
సమా: మీకు అవసవ్య కాలసర్ప దోషం ఉంది. పురుషసూక్తలూ - విష్ణు సహస్రనామ సంపుటితో శ్రీ వేంకటేశ్వరస్వామికి నలభై రోజులు పంచామృతాభిషేకం చేయించండి. శుభము జరుగును.
ఆదిరాజు శ్రీరామచంద్రమూర్తి, అల్లూరు (కృష్ణా)
ప్ర: కాశీ యాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు మోక్షం కలుగును?
సమా: ఏం ప్రశ్న అండీ! ‘గంగాస్నానానికి కొండు భొట్లు ఆజ్ఞా?’’ అనే సామెత గుర్తుకు వస్తోంది మీ ప్రశ్న చూస్తే. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఆటంకాలు ఏమీ చేయలేవు.
ఎల్.శ్యామల, నెల్లూరు, బిట్రగుంట
ప్ర: కాలేజీకి వెళ్లిన అబ్బాయి తిరిగి రాలేదు - 2003లో. దయచేసి ఏమయ్యాడో చెప్పగలరా?
సమా: నైఋతి- ఆగ్నేయ దిశగా వెళ్లినట్లుగా కనిపిస్తోంది. బహుశా మద్రాసు కాని, బాంబే కాని అవకాశం ఉంది. 2018లో మీకు వర్తమానం తెలియగలదు.
బి.ప్రసాదరావు, బరంపురం, ఒడిస్సాస్టేట్
ప్ర: తగినంత ఆర్థిక స్థోమత లేక అమ్మయి పెళ్లి చేయలేకపోతున్నాను. పరిష్కారమేమిటి?
సమా: ఆర్థిక స్థోమత అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదు. క్రమబద్ధమైన ఆర్థిక విధానం ముందునుండే ఉండవలసింది. ఆర్థిక స్థోమత లేక అమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నాను అనటం సమంజసం కాదు. మీకంటే తక్కువ స్థాయి వాళ్లు కూడా పెళ్లిళ్లు చేస్తున్నారు. గట్టిగా పట్టుదలతో ప్రయత్నమే పరిష్కారం.
పి.సత్యనారాయణ, అద్దంకి (ప్రకాశం)
ప్ర: లక్ష్మీ గణేశ హోమం చేయాలనుకుంటున్నాను. చేయవచ్చునా?
సమా: మీకా సందేహం ఎందుకు కలిగింది. భేషుగ్గా చేయవచ్చు. అయితే కామ్యక సంబంధమైన అగ్ని కార్యానికి సతీమణి తోడుగా ఉండాలి. అశౌచాదులు ఉండకూడదు. సమర్థుడైన బ్రాహ్మణుడుండాలి.
ఎ.ప్రసాద్, వీరవాసరం (ప.గో.)
ప్ర: ఉద్యోగంలో ప్రమోషన్?
సమా: వ్యక్తుల కారణంగానో- డాక్యుమెంట్ల కారణంగానో మీ సర్వీసులో కొన్ని అభ్యంతరాలు కనబడుతున్నాయి. అవి పరిష్కారమైన వెంటనే ప్రమోషన్ రాగలదు.
దూదేకుల కాశీంవలీ, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: చిన్నప్పటినుంచీ నాకు ఏ పనీ సరిగ్గా నడవలేదు. అనుకున్నదీ జరగదు. మంచి పని చేద్దామన్నా కూడా సరిగా కాదు. కారణం ఏమిటి?
సమా: ‘నాగదోషం’ జాతకంలో కుజ-రాహు- శని సంయోగంవలన కలుగుతుంది. ప్రతి సోమవారం ఆవుకు దాణా పెట్టండి. ప్రతి మంగళవారం సూర్యుడు రాకముందే కాళ్లు చేతులు కడుక్కునైనా సరే పుట్టలో పాలు పోయండి. చీమలకు బియ్యపు పిండి వేయండి.
మామిడిపల్లి సంపత్‌కుమార్, దేవరపల్లి (ప.గో)
ప్ర: చలన చిత్ర రంగంలో సెటిల్మెంట్ ఇంకా ఇతర విషయాలు ఎలా ఉంటాయ?
సమా: చలన చిత్ర రంగంలో సెటిల్మెంట్ నీటిమీది వ్రాత వంటిది. దాని పేరే చలనం- స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ ఎప్పుడూ ఉంటుంది. మీరడిగిన ఇతర విషయాలు నేను చెప్పవలసినవి కావు. మీ వ్యక్తిగతమైనవి.
ఎస్.నిరంజన్ బాలాజీసింగ్, మూలపేట (నెల్లూరు)
ప్ర: ప్రభుత్వోద్యోగావకాశాలు?
సమా: ఏదైనా వ్యాపారమే మీకు యోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇనుము- నూనెలు- ప్రైవేటు ఏజెన్సీలు- రెడీమేడ్ దుస్తులు-
మండల రమేష్, పార్శీగుట్ట, సికింద్రాబాద్
ప్ర: నాకు పెళ్లయి ఏడు సంవత్సరాలు- అప్పటినుండి కష్టాలు ఆరంభమయ్యాయి కారణం ఏమిటి?
సమా: బాధ్యతలు పెరగటం వలన కష్టాలు వచ్చినట్లుగా భావిస్తున్నారు- ఒక్కసారి ఇంటి వాస్తు సరి చూసుకోండి. ఆత్మీయులే మోసం చేశారంటే వాళ్ళమీద మీరు బాగా ఆధారపడి ఉండాలి. మీ పనులు మీరు చక్కపెట్టుకుంటే మోసాలు జరుగవు.
ఫ్రాంక్లిన్ జోసెఫ్ విశాల్‌రావు, బందరు (ఆంధ్ర)
ప్ర: వీధిలో బిచ్చగాళ్ళ బెడద ఎక్కువగా ఉంది. బిచ్చమెత్తటం నిషేధించే మార్గం ఉందా?
సమా: లక్షాధికారి ఉన్న చోటే భిక్షాధికారి ఉంటాడు. పవిత్ర బైబిల్‌లోని సూక్తిని గుర్తుకు తెచ్చుకోండి. ‘‘పైరును చివరి యెన్నులవరకు కోయకుడి, అది మీ బానిసలపాలు- మీరు కూడా బాబిలోనియాకు బానిసలుగా కొనిపోబడిన విషయమును మరువకుడి’’ అని- మన సంపాదనలో కొంత దరిద్ర నారాయణులకు- కొంత దైవానికి - కొంత ప్రభుత్వానికి భాగం ఉంటుంది. హిందూ మతంలోనూ ‘‘్భగందేవేభ్యః భూతేభ్యః- రాజకృతం అని చెప్పబడింది. కొంత ఇతర ప్రాణులకు కొంత ప్రకృతికీ సమర్పించాలి. అయితే భిక్షమెత్తటం మాత్రం ఇళ్ళముందు - వీధుల్లో కాకుండా దేవాలయాలు- మసీదులు చర్చిలముందు మాత్రమే ఉండాలి.
డి.రాజేందర్, కమ్మరపల్లి, నిజామాబాద్
ప్ర: గృహమూ- వాహనమూ చెప్పండి గురువుగారూ!
సమా: రెండూ ఆలస్యమే- 2018లో ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతాయి.
ఎన్.రామకృష్ణ, గుంటూరు (ఆంధ్ర)
ప్ర: గుంటూరులోని ఇల్లు అమ్మకం- విజయవాడలో కొనుగోలు?
సమా: అమ్మకం ఆలస్యం- అమ్మబోయే ఇంటిపైన ఏవో ధన సంబంధమైన తిరకాసులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి.
డి.దిలీప్ కుమార్, బరంపురం, ఒడిస్సా
ప్ర: ఆర్థికాభివృద్ధి- స్వంత యిల్లు యోగం ?
సమా: ఆర్థికంగా మీరేమీ బలహీనంగా ఉన్నట్టు లేరు. వచ్చిన రాబడి దుబారా అవుతోంది. తల్లిగారు అక్కచెల్లెండ్ర వంటి వరుసవారితో కూడా మీకు లాభమూ- గృహయోగమూ అవకాశం ఉంది. మీ చేతిలో డబ్బు నిలవదు. డబ్బు ఎప్పుడూ మీ ఆవిడ దగ్గర కాని తల్లి దగ్గర కాని ఉంచండి.
మల్లు శ్రీ్ధర్‌రెడ్డి, కోదండరాంనగర్, దిల్‌సుక్‌నగర్
ప్ర: నేను ఋణ బాధలనుండి ఎప్పుడు బయటపడగలను. ఇతరులనుండి డబ్బు ఎప్పుడు రాగలదు?
సమా: ఏదో ఒక స్థిరాస్తి అమ్మటం ద్వారానే మీ ఋణ బాధ కొంత తీరగలదు. మీ గృహ వాస్తుదోషం కనిపిస్తోంది. మీ స్నేహితులు నిజాయితీపరులుగా లేరు.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.

umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ