భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యభట్టర్ రామనాథ్ అయ్యర్, చెన్నై, తమిళనాడు

ప్ర: ‘విశ్వసుందరి’ పోటీల సంప్రదాయం స్ర్తిలల్లో రూప ప్రాధాన్య భావాలు, భౌతిక ఆడంబరాలు కలిగించే పాశ్చాత్య సంప్రదాయం-ఇది భారతీయ సంస్కృతికి హానికరం కాదా?

సమా: ‘విశ్వసుందరి’ పోటీలు మారుతున్న నాగరికతలో ఒక భాగం. సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదు. పాశ్చాత్య సంస్కృతిలో కూడా తాత్త్విక చింతనలున్నాయి. పాశ్చాత్య మహాకవి షేక్స్‌స్పియర్ చెప్పిన మాటలు గమనించండి! ‘డెస్టినీ ఈజ్ గ్రేటెర్ దేన్ ఎనీథింగ్, గోల్డెన్ లాడ్స్ అండ్ గర్ల్స్- ఆల్ మస్ట్ యాజ్ చినీ స్వీపర్స్ కమ్ టు డస్ట్’- (ళఒఆజశక జఒ ళ్ఘఆళూ ఆ్ద్ఘశ ఘశకఆ్దజశ, యజూళశ ఘజూఒ ఘశజూ జూఒ ఘ ౄఖఒఆ ఘఒ ష్దజౄజశక ఒతీళళఔళూఒ ష్యౄళ ఆ్య జూఖఒఆ) . ఎంత ఛక్కని తాత్విక వాక్యం గమనించండి. ఇంగ్లీషు కవులు శరీరాన్ని మోర్టల్ ఫ్రేమ్ (్యౄఆ్ఘ చ్ఘిౄళ)అన్నారు. అంటే నశించే చిత్రపటము అని అర్థం. మన సంప్రదాయంలో కూడా ‘దేహం’ అంటే కాల్చబడినది అని- శరీరం అంటే శిథిలం అయ్యేది అని వ్యుత్పత్యర్థాలు. తాత్విక చింతనకు- మేధోవికాసానికి- భిన్ననాగరికతలు అడ్డుకావు. వ్యక్తుల స్వభావాలు మాత్రమే ప్రాధాన్యం- అన్నీ తెలిసిన అధమ ప్రవర్తకులు ఉన్నారు. ఏమీ తెలియని గొప్ప వేదాంతులూ ఉన్నారు.

బలిమెల సత్యనారాయణరావు, మామిడికుదురు, ఆంధ్ర

ప్ర: శర్మగారూ! గత వారం ఒకరి ప్రశ్నకు సమాధానంగా వీధుల్లో- ఇళ్ళముందు బిచ్చమెత్తటం మంచిది కాదు అన్నారు. దరిద్ర నారాయణులకు ఎక్కడైనా ఒక్కటే కదా?
సమా: వీధుల్లో బిచ్చమెత్తటంవలన ట్రాఫిక్ అంతరాయాలు, ప్రమాదాలు- వచ్చేపోయేవారికి చీకాకు కలుగుతుంది. ఇళ్ళముందు చేయటంవలన ఇంట్లో అనేక సమస్యలతో సతమతమయ్యేవారికి చిరాకు కలుగుతుంది. ప్రార్థనా స్థలాలలో అయితే వచ్చేవారంతా ధార్మిక బుద్ధితో వస్తారు కనుక ఎవరికీ ఏ బాధ ఉండదు.

బుద్ధ శివపార్వతి, పెదిరేశ్వరం (తూ.గో)
ప్ర: దత్తత స్వీకారానికి ఎప్పుడు మంచిది- ఎవరిని
తీసుకోవాలి.
సమా: దత్తత స్వీకారానికి గురు - శుక్ర- వ్ఢ్యౌములు లేని సమయంలో దత్త కుమారుని నక్షత్రం తల్లిదండ్రుల నక్షత్రం- దత్త తల్లిదండ్రుల నక్షత్రం పరిగణించి ముహూర్తం నిర్ణయించుకోవాలి. దత్తపుత్రు సగోత్రికుడుగా ఉంటే శ్రేష్ఠం.

సాతులూరి కాంతారావు, చిలకలూరిపేట, గుంటూరు
ప్ర: మనుమని పుట్టిన తేదీ -సమయం 11-09-2017, భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా: మీ మనుమని నక్షత్రం కృత్తికా నక్షత్రం మొదటిపాదం- ఇంత చిన్న వయసులో భవిష్యత్తు గురించి ఆలోచించటం సమంజసం కాదు. ప్రతివారికీ తల్లిదండ్రుల పాప పుణ్యాలవలన బాలారిష్టాలు కలుగుతాయి. తగు శాంతి చేయించండి.

ఎస్.ఎ.కరీమ్, తెనాలి, గుంటూరు
ప్ర: ఆరోగ్యం గురించి?
సమా: కడుపులో ముఖ్యంగా పొత్తి కడుపులో దోషం కనిపిస్తోంది. బహుశా గ్యాస్ట్రిక్ కాని మరేదైనా సమస్య కావచ్చు. ఎక్స్‌రే తీయించండి. తగు చికిత్స వైద్యుల ద్వారా పొందండి.

నలపాటి సురేంద్ర - విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: కథా రచయితగానా? టీచర్‌గానా? దేంట్లో స్థిరపడమంటారు?
సమా: కథారచయిత అనేది ప్రవృత్తికీ ‘టాలెంట్’కీ సంబంధించిన విషయం. టాలెంట్ ఉంటే ప్రేరణ దానంతట అదే వస్తుంది. టీచర్ అనేది వృత్తికి సంబంధించింది. టీచర్‌గానే స్థిరపడండి.

మట్లపూడి నాగచైతన్య, పొన్నూరు (గుంటూరు)
ప్ర: బాబుకు మాటలు రావటంలేదు. ‘ఆడిజం హైపర్’ అంటున్నారు. పరిష్కారం చెప్పండి?
సమా: బహుశా వినికిడి లోపం ఉండాలి. చిన్నపిల్లల లోపానికి హోమియోలో ‘బరైటాకార్బ్’ అనే మందు చెప్పబడింది. డాక్టర్ సలహాతో వాడండి. కొంచెం ‘వజ’ కొమ్ము చిన్న ముక్క కొంతసేపు ప్రతిరోజూ చప్పరించమనం. దైవసేవగా కర్నాటకలోని మూకాంబికా దేవిని సేవించండి. స్వాతి నక్షత్రం. మంచిదే.

ఎమ్.వి.వి.సత్యనారాయణమూర్తి, రామచంద్రాపురం (తూ.గో.)
ప్ర: ఆర్థిక సమస్యలకు పరిష్కారమేమిటి?
సమా: వ్యవహారంలో ఖర్చు మీదే- అదుపు- పొదుపుమీద మదుపు- దైవికంగా ఇంట్లో ప్రతిరోజూ కనీసం మూడు గంటలు వెలిగేలా ఉదయం సాయంత్రం దేవుని వద్ద నేయి దీపం వెలిగించండి. (ఆవు నేయి) ‘కుబేర యంత్రం’ పెట్టుకుంటే మంచిది.

కె.టి.అంజమ్మ, విజయవాడ (కృష్ణా)
ప్ర: అన్యాయం జరిగింది. ఇంటి దస్తావేజులు ఒకరి చేతికి చిక్కిపోయాయి. ముప్ఫయి లక్షలు ఇబ్బందిలో ఉన్నాం.పరిష్కారం చెప్పగలరు?
సమా: ఔను మరి! పేరాశకు పోయి ఇరుక్కున్నారు ఆలస్యంగా- కొంత నష్టంతో కోర్టు ద్వారా పరిష్కారమయ్యే సూచనలున్నాయి.

కె.మాధవి-గుడ్లూరు, ప్రకాశం
ప్ర: కూతురుకు సంబంధించిన విషయం ఏం చేయాలి?
సమా: అమ్మాయి కొరకు మీరుగాని, వీలయితే అమ్మాయి చేతగాని సంతోషీమాత వ్రతం చేయించండి. సమస్యలు పరిష్కారమవుతాయి.

ఎ.దుర్గారాయ గంగాధర్, మొండెపులంక (తూ.గో)
ప్ర: చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఏమైనా మార్పు జరుగునా? వివాహం ఎప్పుడు?
సమా: మీ జాతకంలో రవిబలం లేదు. రవిబలం లేనిదే మంచి ఉద్యోగాలు రావు. ప్రతి ఆదివారం ఉపవాసం (రాత్రి భోజనం- ప్రొద్దంతా ఫలహారం) అరకిలో గోధుమపిండి- అరకిలో చక్కెర (పంచదార) ఒక గులాబి రంగు (బ్లౌజ్‌పీస్) గుడ్డ- ఎరుపు రంగు బ్రాహ్మణుడికి దానం చేయండి (పది రూపాయలు దక్షిణతో) మంచి జరుగుతుంది.

ఎ.మహేశ్, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: గురువుగారికి నమస్కారం- నాకు పోలీస్ శాఖలో మంచి ఉద్యోగం రాగలదా? డిగ్రీ వరకు చదువుకున్నాను. తల్లిదండ్రులను మంచిగా చూసుకోగలనా?
సమా: తల్లిదండ్రులను మంచిగా చూసుకోవటం ధర్మబద్ధమైన కర్తవ్యం-సందేహం అనవసరం. పోలీసు శాఖలో మీకు అవకాశం తక్కువే. తాత్కాలికంగానైనా ప్రైవేటు ఉద్యోగం ప్రయత్నించండి. చేస్తున్న ఉద్యోగం మంచిదే. ప్రస్తుతం ఉన్న ఉద్యోగం కాపాడుకోండి.

కోలా కాశయ్య, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: హైదరాబాద్‌లో నివాస గృహం స్వంతం- ఆర్థిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం?
సమా: ముందుగా ఆరోగ్య సమస్యపైన శ్రద్ధ చూపండి. మిగతావి తరువాత-
ఎమ్.రామాంజనేయులు - నర్సరావుపేట, గుంటూరు
ప్ర:ఆరోగ్య సమస్య - యూరినరీ సమస్యలు- మనశ్శాంతి లేదు. ఎన్ని యాత్రలు చేసినా ఫలితం లేదు. దయచేసి పరిష్కారం చెప్పండి.
సమా: తీర్థయాత్రలకూ, అనారోగ్యానికీ సంబంధం లేదు. ‘పూర్వజన్మ సకృతం పాపం వ్యాధి రూపేణా పీడతి’ అని పెద్దల వాక్యం- మీ మనస్సు జీవిత భాగస్వామికోసం పరితపిస్తున్నట్లు కనిపిస్తున్నది. సకాలంలో చేయవలసినది అకాలంలో చేసి ప్రయోజనం లేదు. యూరినరీ సమస్యకు ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జ్‌మెంట్ కారణం కావచ్చు. హోమియోలో అకోనైట్ 3 ఎక్స్, ఆసిడ్‌ఫాస్ 6ఎక్స్- బెల్లడోనా 6ఎక్స్ వంటివి చెప్పబడ్డాయి. డాక్టర్లకు సూచించి వారి నిర్ణయంతో వాడండి. మనశ్శాంతికి భగవద్గీతా పారాయణం చేయండి.

ఎమ్.రాజు, హుజూరాబాద్, కరీంనగర్ (తెలంగాణ)
ప్ర: స్వగృహయోగం ఉందా?
సమా: ఆలస్యంగా ఆగ్నేయ దిశలో- కట్టిన ఇల్లే కొనే సూచనలు కన్పిస్తున్నాయి. 2018 మధ్యభాగంలో జరగవచ్చు!

చాట్ల వెంకట రమేశ్‌బాబు, చీమకుర్తి (ప్రకాశం)
ప్ర: వివాహం ఎపుడు? వ్యాపారం?
సమా: వివాహం ఆలస్యం- బహుశా 2019 చివరలో వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం సూచితం

పి.సత్యనారాయణ, రాజమండ్రి (తూ.గో.జి)
ప్ర: వేదమూర్తులైన శర్మగారికి నమస్కారం! మోకాళ్ళనొప్పులు- హస్తా నక్షత్రం- 4వ పాదం. స్వంత ఇంటిలో రెండవ అంతస్తులో ఉత్తరం గదిలో పడుకొంటాను. దోష పరిహారమేమిటి?
సమా: పేరు రీత్యా మీ జన్మ నక్షత్ర రీత్యా కూడా నైఋతి దిశ మీ స్వస్థానం- పైగా మీ వయస్సు 72 సంవత్సరాలు అంటున్నారు. ఉత్తర దిశ గదిలో వృద్ధులు పడుకోకూడదు. కన్యారాశికి అర్థాష్టమ శని మొదలైంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయించండి తగు నివేదనతో. కనీసం నలభై రోజులు- సంస్కృత భాషా పరిజ్ఞానం ఉంటే మీరు కూడా స్వయంగా చేసుకోవచ్చును.
జానపట్ల యాదగిరి, ఖాజీపేట, వరంగల్ (తెలంగాణ)
ప్ర: ఏదో నాకు తక్కువ ఉన్నదనే భావన- అనారోగ్యం- మనశ్శాంతి లేదు
సమా: ‘లేనిది కోరకురా! స్వామిని దూరకురా’ అని సామెత సంతృప్తి సహజ సంపద. సంతోషం సగం బలం అలవరచుకోండి. ఆరోగ్యం కాలేయ సంబంధంగా అనారోగ్యం కనబడుతోంది. తగు చికిత్స చేయించుకోండి.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ