భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రదర్ ఇమ్మానియేల్ దయాశిల, బైబిల్ సొసైటీ, చాగమెఱ్ఱి (ప.గో.)
ప్ర: బ్రదర్ ఉమాపతి శర్మగారూ! మీ సమాధానాలు చాలా బాగుంటున్నాయి. లోకజ్ఞానం- శాస్తజ్ఞ్రానం- సమపాళ్ళలో నింపి సమాధానాలిస్తున్నారు. కాంగ్రాట్స్.
నా ప్రశ్న- ఉత్తరకొరియా కారణంగా మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా? చెప్పండి!
సమా: బ్రదర్ దయాశిలగారూ! పిచ్చివాని చేతిలోని రాయి ఎటు విసురుతాడో చెప్పండి! అంటే ఏం చెప్పగలం. ఇపుడు అణ్వస్త్రాల ముప్పు ప్రపంచానికి గొంతుమీది కత్తిలా వేలాడుతోంది. ఏక్షణంలో ఏమైనా జరగవచ్చు. ఈ సందర్భంలో ‘మాల్థప్’ అనే తత్వవేత్త మాటలు గుర్తుంచుకోవాలి. మానవునిలో విపరీత శక్తులు ప్రకోపించినపుడు వివేకముతో నియంత్రించాలి. వాటినే ‘హ్యూమన్ చెక్స్’ అన్నాడు. కాదంటే ప్రకృతిలోని శక్తియే ప్రకోపించి నియంత్రిస్తుంది. వాటినే ‘నేచురల్ చెక్స్’ అన్నాడు. నేచురల్ చెక్స్, అంటే ప్రకృతి నియంత్రణ ఎప్పుడూ తీవ్రంగానూ క్రూరంగానూ వుంటుంది. అదే యుద్ధం- ప్రపంచ యుద్ధం-
కె.దుర్గాప్రసాద్, విజయవాడ (కృష్ణా)
ప్ర: వివాహం- ఉద్యోగం- జీవితంలోని అనుభవాలపట్ల నిర్వేదం- ఆవేదన - జాతక చక్ర పరిశీలన చేయగలరా?
సమా: దుర్గాప్రసాద్‌గారూ! మీకు ప్రభుత్వోద్యోగ యోగం ఉంది. విద్యాయోగం కూడా బాగుంది. విద్యాభివృద్ధిపైన కేంద్రీకరించండి. వ్యక్తిగత జీవితం మాత్రం సుఖప్రదం కాదు. వ్యక్తిగతంగా కలిస్తే నివారణలు చెప్పగలను.
ఎస్.వి.కె.ప్రసాద్, నెల్లూరు, (ఆంధ్ర)
ప్ర: ప్రస్తుత వ్యాపారం రెడీమేడ్ దుస్తులు- ఇంకా ఏ ఇతర వ్యాపారం కలిసి వస్తుంది?
సమా: రెడీమేడ్ దుస్తుల వ్యాపారమే అభివృద్ధి చేయండి. ఏదైనా ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు గాని స్కూలు యూనిఫామ్‌ల కాంట్రాక్టులు కాని ప్రయత్నించండి. షాపు వాస్తు సరిచూసుకోండి. వీలయితే ఆర్థికాభివృద్ధికి లక్ష్మీ గణేశ యంత్రం- కుబేర యంత్రం పెట్టుకోండి. యోగం బాగానే వుంది.
ఎ.కె.ప్రశాంతి, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: గురువుగారూ! నమస్కారం! నా వివాహం అక్షరాలా మీరు చెప్పినట్లుగానే జరిగింది. నేనూ నా భర్త- మా చెల్లెలు - మా తల్లిదండ్రులూ ఒకేచోట ఉంటున్నాం. మా చెల్లెలు పెళ్లి తరువాత కూడా అందరూ కలిసి ఉండాలని మా ఆలోచన. అయితే అంతఃకలహాలు జరుగుతున్నాయి. ఇల్లు వాయవ్య సింహద్వారం.
సమా: వాయవ్య సింహద్వారం కలహాలను కలిగిస్తుంది. అయితే ఇద్దరు కూతుళ్ళూ- ఇద్దరు అల్లుళ్ళు మీ అమ్మా నాన్నలూ కలిసి ఉండాలనుకోవడం అసహజం. ఆలోచించండి. దూరంగా ఉంటేనే ప్రేమాభిమానాలుంటాయి.
జి.గిరిధరరావు పట్నాయక్, సింహపురి,
సూర్యాపేట (తెలంగాణ)
ప్ర: జీవితం పేలవంగా సాగుతోంది. మంచి విజయంతో కూడుకొన్న మార్పు కోసం ఎదురుచూస్తున్నాను.
సమా: ఏదీ తనంత తానై దరికి రాదు, శోధించి సాధించాలి. అదియే ధీరగుణం- కల కానిదీ విలువైనదీ జీవితం-శ్రీశ్రీగారి గీతం గుర్తుకు తెచ్చుకోండి. క్రియాశీలకంగా ప్రయత్నించండి.
వీరవెంకట సత్యనారాయణ,
మట్టపల్లి (నల్లగొండ, తెలంగాణ)
ప్ర: ఉద్యోగంలో శత్రుబాధ- పరిహారమేమిటి?
సమా: ప్రతి వృత్తిలోనూ పోటీతత్వం- అసూయ- ఉంటాయి. వాటిని శత్రుత్వం అనే పెద్ద పదంతో వ్యవహరించవద్దు. ఒకవేళ అకారణ ద్వేషంతో అపకారం చేస్తూ ఉంటే ‘మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి’కి ప్రతి మంగళవారం జ్యోతి వెలిగించి (ఆవు నేయితో) పానకం - వడపప్పు నైవేద్యం పెట్టండి.
ఎస్.కృష్ణసింగ్, మూలపేట,
నెల్లూరు
ప్ర: గొంతు సమస్యలు- ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయా?
సమా: గొంతు సమస్యలకు ప్రతిరోజూ ఉదయం ‘ఉసిరిక లేహ్యం’ (ఆమలక లేహ్యం) తినండి. భోజనం తరువాత ఏలకులు లవంగాలతో తమలపాకు తాంబూలం వేసుకోండి. మీకు లివర్ సమస్య కూడా ఉండే అవకాశం వుంది. దానికి కూడా ఉసిరిక లేహ్యం మంచిది.
లక్ష్మీ గోవిందం, ఊరిపేరు లేదు (తెలంగాణ)
ప్ర: గురూజీ! నమస్కారం! నేను ప్రభుత్వోద్యోగం కోసం సివిల్ సర్వీసెస్ పరీక్షలు వ్రాస్తాను. సాధించగలనని పూర్తి నమ్మకం! విజయం సాధిస్తానని పూర్తి నమ్మకం ఉంది. సాధించగలనా చెప్పండి? మీరు చెబితేనే చేస్తాను.
సమా: భలేవారండీ! సాధించగలను, జయించగలను- నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూనే సాధించగలనా? అని ప్రశ్నిస్తున్నారు. సంపూర్ణ నమ్మకం ఉన్నవాడు సందేహాలతో కాలం వెళ్ళబుచ్చడు. ప్రయత్నం పురుష లక్షణం- ఫలితం దైవాధీనం.
గుండా మాధవ్, హుజూర్‌నగర్ (తెలంగాణ)
ప్ర: జాతక చక్ర పరిశీలన చేయగలరా?
సమా: మీ జాతకం బాగానే వుంది. భార్యావశాత్తు యోగం- స్ర్తి జనారదరణ- రాజకీయ జనుల వలన లాభం- భూలాభాలు ఉన్నాయి. అయితే చంచలత్వము- దుబారా ఖర్చు- అప్పు చేయటంలో ఉత్సాహం- సరిదిద్దుకోవలసిన లక్షణాలు- ప్రస్తుతం స్థిరాస్తి - రాజకీయ విషయాలు సమస్యలు కావచ్చు. ఏలిననాటి శని (సాడే సాత్) పీడిస్తోంది. దైవసేవ చేయండి.
వి.దినేశ్‌రాజ్, విజయవాడ (కృష్ణా)
ప్ర: ప్రభుత్వోద్యోగం- భవిష్యత్తు గురించి తెలుపగలరు?
సమా: మీకు ప్రభుత్వోద్యోగం సందేహమే. వ్యాపార యోగంకాని భీమా ఏజెన్సీలు కాని యోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం శని పీడ ఉంది. జీవితం సంఘర్షణాత్మకంగా ఉంటుంది.
కె.ఎస్.వి, తెనాలి, గుంటూరు
ప్ర: వివాహం ఎపుడు?
సమా: బహుశా గత సంఘటనల కారణంగా ఆటంకాలు అభ్యంతరాలు వస్తున్నట్టున్నాయి. హైదరాబాద్‌లోనే ఉంటారు కనుక వ్యక్తిగతంగా కలవండి- వీలయితే..
జి.రవీందర్, పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర: నూతన వ్యాపారం ఎలా ఉంటుంది? ఏ బిజినెస్ చేయాలి?
సమా: వస్త్ర వ్యాపారం- ముఖ్యంగా శారీస్ వ్యాపారం బాగుంటుంది.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ