భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.లక్ష్మి- సత్యనారాయణపురం, విజయవాడ
ప్ర: ఇంట్లో కొన్ని దేవుళ్ల ఫొటోలు, చిత్ర పటాలు- ముఖ్యంగా ధ్యానంలో ఉన్న ఆంజనేయస్వామి- నాగభూషణుడైన శంకరుడు- నిలబడిన లక్ష్మీదేవి రథసారథిగా కృష్ణుడు వంటివి ఉండరాదంటారు, నిజమేనా? దీనికి కారణమేమిటి?
సమా: చాలా మంచి ప్రశ్నవేశారమ్మా! అభినందనలు. మన హిందూ సంప్రదాయాలన్నీ కూడా ఆమాటకొస్తే నిజమైన అన్ని మత సంప్రదాయాలూ-ఆచారాలూ మానవుని మనోవైజ్ఞానిక తత్వం ఆధారంగా ఏర్పరచబడినవే!
‘మాన ఏవ మనుష్యాణా కారణం బంధ మోక్ష మోః’ అంటుంది శాస్త్రం. మనం చూసే ప్రతి దృశ్యం- చేసే ప్రతి ఆలోచన - పని- మనలోని సూక్ష్మబుద్ధి (సబ్‌కాన్సస్)లో ప్రవేశించి సంస్కారంగా మారి ప్రత్యక్ష క్రియారూపంగా బయటకొస్తుంది. ప్రపంచ మనోవిజ్ఞాన శాస్తవ్రేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అదే చెప్పాడు. మనం చూసేది కాని చేసేది కాని ఇష్టంతోనైనా అయిష్టంతోనైనా, ప్రేమతోనైనా ద్వేషంతోనైనా ఎట్లా చేసినా అది మన సూక్ష్మబుద్ధిలో ముద్రితమై సంస్కారంగా బయటకు వస్తుంది. అందుచేత ఆంజనేయుని ధ్యానంలో ఆయన కోతిరూపం- రుద్రభూమిలో సంచరించే శివరూపం- నిలబడి చంచలత్వాన్ని ప్రదర్శించే లక్ష్మీదేవి- కురుక్షేత్రంలో బంధు వర్గాన్ని చంపేసే రథసారథిగా కృష్ణుని రూపాలు మనలో అలాంటి ఆలోచనలను ప్రేరేపిస్తాయి. అందుకే అలాంటివి ఇంట్లో ఉండకూడదు అని మనవాళ్లు ఆచారంగా చెప్పారు. సోదాహరణంగా వ్యాసంగా వ్రాయాల్సిన అంశం నీ ప్రశ్న.
జి.నీలోఫర్ మోతీ, నల్లమాడ - అనంతపురం
ప్ర: అప్లై చేసిన ఉద్యోగం వస్తుందా రాదా? దారిద్య్ర బాధ?
సమా: ఆలస్యంగా చాలా దూర ప్రాంతంలో ఉత్తర దిశలో అవకాశం ఉంది. దారిద్య్ర బాధ అప్పటికప్పుడు తీరేది కాదు.
షేక్ పీరూ, కాకివీడు - శ్రీకాకుళం
ప్ర: వివాహం? జీవితం గురించి తెలుపగలరు?
సమా: ఆగ్నేయ దిశ నుండి వివాహయోగం- 2018లో చివరలో జరుగును. భవిష్యత్తు సంతానం కలిగిన తరువాత అభివృద్ధి.
ఎ.ఎస్.ఆర్.కె.హరనాధ్, ఉండీ (ప.గో.)
ప్ర: గురువుగారూ! మా పెద్దమ్మాయి పెళ్లి మీరు చెప్పినట్లుగానే జరిగింది. ధన్యవాదాలు. చిన్నమ్మాయి చిత్తా- 3వ పాదం- పెళ్లి విషయం చెప్పండి!
సమా: ఉత్తర దిశ నుండి సంబంధం రాగలదు. న - బ - ర - క అక్షరములు- 2018 చివరలో జరిగే అవకాశముంది.
కె.ప్రవల్లిక, విజయవాడ (కృష్ణా)
ప్ర: స్వగృహయోగం ఎప్పుడు?
సమా: 2018 మధ్యభాగంలో మీరున్న దిశ నుండి ఆగ్నేయ దిశలో ఒకరు కట్టి నివసించి- అమ్మే ఇల్లు లభించగలదు.
ఎమ్.లక్ష్మీనారాయణ, నర్సరావుపేట, గుంటూరు
ప్ర: వివాహం- ఎప్పుడు?
సమా: స్వయంవర సూచనలు కన్పిస్తున్నవి. ఉత్తర దిశ నుండి! ఆ ఇంట్లో ఆడవారు అభ్యంతరాల కారణంగా వివాదాలు రావచ్చు!
ఎల్.శ్రీకాంత్, నెల్లూరు, ఆంధ్ర
ప్ర: నా భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా: సంఘర్షణలతో కూడి ఉంటుంది. తల్లిమూలకంగా కుటుంబంలో స్ర్తిసభ్యుల మూలకంగా అభివృద్ధి- విపరీతమైన ఖర్చుదారీతనం.
సిహెచ్.లక్ష్మి, చందానగర్, హైదరాబాద్
ప్ర: స్వగృహయోగం ఎప్పుడు?
సమా: ఉత్తర దిశలో స్ర్తి మూలకంగా కాని స్ర్తి యాజమాన్యంగల ఇల్లు కాని లభించే అవకాశం 2018లో జరుగుతుంది.
జి.అరుణాదేవి, భద్రాచలం (తెలంగాణ)
ప్ర: గురువుగారూ! ఉద్యోగరీత్యా భద్రాచలంలో ఉంటున్నాము. స్వంత ఊరికి వెళ్ళాలని ఉంది. పిల్లల చదువుకోసం - ఎప్పుడు వెళ్ళగలము-
సమా: మీవారి పేరు - మీ స్వంత ఊరి పేరు తెలియనిదే చెప్పటం సాధ్యం కాదు. భద్రాచలం మాత్రం మీ పేరున బాగానే ఉంటుంది.
కె.సూర్యనారాయణ, కరీంనగర్ (తెలంగాణ)
ప్ర: లోగడ నా ప్రశ్నకు మంచి సమాధానం ఇచ్చారు. నా పొరపాటును కూడా సరిచేసారు ధన్యవాదాలు. ప్రస్తుతం అదే నా మనుమని జాతక చక్ర కుండలి పరిశీలించి భవిష్యత్తు చెప్పండి.
సమా: పూర్తి భవిష్యత్తు చెప్పటం ఈ శీర్షికలో సాధ్యం కాదు- అయితే అబ్బాయి అదృష్ట జాతకుడే కాని తనకు తోచిన విధంగా పోతాడు. పెద్దల సలహాలు కాని- ఉపదేశాలు కాని పట్టించుకోడు. లక్ష్యానే్న కాని లక్షణాలను పాటించడు. ప్రస్తుతం ‘సాడేసాత్’ ఏలిన నాటి శని ఉంది. దైవ సేవ అత్యవసరం.
వి.వి.రామకృష్ణ, చైతన్యపురి, హైదరాబాద్
ప్ర: నేను పదిహేను సంవత్సరాలుగా చీఫ్ మేకప్‌మాన్‌గా సినిమాల్లో పనిచేస్తున్నా. డైరెక్టర్ కావాలని కోరిక- కాగలనా?
సమా: అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తి వ్యతిరేకతలూ- పోటీలు- ఆటంకాలు కలిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న వృత్తిలోనే మరింత రాణింపునకు ప్రయత్నించండి.
జి.చక్రపాణి, హిందూపూర్, ఆంధ్ర
ప్ర: నాకు వివాహం ఎప్పుడవుతుంది?
సమా: కండిషన్లు- రిజర్వేషన్లు- పెట్టుకోకుండా ఆడవాళ్ళ ప్రభావంలో పడకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకుంటే వచ్చే సంవత్సరం ఖాయం.
కర్రి సూర్య సత్యేశ్వరి, విజయనగరం, బొబ్బిలి, ఆంధ్ర
ప్ర: స్వగృహం- కట్టిన డబ్బులు- కోర్టులో పడింది. పరిష్కారం ఎప్పుడు?
సమా: ఈ విషయంలో మిగతా పార్టీల భవిష్యత్తు కూడా ముడివడి వుంది. చెప్పటం సాధ్యం కాదు.
జి.సత్యశ్రీవిద్య, విజయవాడ (కృష్ణా)
ప్ర: నాకు ఎటువంటి ఉద్యోగం రాగలదు? నా నక్షత్రం శతభిషం-
సమా: అలంకార ద్రవ్యాలు- ఫ్యాషన్ డిజైనింగ్- సినీ - టీవీ సంబంధమైన వాటిలో అవకాశం ఉంది.
భాస్కర్, హన్మకొండ (తెలంగాణ)
ప్ర: వివాహం ఎపుడు?
సమా: జాతకంలో శని - శుక్ర దోషాలు ఉన్నవి. తగు శాంతి చేయించండి. కొన్ని విషయాలు పత్రికాముఖంగా వ్రాయలేను. వీలయితే వ్యక్తిగతంగా కలవండి.
టి.దుర్గారామలక్ష్మి, చందానగర్ (హైదరాబాద్)
ప్ర: కాశీలో శేష జీవితం గడపాలని ఉంది. అవుతుందా?
సమా: ప్రస్తుతం రాగబంధాలను- బాధ్యతలను తీర్చుకొని ప్రయత్నించండి.
చందన, పొనాసానిపల్లి (తెలంగాణ)
ప్ర: చదువులో ఆటంకాలు,అనారోగ్యాం- పరిష్కారం చెప్పండి?
సమా: ముందు ఆరోగ్యాన్ని కుదుర్చుకోండి! బహుశా గ్యాస్ట్రిక్ సంబంధం కాని పిత్తాశయ సంబంధం కాని కావచ్చు. చదువులో ఆటంకాలకు కారణం మనోవ్యసనం-
ఇంద్రకంటి సత్యనారాయణమూర్తి, దక్షారామక్షేత్రం, ఆంధ్ర
ప్ర: దేవాదాయ శాఖ నుండి రావలసిన డబ్బు ఎప్పుడు రాగలదు- స్థిరాస్తి సంబంధ వ్యాపారం నాకు యోగించునా?
సమా: జనవరి- ఫిబ్రవరి నెలల్లో (2018) కొంత ధనలాభం జరిగే అవకాశం వుంది.

పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ