భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.జాహ్నవి, కంకిపాడు (కృష్ణా)
ప్ర: భర్త వ్యసనాలకు బానిస - నేనూ నా పిల్లలూ చెప్పరాని బాధలు- పరిష్కారంగా దైవసేవ ఏమి చేయాలి?
సమా: ప్రతిరోజూ ప్రాతఃకాలంలో దత్తాత్రేయ స్వామికి ఫొటో ముందు నెయ్యి (ఆవునెయ్యి)- ఆముదం- నువ్వుల నూనె కలిపిన నూనెతో దీపం వెలిగించి గురుచరిత్ర పారాయణం చెయ్యండి. తేనె, పటిక బెల్లెం నైవేద్యం పెట్టండి. వీలయితే మేడి చెట్టుకు 108 ప్రదిక్షణలు చేసి చీమలకు బియ్యపు పిండి వేయండి. గురువారం బ్రాహ్మణునికి యయావారం పెట్టండి. నలభై రోజుల్లో మార్పు రాగలదు.
స్రవంతి గండికోట, పాత వెంకోజీపాలెం, విశాఖపట్నం
ప్ర: తీవ్రమైన తలనొప్పి- ఒక్కొక్కప్పుడు స్పృహ కూడా తప్పి ఎదుటివారి మాటలకు స్పందించలేకపోతున్నాను. వైద్యం ఫలించటంలేదు. కారణం చెప్పండి.
సమా: మీరు చెప్పిన సంఖ్య ప్రకారం- ఏదో ఒక గాయం కాని- స్ర్తి సంబంధమైన అనారోగ్యం కాని- ఏదైనా ఆపరేషన్ జరిగిన సందర్భంలో లోపం కాని కారణంగా కనబడుతోంది. హోమియోలో వైద్య పరిభాషలో పెరిబ్రో స్పైనల్ సిస్టమ్‌లోని నరాలు- రక్తప్రసరణ లోపం కారణంగా చెపుతారు. హోమియోలో మంచి మందులున్నాయి. అకోనైట్ 3ఎక్స్, ఆర్నికా 3ఎక్స్, బెల్లడోనా 6ఎక్స్ వంటివి చెప్పారు. డాక్టర్‌ని సంప్రదించి వాడండి.
అక్కిరెడ్డి వాసు - అరితోవ - విశాఖపట్నం
ప్ర: ఎంత కష్టపడినా ధనం నిలవటంలేదు. ఋణమే మిగులుతోంది. కారణం చెప్పండి.
సమా: డబ్బు ఆదా కావటానికి కారణం కష్టపడటం కాదు. ఖర్చు మీద పొదుపు- అదుపు- మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీ సంపాదన మరొకరి సంపాదన మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. స్వతంత్రమైన ఆర్జన మీద శ్రద్ధ చూపండి.
కె.వి.వి.కులకర్ణి, బడీచౌడీ, హైదరాబాద్
ప్ర: స్వామీ! నేను పురోహితుణ్ణి- గుడి పూజారిని- నా పైన అకారణ నిందలు మోపుతున్నారు. అవాకులూ చెవాకులూ చాటుమాటుగా అంటున్నారు. నాకు ఏలిన నాటి శని ఉన్నది (్ధనూరాశి)- ఏం చేయమంటారు?
సమా: సహజంగానే ధనూరాశి వారికి శత్రువులు ఎక్కువ వుంటారు. ప్రతిరోజూ సుందరకాండ పారాయణం చేసి ఆంజనేయస్వామికి అరటిపండ్లు- తేనె నివేదన చేయండి.
జి.మురళీకృష్ణ, కనిగిరి (ప్రకాశం)
ప్ర: ఉద్యోగంలో స్థిరత్వం లేదు. ఉన్నత ఉద్యోగమా? వ్యాపారమా? గృహ నిర్మాణం జరుగుతుందా?
సమా: మీకు ఉద్యోగంలో ఉన్నతి లేదు. వ్యాపారం ప్రయత్నించండి. భార్య మూలకంగా కాని తల్లి మూలకంగా కాని లాభిస్తుంది. గృహ నిర్మాణం ఆలస్యంగా రెండు గృహాలు సాధిస్తారు.
జగతీబాయి- మల్కాజిగిరి (హైదరాబాద్)
ప్ర: మా అమ్మాయికి కాత్యాయని వ్రతం చేయమన్నారు కాని భర్త సహకారం లేదు. ఇంట్లో పరిస్థితులు అనుకూలించవు. మరేదైనా ప్రత్యామ్నాయం చెప్పండి!
సమా: ప్రాతఃకాలంలో తులసీమాత ముందు ముగ్గులు వేసి దీపం వెలిగించి- 108 ప్రదక్షిణలు చేయమనండి. చీమలకు బియ్యపు పిండి పోయమనండి.
కె.బంగార్రాజు - భీమడోలు (ఆంధ్ర)
ప్ర: నాకు లాడ్జి వ్యాపారం యోగించటంలేదు. మరేదైనా చెప్పమని మనవి-
సమా: లాడ్జింగ్ వ్యాపారం కాని- అద్దె ఇళ్ళ వ్యాపారం కాని మీకు యోగించవు. హోటల్ - రెస్టారెంట్లు - పండ్ల రసాలు- కూల్‌డ్రింక్స్ ఏజెన్సీలు యోగిస్తాయి. శక్తి ఉంటే ముత్యాల వ్యాపారం కూడా బాగానే వుంటుంది.
జి.ఎస్.శైలజ, ఏలూరు (ప.గో.)
ప్ర: వివాహాలస్యం
సమా: మీ జాతకంలో కుజ - శుక్ర దోషాలు ఉన్నాయి. తగు నివారణా సంస్కారాలకు ప్రత్యేకంగా ఉత్తరం ద్వారా సంప్రదించండి! పత్రికా ముఖంగా దోషాలు వివరించటం మంచిది కాదు.
కావలిపాటి పాపారావు, మల్కాపురం (వైజాగ్)
ప్ర: గురువుగారూ! నాకు ఏ ఉద్యోగమూ స్థిరంగా ఉండటంలేదు. ఆరోగ్యం గురించి- స్వంత ఇల్లు గురించి చెప్పండి.
సమా: మీకు ఉద్యోగం యోగించదు. స్ర్తిల పేరుతో ఏదైనా కిరాణా వంటి వ్యాపారం చేయండి. గ్రహచార రీత్యా అర్దాష్టమ శని ఉంది. తగు దైవసేవ చేయించండి. ఆరోగ్య రీత్యా మోకాళ్ళు- హృదయ స్థానం బలహీనం. ఎక్కువగా తిరగటం- విపరీతంగా ఆలోచించటం తగ్గించుకోండి.
ఎస్.ఆర్.ఆర్.శ్రీనివాస్, విజయవాడ (కృష్ణా)
ప్ర: నాది పుష్యమీ నక్షత్రం- 2వ పాదం- జీవితంలో ఏమీ అభివృద్ధి లేదు. నేను ఏం చేయాలో చెప్పండి?
సమా: ఎవరైనా సద్గురువును ఆశ్రయించి లక్ష్మీ గణేశ మంత్రోపదేశం తీసుకొని పవిత్ర క్షేత్రంలో ముఖ్యంగా కాణీపాకంలో 11 రోజులు దీక్షతో జపం చేయండి. అద్భుతమైన మార్పు రాగలదు.
కాకర్లమూడి రామలింగమూర్తి, తణుకు
ప్ర: కుమారుని వివాహం- స్థిరత్వం గురించి వివరించగలరు?
సమా: మీ కుమారుని నక్షత్రం- రాశి- చరరాశులు- వీరికి పూర్తి స్థిరత్వం తక్కువ. మార్పులను కోరే లక్షణం ఉంటుంది. ప్రస్తుతం ఏలిన నాటి శని ప్రభావం ఉంది. స్వయంవరం జరిగే అవకాశం ఉంది. మార్పు ఈశాన్య దిశలు- వివాహయోగం దిశలు.
ఉప్పు సత్యనారాయణ, తెనాలి (గుంటూరు)
ప్ర: గురువుగారూ! లోగడ ఒకసారి ప్రశ్న అడిగాను. సమాధానం రాలేదు. జ్యోతిష శాస్త్రం శాస్ర్తియత ఎంతవరకు- ఇది అన్ని మతాలవారికీ వర్తిస్తుందా?
సమా: శాస్త్రం అంటే నియమ నిశ్చయబద్ధమైన విషయ పరిజ్ఞానం శాస్త్రం సార్వజనీనం- ప్రతివారూ ప్రపంచంలో వారి సంప్రదాయాలను బట్టి పాటిస్తారు.
రెడ్డిచర్ల రఘునాధ్, విజయవాడ (కృష్ణా)
ప్ర: సొంత ఇంటికోసం ముఖ్యమంత్రిగారికి దరఖాస్తు పంపాను. దానిని ముఖ్యమంత్రిగారు (ఎపి) హౌజింగ్ డిపార్టుమెంట్‌కు పంపించారు. ఫలిస్తుందా?
సమా: లోగడ మీకు ప్రభుత్వ మూలకంగా లాభిస్తుందని భవిష్యకాలంలో చెప్పాను. ఆలస్యంగా ఫలిస్తుంది-
బదినేహళ్ళి రుద్రదేవప్ప - బెంగుళూరు (కర్ణాటక)
ప్ర: గురుస్వామిగారూ! నమస్కారం! మూడు సంవత్సరాలు క్రిందట 2013 డిసెంబర్ భవిష్యకాలంలో ఉద్యోగం గురించి అడిగాను. కాని నాకు ఉద్యోగ యోగం లేదు- రాజకీయాలే యోగించే అవకాశం ఉందని చెప్పినారు. నేను నమ్మలేదు. కాని అనుకోకుండా మా వూరి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. మీరు చెప్పిందే నిజమైంది. ప్రస్తుతం 2019లో ఎంఎల్‌ఏగా పోటీ చేయాలని ఉంది. ఎలా ఉంటుంది చెప్పండి? దానికోసం ఏదైనా చేస్తాను.
సమా: మీరు గ్రామ సర్పంచగా ఎన్నికైనందుకు అభినందనలు. రాజకీయ మహాయోగానికి చండీహిల్స్‌లో రాజా శ్యామలా విజయదుర్గా సంపుటి యాగం చేయించండి. శుభం జరుగును. ప్రయత్నం పురుష లక్షణం. ఫలితం దైవాధీనం అనే మాట గుర్తుంచుకోండి!
చాపర్ల రజనీకాంత్, బాపట్ల (గుంటూరు)
ప్ర: నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె నిరాకరించింది. ఇప్పుడు ఆమె అంటేనే ద్వేషం కలుగుతోంది. ఏం చేయమంటారు?
సమా: మీది ప్రేమ కాదు- స్వార్థాహంకారం- నిజమైన ప్రేమ త్యాగాన్ని వరిస్తుంది. ‘మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా- ఎక్కడ ఉన్నా నీ సుఖమే నే కోరుకున్నా’ ఆత్రేయగారి ఆదర్శ ప్రేమగీతం గుర్తుకు తెచ్చుకోండి.

భవిష్యకాలం కూపన్
పేరు : .............................................................
చిరునామా : ..............................................
.......................................................................
........................................................................
.......................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
........................................................................
ప్రశ్న :
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................
.......................................................................
........................................................................ .....................................................................

సంతకం :
కూపన్ నింపి ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్,
సికింద్రాబాద్- 03.
bhoomika@andhrabhoomi.net

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ