భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.వి.వి.సత్యనారాయణ, అద్దంకి
(ప్రకాశం జిల్లా)
ప్ర: నా తమ్ముడి కారణంగా అప్పుల్లో చిక్కుకుని బాధపడుతున్నాను. నా తమ్ముడు రెండున్నర సంవత్సరాల క్రితం పారిపోయాడు.
సమా: మీ సమస్యల పరిష్కారానికి ఇంకా చాలా ఆలస్యముంది. మీ తమ్ముడు ఉత్తర భారతదేశంలో తీర్థక్షేత్రాలలో ఉన్నట్టు అనిపిస్తున్నది. ఒక సంవత్సరం తరువాత అతని గురించి వర్తమానం మీకు తెలియగలదు.
కె.నాగభూషణం, కమలానగర్
(అనంతపురం)
ప్ర: ఫ్లాటు అమ్మకంలో ఆలస్యం. వాస్తు నివారణకు పరిష్కారం ఏమిటి?
సమా: ఫ్లాటు విక్రయానికి డాక్యుమెంట్ల విషయంలో కొన్ని బలహీనతలూ, మరొకరి ప్రమేయమూ కనబడుతోంది. అవాంతర నివారణ మహాగణపతి యంత్రాన్ని కానీ, శే్వత్తార్క గణపతి మూర్తిని జిల్లేడు పూలతో పూజించండి. ఫలితం లభిస్తుంది.
ఆకెళ్ల మురళీకృష్ణ, విశాఖ
ప్ర: మనం హిందువులుగా ఎంతకాలం మనగలం?
సమా: మన ధర్మం పట్ల రాజీపడని దీక్షతో ఉంటే మనకేమీ ప్రమాదం లేదు. ఢిల్లీ రాజధానిగా ఉన్నంత కాలం ఈ దేశానికి ఒడిదుడుకులు తప్పవు. హిందూత్వానికి బయటి శత్రువులకంటే అంతశ్శత్రువులే ఎక్కువ.
ముత్యాల శ్రీనివాస్, మంగళగిరి
ప్ర: ప్లాస్టిక్ వ్యాపారం చేయాలనుకుంటున్నా. యోగిస్తుందా? ఆరోగ్యం సహకరించడంలేదు.
సమా: ‘శరీరామాద్య ఖలు ధర్మసాధనం’ అన్నారు. ఆరోగ్యవంతమైన శరీరముంటేనే ఏదైనా సాధించగలిగేది. మీ జాతకంలో కుజః శని యుతి దోషాలు దుస్థానంలో ఉన్నాయి. దానికి తగు శాంతి చేయించుకోండి.
భాస్కరరావు, అమరావతి
ప్ర: పొలం కొనాలని ఉంది. నాకు వ్యవసాయం బాగా ఉంటుందా?
సమా: మీరు సొంతంగా చేస్తే మాత్రం వ్యవసాయం బాగుంటుంది. అచ్చి వస్తుంది. వేరే వాళ్ళతో చేయిస్తే మాత్రం వారి ప్రభావం మేరకు ఫలితం ఉంటుంది.
వి.ప్రసాద్, వీరవాసరం (ప.గో.)
ప్ర: ఆరోగ్య సమస్యలు..
సమా: మీకు జాతకం ప్రకారం నడుము, అరికాళ్లు, పిక్కలు బలహీన స్థానాలు. ఈ భాగాలలో వచ్చే అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆందోళన పడటం కంటే ఆచరణతో కూడిన ప్రయత్నం మంచిది.
ఎస్.కృష్ణప్రియ, చినవాల్తేరు (విశాఖ)
ప్ర: శనిపీడలకు ఏం చేయాలి?
సమా: శనివారం వేంకటేశ్వర వ్రతం చేయండి. శనికి తైలాభిషేకం, కాకులకు నువ్వులు కలిపిన అన్నం పెట్టండి.
శింగంశెట్టి సత్యశ్రీ,తణుకు (ప.గో)
ప్ర: వివాహం ఎప్పుడు?
సమా: మీ జాతకంలో వివాహ స్థానానికి శని, కుజ దోషం ఉంది. తగు విధంగా దైవసేవ చేయించండి.
పి.శంకర్, జనగామ (వరంగల్)
ప్ర: నేను పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి రాబట్టుకోగలనా?
సమా: తీవ్రమైన ఘర్షణలు జరిగే అవకాశముంది. మరోవిధంగా ఆస్తి సంపాదించడానికి ప్రయత్నించండి.
సి.వెంకట శివరామకృష్ణ, వేలూరు
ప్ర: కోర్టు వ్యవహారం, విడాకులు..
సమా: ఇంకా ఆలస్యముంది. మీరు చెప్పిన తేదీలలో అందుకు అవకాశం లేదు.
బండి నాగరాజు, అరకువేలీ
ప్ర: లోగడ నా ప్రశ్నలకు మీరిచ్చిన సమాధానం- నా జీవిత గమనాన్ని చక్కగా మార్చింది. నేను ఇతర రాష్ట్రాలలో ఆస్తులు కొనగలనా?
సమా: కర్నాటక, మహారాష్టల్రు మీకు అనుకూల స్థానాలు. ప్రయత్నించండి. శుభం జరుగుతుంది.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ