క్రీడాభూమి

భయం ఉంటే వెళ్లొద్దన్నాం.. అయినా ఎవరూ వినలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ వెల్లడి

కరాచీ, మార్చి 11: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భ్రద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని పాకిస్తాన్ జట్టులో ఎవరికైనా అనుమానాలు ఉన్నట్లయితే భారత పర్యటనకు వెళ్లకుండా మానుకునేందుకు అవకాశం కల్పించామని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ శుక్రవారం వెల్లడించాడు. ‘ప్రస్తుత పరిస్థితుల నడుమ భారత్‌లో క్రికెట్‌పై దృష్టి కేంద్రీకరించడం కష్టసాధ్యమని పాక్ ఆటగాళ్లు ఎవరైనా భావిస్తే వారు జట్టు నుంచి తప్పుకునేందుకు వీలు కల్పించాలన్నది నా అభిప్రాయం. కనుక భారత్‌లో పర్యటించడంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ విషయాన్ని నాకు గానీ లేక జట్టు మేనేజర్ ఇంతికాబ్ ఆలమ్‌కు గానీ తెలియజేయాలని పాక్ ఆటగాళ్లకు స్పష్టం చేశా’ అని షహర్యార్ ఖాన్ లాహోర్‌లో విలేఖర్ల సమావేశంలో చెప్పాడు. అయితే పాక్ జట్టులోని ఏ ఆటగాడు ఈ అవకాశాన్ని స్వీకరించలేదని, భారత్‌కు వెళ్లి టి-20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడాలనుకుంటున్నట్లు వారంతా తేల్చి చెప్పారని షహర్యార్ వివరించాడు.
ప్రస్తుతం భారత్‌లో టి-20 ప్రపంచ కప్ టోర్నీని చుట్టుముట్టిన అంశాల గురించి వివరించేందుకు షహర్యార్ గురువారమే లాహోర్‌లో పాక్ క్రికెటర్లతో భేటీ అయ్యాడు. ఈ టోర్నీ సందర్భంగా పాక్ ఆటగాళ్లకు భారత్ పూర్తి భద్రత కల్పించాలని ప్రభుత్వం ఎందుకు కోరుతున్నదీ ఆయన ఈ సందర్భంగా వివరించాడు. అయితే ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పాక్ జట్టు భారత్‌కు వెళ్లాలని నిశ్చయించుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, పాక్ ఆటగాళ్లకు భారత ప్రజలు సాదర స్వాగతం పలుకుతారని గట్టిగా విశ్వసిస్తున్నానని షహర్యార్ చెప్పాడు.