ఐడియా

శరీరానికి రక్షణ కవచం విటమిన్ సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుబైనా.. జాండీస్ అయినా... కడుపునొప్పి నుంచి కాన్సర్ వరకూ అన్ని రకాల జబ్బులకు విటమిన్ సి దివ్యౌషధం. శరీరాన్ని రోగకారక క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ దరిచేరకుండా విటమిన్ సి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
మనకు సీజన్లవారీగా రోజూ మార్కెట్‌లో లభ్యమైన వివిధ రకాలైన ఫలాలు, కూరగాయల్లోనే విటమిన్ సి సమృద్ధిగా వుంటుంది. పేదవాడి యాపిల్‌గా పేరు పొందిన జామపండులో ఈ విటమిన్ పుష్కలంగా వుంటుంది. ఇంకా అందరికీ తేలిగ్గా లభ్యమయ్యే నిమ్మకాయలు, ఉసిరికాయలు, టమోటాలు, నారింజ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష ఇలా 120 రకాల పండ్లు, కూరగాయల్లో ‘సి’ విటమిన్ పుష్కలంగా వుంది. సాధారణంగా మనకొచ్చే జలుబు, రొంప వంటి స్వల్ప రుగ్మతల నుంచి క్యాన్సర్, ట్యూమర్ వంటి ప్రాణాంతక జబ్బులు రాకుండా నిరోధించి శరీరాన్ని కాపాడే శక్తి విటమిన్ సికి మాత్రమే వుందని పరిశోధకులు కూడా నిర్థారించారు. ఆధునిక ప్రపంచాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తోన్న వత్తిడి (స్ట్రెస్)ని దూరం చేసి మనుష్యులు యధాప్రకారం తమ దైనందిన కార్యకలాపాల్లో పాల్గొనేటట్లు చేయగలిగినది విటమిన్ సి మాత్రమేనని పోషకార నిపుణులు కూడా తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటుకు, బైపాస్ సర్జరీలకు కూడా విటమిన్ సి తనదైన తరహాలో సమాధానం చెప్తుందని డాక్టర్లు అంటున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ పెంపొందించుకోవాలంటే రోజు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగండి లేదా నాలుగు ఉసిరికాయలు లేదా 7 టమాటాలు తినమని కార్డియాలజిస్టులు పేర్కొంటున్నారు.
ప్రపంచంలో 85 శాతం ప్రజలను పీడించే జబ్బు ‘్ఫ్ల’. ఫ్లూను సమర్థంగా ఎదుర్కోవాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు శరీరంలో ఎప్పుడూ తగిన మోతాదులో విటమిన్ సి వుండాలి. ఇదీ పాలింగ్ నిర్థారణ. విటమి సి మోతాదుకు మించి శరీరంలో వుంటే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయన్న వ్యాఖ్యలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. విటమిన్ సి పుష్కలంగా వున్న పళ్ళు, కాయలను తింటే ఆపరేషన్ తరువాత రోగి త్వరగా కొలుకునేటట్లు చేస్తుందని వైద్యులు ధృవీకరించారు. అలెర్జీలకు గురయ్యేవారు విటమిన్ సి తీసుకోవాల్సి వుంటుంది. జీవితాంతం ఆరోగ్యంగా వుండా లంటే విటమిన్ సి మీ ఆహార మెనులో ప్రతిరోజూ వుండాల్సిందే.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

-బి.మాన్‌సింగ్ నాయక్