సబ్ ఫీచర్

పాకెట్ మనీతో టాయిలెట్స్-- చిన్నారి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదకొండేళ్ల మందిరా చటర్జీ రుపాయి విలువ తెలుసుకుంది. అందుకే తల్లిదండ్రులు తనకిచ్చిన పాకెట్ మనీతో టాయిలెట్స్ కట్టించి అందరి ప్రశంసలు అందుకుంది. జెమ్‌షెడ్‌పుర్‌లోని హిల్ టాప్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న మందిరా చటర్జీ ఇంటి వద్ద చుట్టుపక్కల పిల్లలతో ప్రతిరోజూ ఆడుకుంటుంది. ఆ పిల్లలు సడన్‌గా స్కూలు ఎందుకు మానేస్తున్నారో అర్థంకాలేదు. కారణం వారిని అడిగింది. ‘మా స్కూల్లో టాయిలెట్స్ లేకపోవటం వల్ల మానేస్తున్నాం’ అని చెప్పటంతో ఆశ్చర్యపోయింది. తెలుసుకుని ఆశ్చర్యపోయింది. రోజూవారీ కూలీ పను లు చేసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించి చదివించలేక ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. ఆ పాఠశాలల్లో టాయిలెట్స్ లేక ఆడపిల్లలు స్కూలుకు వెళ్లటమే మానేస్తున్నారు. విషయం తెలుసుకున్న మందరి చటర్జీ కలతచెంది ఇలాంటి పిల్లలకు తనకు చేతనైన సాయం చేయాలని భావించింది. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయకుండా పొదుపు చేయ టం ప్రారంభించింది. రూపాయి రూపా యి దాచి సంవత్సరానికి రూ.24 ,000లు కూడబెట్టింది. మందిర ప్రతిరోజూ అధిక మొత్తంలో పాకెట్ మనీ అడగటం గమనించిన తల్లిదండ్రులు తొలుత కంగారుపడ్డారు. ఇంత డబ్బు ఎంచేస్తుందోనని ఆరా తీశారు. ఆమె కోరిక తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించి టాయిలెట్స్ లేని స్కూల్లో టాయిలెట్స్ నిర్మించేందుకు పోగేస్తుందని తెలుసుకుని సంతోషపడ్డారు. ఎలాంటి ఆర్థిక పాఠాలు చెప్పకుండానే ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకున్న తమ చిన్నారి ఆలోచనకు ముచ్చటపడి పాకెట్ మనీని ఎక్కువ ఇవ్వటం ప్రారంభించారు. ఇలా కూడబెట్టిన పాకెట్ మనీ తో కేంద్రాది అనే గ్రామంలో రెండు టాయిలెట్స్ కట్టించింది. అసలు ఆ గ్రామస్తులకు టాయిలెట్స్ అనేవి ఎలా ఉంటాయో కూడా తెలియదు. అలాంటి గ్రామంలో రెండు టాయిలెట్స్ నిర్మించింది. వారంలో ఒకరోజు ఆ గ్రామానికి వెళ్లి టాయిలెట్స్ ఆవశ్యకతను వివరిస్తూ గ్రామస్తుల కు పారిశుద్ధ్యం పాఠా లు సైతం చెబుతోంది.