మెయిన్ ఫీచర్

నోటు లేకుండా నీట్‌గా జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతవరకు ఎటిఎంకు వెళ్లని ఎందరో మహిళలు
సోషల్‌మీడియాలో అనుభవాలు పంచుకుంటున్న వైనం

‘‘అయ్యోయ్యో చేతిలో డబ్బులు లేవే.. అయ్యోయ్యో పర్సు ఖాళీ ఆయెనే’’ అని నవంబర్ 8 తేదీ నుంచి ‘పెద్ద’ కష్టంపై జనం తల్లడిల్లిపోతున్నారు. రాకూడని ఉపద్రవం ఏదో ముంచుకొచ్చి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు భావిస్తున్నాం. చాంతాడంత క్యూలో నిలబడకుండానే, పెద్ద నోట్లు లేకుండానే దర్జాగా బతకవచ్చని చాలామంది సామాన్య, మధ్యతరగతిమహిళలు నిరూపిస్తున్నారు. గుట్టుగా సంసారాన్ని నెట్టుకువస్తున్నారు. అలాంటివారు తమ అనుభవాలను సోషల్ మీడియాల్లో పంచుకుంటున్నారు. ముంబయికి చెందిన అపర్ణా వర్మ కూడా పెద్దనోట్లు రద్దు చేసిన తరువాత నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తన నిత్యజీవనం ఎలా సాఫీగా సాగుతుందో వివరించింది. ఆమె మాటల్లోనే..
నవంబర్ 8వ తేదీ రాత్రి పెద్ద నోట్లు రద్దుచేసినపుడు నా చేతిలో కేవలం ఆరు వంద రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి. మరుసటి రోజు మా అంకుల్ ఫోన్ చేసి నువ్వు ఇపుడు ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగారు. సింపుల్ నావద్ద ఎలాంటి పెద్ద నోట్లు లేవు. కాబట్టి కంగారు లేదు. నిశ్చింతంగా ఉంటాను అని సమాధానం చెప్పాను. మరుసటి రోజు ఇంట్లో కూరగాయలు అవసరమైతే వెంటనే ‘బిగ్ బాస్కెట్’కు ఆర్డర్ ఇవ్వటంతో సమృద్ధిగా కూరగాయలు, పండ్లు ఇంటికి వచ్చాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానంతో వారికి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాను. ఎక్కడకైనా వెళ్లాలంటే ఉబర్ ట్యాక్సీని కాల్‌చేస్తే చాలు. ఇంటి ముంగిట వాలేదు. వారికి పేటిఎమ్ ద్వారా నగదు చెల్లించేదాన్ని. కాకపోతే బిగ్‌బాస్కెట్‌లో పాలు, పచారీ సరుకులు దొరకవు. ఇంతకుముందు నేను స్థానికి పచారీ దుకాణదారుడికి ఫోన్ చేస్తే సరుకులు, పాలు తెచ్చేవాడు. కాని అతనికి చెల్లించటానికి నావద్ద డబ్బులు లేకపోవటంతో నేను దగ్గర్లో ఉన్న సూపర్‌మార్కెట్‌కు వెళ్లి కార్డు పేమెంట్ ద్వారా కావల్సిన సరుకులు, పాలు తెచ్చుకుంటున్నాను. ఈ సందర్భంగా నా వద్ద ఉన్న రూ.500లు ఖర్చయింది. ఎటిఎం సెంటర్లకు మూడుసార్లు వెళ్లినా డబ్బులు డ్రా చేయలేకపోయాను. పెద్ద క్యూలో కస్టమర్లు నిలబడి ఉంటున్నారు. మా ఇంటికి దగ్గర్లో ఉన్న ఎటిఎం సెంటర్లన్నీ మూతపడ్డాయి. మా ఇంటి కింద మెట్ల వద్ద రెస్టారెంట్ ఉంది. అక్కడ ఒక్కసారి కోక్‌తాగాలని వెళ్లాను. క్యాష్ పేమెంట్ చేస్తేనే కోక్ ఇస్తాను అన్నాడు. దీంతో కోక్ తాగకుండానే వెనుదిరిగాను. కారు డ్రైవర్‌కు జీతాన్ని అతని ఎక్కౌంట్‌లో నిఫ్ట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చేశాను.
పెద్దనోట్ల రద్దువల్ల వృద్ధులకు కొంతమేరకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే. మా అంకుల్, ఆంటీ వయసు 70 సంవత్సరాలకు పైగా ఉంటుంది. వారి కుమారులు విదేశాల్లో ఉంటారు. అంకుల్ నవంబర్ 8వ తేదీనాడు వారి చేతిలో ఉన్న రూ.40,000 రూపాయలను డిపాజిట్ చేశారు. అదేరోజు పెద్దనోట్లు రద్దవ్వటం వల్ల వారు ఎటిఎం నుంచి విత్‌డ్రా చేసుకోవటానికి దాదాపు 10సార్లు వెళ్లవలసి వచ్చింది. పెద్ద నోట్లు రద్దు వల్ల ఇలాంటి వృద్ధులకు ఎంతో ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే. ఈమధ్య కాలంలో నేను గోవా వెళ్లినపుడు అక్కడ బ్రిటన్ నుంచి వచ్చిన ఓ వృద్ధ జంట పరిచయం అయ్యారు. వారు రూ.2000లు తీసుకోవటానికి నానాతంటాలు పడటం కళ్లారాచూశాను. ఇలా కొంతమంది ఇబ్బందులు పడుతున్నా చేతిలో కరెన్సీ నోట్లు లేకుండా కూడా అన్ని అవసరాలు తీర్చుకోవట పెద్ద కష్టం కాదు అని అపర్ణావర్మ అభిప్రాయం.

అపర్ణా వర్మ