మెయిన్ ఫీచర్

పట్టుదలతో పైలట్ కొలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్ననాటి కల సాకారం చేసుకున్న ఆయేషా
పదహారేళ్లకే లైసెన్స్
కల్పనాచావ్లా స్పూర్తితో శ్రమించి..సాధించింది

అయేషా ఆరవ తరగతి చదువుతున్నపుడు తొలి భారతీయ వ్యోమగామి కల్పనాచావ్లా గురించి విన్నది. ఆమెనే స్ఫూర్తిగా తీసుకుంది. పెద్దయితే విమానాన్ని నడపాలని దృఢంగా నిశ్చయించుకుంది. పట్టుదలతో ఆమె చేసిన కృషికిగానూ నాసా నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయేషాతో పాటు మరో ఇద్దర్ని అంతరిక్షయాన శిక్షణకు అమెరికా నాసా కేంద్రం ఎంపికచేసింది. ఎగిరిగంతేసిన ఆయేషా నాసాకు వెళ్లిన తరువాత అక్కడ భారతీయ-అమెరికా సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలుసుకుంది. 2014లో రెండు నెలల పాటు నాసా స్పేస్ అకాడమీలో శిక్షణ తీసుకుంది.
ఇండియాకు వచ్చిన వెంటనే ఆమెను భవిష్యత్తులో ఏమవుతావు అని అడిగితే.. డాక్టర్, ఇంజనీర్, లాయర్‌ను అవుతానని చెప్పాలనిపించలేదు. తాను ఏదైనా చేస్తే ఆమెను చూసి మిగితావారు కూడా చేయాలనిపించేలా ఉండాలని భావించేది. చిన్నప్పటి నుంచి విమానం నడపాలనే తన అభిరుచిని కెరీర్‌గా మలుచుకునేందుకు పైలట్ శిక్షణ కోసం తీవ్రంగా శ్రమించింది. పదవతరగతిలో 81శాతం మార్కులు మాత్రమే సాధించిన ఆయేషా పట్టుదల ముందు పైలట్ లైసెన్స్ రాకతప్పలేదు. కేవలం 16 ఏళ్లకే పైలట్ లైసెన్స్ సంపాదించిన తొలి కాశ్మీర్ యువతిగా తన పేరు నమోదుచేసుకుంది.కాశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన ఆయేషా విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే పూర్తిచేసింది. పైలట్ అయ్యే సందర్భంలోతనకెదురైన సవాళ్లను ఏవిధంగా పరిష్కరించుకుందో వెల్లడించింది. భవిష్యత్తులో మిగ్-29 విమానాన్ని నడుపుతానని నిర్భయంగా చెబుతున్న ఆయేషా వెల్లడించిన వివరాలు ఆమె మాటల్లోనే..
భావోద్వేగానికి గురయ్యా
మొదటిసారి లైసెన్స్ చేతికి వచ్చినపుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. ఒక్కసారిగా దాన్ని ముద్దుపెట్టుకున్నాను. చిన్నప్పడు కన్న కల నిజమైందని సంబరపడ్డాను. చాలామంది విద్యార్థులు వాళ్లకొచ్చే మార్కులను బట్టి కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటారు. కాని 70-80శాతం మార్కులతో పాసయ్యే నేను అభిరుచి, సంకల్పంతోనే పైలట్ రంగాన్ని ఎంచుకున్నాను. 2012లో ముంబయి వరకు 350 కి.మీ ధూలే విమానాన్ని నడిపాను. అదే విమానంలో తల్లిదండ్రులు కూడా ఉండటం ఆనందంతో పాటు తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది.
రూ.30 నుంచి 70 లక్షల ఆదాయం
21 సంవత్సరాలకే కమర్షియల్ పైలెట్ అయిన ఆయేషా ఈ రంగంలో కెరీర్ ఎంచుకునేవారికి రూ.30 నుంచి 70 లక్షల ఆదాయం వస్తుందని చెబుతుంది. విద్యార్హత, అనుభవంతో మరింత ఆదాయం వస్తుంది.
పురుషాధిపత్యం ఎక్కువ
విమానయాన రంగంలోకి ఎక్కువగా పురుషులే వస్తుంటారు. స్టూడెంట్ లైసెన్స్ శిక్షణ కోసం వచ్చినపుడు నలుగురు మగపిల్లల మధ్య నేనొక్కదానే్న. మగ వాళ్లతో పాటే అమ్మాయిలు పోటీ పడుతుంటే మాత్రం సహించేవారు కాదు ఆధిపత్యధోరణి అవలంభేవారు. వీటన్నింటిని తట్టుకుని దిగ్విజయంగా శిక్షణ పూర్తిచేయటం జరిగింది. విమానయాన రంగంలో విధి నిర్వహణలో ఎల్లప్పుడు జాగురకతతో ఉండాలి. తెల్లవారుజామున రెండు గంటలు డ్యూటీ చేయమన్నా వద్దనకుండా చేయాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, ఆత్రుత ఉండాలి. ఇది ఉదయం 9 గంటలకు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు ఇంటకి వచ్చే జాబ్ మాత్రం కాదు.కాశ్మీర్‌లో నిరంతరం యుద్ధవాతావరణం ఉంటుంది. గత ఏడాది రాష్ట్రం మొత్తం ఎనిమిది నెలల పాటు కర్ఫ్యూ వాతావరణంలో మగ్గిపోయింది. కనీసం ఇంటర్నెట్ వంటి సదుపాయం కూడా లేదు. అక్కడ రెండు నెలల పాటు ఉండాల్సి వచ్చింది. ఇలాంటి జీవన పరిస్థితుల మధ్య పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. యువత అడుగు ముందుకు వేస్తే ఎంచుకున్న కెరీర్‌లో మందుకు వెళ్లగలరు.
కష్టపడే మహిళలకు ఈ రంగంలో అవకాశాలు
16 ఏళ్లకే స్టూడెంట్ పైలట్ లైసెన్స్ సంపాదించిన తొలి కాశ్మీర్ యువతిగా తన పేరు నమోదు కావటం తనకు గర్వంగా ఉన్నప్పటికీ, గుర్తింపు కోసం పాకులాడలేదని అంటారు. కమర్షియల్ పైలెట్ లైసెన్స్ వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టినపుడు అభినందనలు చెబుతూ మెస్సేజ్‌లు పెట్టారు. విమానయాన రంగంలో మహిళలు అడుగుపెట్టటానికి ఇదే సరైన సమయం. ఎన్నో కంపెనీలు ఈ రంగంలోకి వస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లోనూ ఉపాధి దొరుకుతుంది. రెమ్యూనరేషన్ బాగానే ఉంది. కష్టపడేతత్వం ఉండే మహిళలు ఈ రంగంలో రాణించటం సులువు.
మిగ్-29 నడుపుతా
ఇప్పటి వరకు మనదేశంలో మహిళ మిగ్-29 అనే విమానం నడపలేదని. జీవితంలో ఎప్పటికైనా నడుపుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే అమెరికా మాజీ ప్రధమ పౌరురాలు మిచ్చెల్ ఒబామాను ఆరాధిస్తానని, ఆమె ఆడపిల్లలను ప్రోత్సహించేతీరు బాగుంటుందని అంటారు. ఏ రంగంలోనైనా అడుగుపెట్టాలని కలలు కనేవారు వాటిని సాకరం చేసుకునేందుకు కృషిచేస్తే తప్పక విజయం సాధిస్తారని ఆయేషా అంటారు.