మెయిన్ ఫీచర్

పంట పండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న నగరాల్లో స్టార్టప్‌ల జోరుఖ ప్రయోగాలతో ఫలితాలు సాధిస్తున్న యువత
ఖవ్యవసాయ రంగంలో వినూత్న పోకడ

స్టార్టప్స్ అనగానే ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయన్న భావన చాలామందిలో ఉంది. వాస్తవానికి స్టార్టప్ కల్చర్ దేశవ్యాప్తంగా విస్తరించింది. వ్యాపారం పట్ల మక్కువ కలిగిన యువతీ యువకులు స్టార్టప్స్‌ను ప్రారంభిస్తున్నారు. వీరంతా 25 సంవత్సరాలలోపువారే కావటం విశేషం. మెట్రో నగరాలకే పరిమతంకాకుండా చిన్న నగరాల్లోనూ ఈ కల్చర్ విస్తరిస్తోంది. నైపుణ్యతోకూడిన విధానాలతో యువత తమ భవితకు బాటలు వేసుకుంటోంది. ‘సీడ్ బాస్కెట్ డాట్.ఇన్’ అనే ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆర్గానిక్ విత్తనాలను ఓ యువజంట అందిస్తోంది. ‘హ్యాపీ బై’ స్టార్టప్‌తో ఇంటికి
కావల్సిన సరుకులు చెంత చేరుస్తున్న అన్నదమ్ముల విజయ ప్రస్థానం ఇది.

జి సేంద్రియ ఉత్పత్తులను అందించే ‘సీడ్ బాస్కెట్’
జి హైదరాబాద్ యువజంట ఆన్‌లైన్ ఆలోచన

నవీన్, చందన కొత్తగా పెళ్లయిన జంట. కొత్తగూడెం నుంచి వచ్చిన ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. ఇంట్లో ఖాళీగా ఉన్న బాల్కనీలో కావల్సిన కాయగూరలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతుల్లో పండించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఎన్ని షాపులు వెతికినా వారికి మంచి ఆర్గానిక్ విత్తనాలు దొరకలేదు. నేతిబీర కాయలో నేయి చందంగా అందమైన ప్యాకింగ్‌పై ఆర్గానిక్ విత్తనాలు అని రాసినంత మాత్రాన నమ్మలేకపోయారు. ఎన్నో షాపులు వెతికారు. ఆ విసుగులోంచి పుట్టిన ఆలోచనే ‘సీడ్ బాస్కెట్ డాట్ ఇన్’. ఒక స్టార్టప్ దిశగా అడుగులు పడేలా చేసింది. ఇపుడు హైదరాబాద్ నగరంలో హోం గార్డెనింగ్ చేయాలనుకునేవారికి ఆర్గానిక్ విత్తనాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే చాలు మీ ముంగిటకు వస్తాయి.
వెబ్‌సైట్ కోసం ఎన్నో కష్టాలు
ఈ వెబ్‌సైట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దటానికి నవీన్‌కు ఎనిమిది నెలలు పట్టింది. రెండు నెలలు ఎన్నో పరిశోధనలు చేశాడు. మరో ఆరునెలలు కష్టపడిన తరువాత హోం గార్డెనింగ్ కోసం అన్ని రకాల విత్తనాలు దొరికే ఆన్‌లైన్ స్టోర్‌గా సీడ్ బాస్కెట్ అవతరించింది. ఇందులో వంద రకాల ఆర్గానిక్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పూలు, పండ్ల విత్తనాలు కూడా దొరుకుతాయి. సేంద్రియ ఉత్పత్తులు స్వయంగా పండించుకుని తినాలనుకునేవారు కాలు కదపకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు. ఆధునిక టెక్నాలజీలో వచ్చిన ఈ మార్పు మంచిదే అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన యువజంట నవీన్, చందన.
సవాళ్లను అధిగమించి..
తొలుత ఈ స్టార్టప్ ప్రారంభించినపుడు ఈ జంటకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. మొదట్లో అనుకున్నంత స్పందన రాలేదు. కొరియర్, షిప్పింగ్ సమస్యలు వచ్చాయి. నిదానంగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ప్రస్తుతం నెలకు 50 ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. రాబోయే వర్షాకాలం సీజన్‌కు ఈ ఆర్డర్లు వంద వరకు పెరగవచ్చనే ఆశాభావంతో ఉన్నారు. నవీన్ భార్య చందన ఆర్డర్స్‌కు సంబంధించిన పనులు, కొరియర్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇంటింటికీ ఆర్గానిక్ ఫుడ్ అనే సూత్రంతో ఈ ఆన్‌లైన్ స్టోర్‌ను మరింత విస్తరించి సేంద్రియ ఉత్పత్తుల మీద ప్రజలకు అవగాహన పెంచటానికి కృషిచేస్తున్నట్లు నవీన్, చందన వెల్లడిస్తున్నారు.

జి ‘హ్యాపీ బై’ స్టార్టప్‌తో సక్సెస్
జి చిలకలూరిపేట యువకుల చిరు ప్రయత్నం

ఇంటికే
సరుకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇద్దరు యువకులు ప్రారంభించిన స్టార్టప్ ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. లక్ష మంది జనాభా ఉన్న ఈ చిన్ని పట్టణంలో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ స్టార్టప్‌తో ఇంటికి కావల్సిన అన్ని రకాల సరుకులు, కూరగాయలు అందిస్తారు. కేవలం ఎనిమిది వేల రూపాయల పెట్టుబడితో ఆరంభించిన ఈ స్టార్టప్ ఆ పట్టణంలోని వృద్ధులకు ఒక వరంగా మారిందని చెప్పవచ్చు.
ఎలా వచ్చిందీ ఆలోచన
చిలకలూరిపేటకు చెందిన కారంశెట్టి సాయి ప్రవీణ్ అందరిలాగే కంప్యూటర్ కోర్స్ పూర్తిచేసి ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ట్రెయినీగా చేరాడు. అయితే కాలేజీ రోజుల నుంచి అతనికి స్టార్టప్‌ల గురించి తెలుసుకుని తాను కూడా ఓ సంస్థను ప్రారంభించాలని తహతహలాడేవాడు. ఓసారి పనిమీద బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వయసు మళ్లి న వ్యక్తి పక్క వ్యక్తితో మాట్లాడుతూ.. ఈ వయసులో రోజంతా సరుకులు తెచ్చుకోవటంలోనే కాలం గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేయటం ప్రవీణ్ విన్నాడు. ఇలాంటి వారి టైం వేస్ట్‌కాకుండా ఇంటికే సరుకులు తీసుకువచ్చి ఇచ్చే విధానం ఉంటే బాగుంటుంది కాదా అని ఆలోచించాడు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘హ్యాపీ బై డాట్ ఇన్’. ఉద్యోగం వదిలేసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించిన సాయి ప్రవీణ్ స్థానిక అవసరాలకు తగ్గట్టు దీన్ని తీర్చిదద్దాడు. స్థానికంగా దొరికే అన్ని రకాల సరుకులు, కూరగాయలు, ఎలక్ట్రికల్, ప్లంబర్ వంటివాటిని కూడా అందిస్తారు. స్థానిక కిరణా షాపులతో టైఅప్ చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో కస్టమర్ల దగ్గర ఆర్డర్లు తీసుకుని ఆ లిస్ట్ షాపులకు పంపుతారు. తరువాత డెలివరీ బాయ్ సామాన్లు తీసుకుని కస్టమర్లకు అందిస్తారు. ప్రస్తుతానికి రోజుకు పది ఆర్డర్లు వస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సర్వీసును అందుబాటులో ఉంచారు. వందమంది వరకు రిజిష్టర్డ్ యూజర్లు ఉన్నారు. ప్రవీణ్ తమ్ముడు హేమంత్ డెలివరీ మేనేజ్మంట్ చూసుకుంటారు. తల్లి కూడా ఇద్దరి కొడుకులకు సపోర్టుగా నిలిచింది. నలుగురు డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు. మరికొన్ని సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నారు.

ఆన్‌లైన్లో ఆర్గానిక్
విత్తనాలు

అన్నదమ్ములు ప్రవీణ్, హేమంత్

విక్రయానికి సిద్ధంగా
సరకులు

నవీన్, చందన