సబ్ ఫీచర్

కార్తీకంలో తప్పనిసరి.. ఉసిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉసిరికాయను దైవవృక్షంగా భావిస్తారు గనుకే కార్తీకమాసంలో వనభోజనాల సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద వంటలు వండుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. కార్తీక మాసంలో పూజలకు, అనేక నోములు, వ్రతాల్లోనూ ఉసిరికి ప్రాధాన్యం ఉంది. తరచూ ఉసిరికాయలు తినేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. చర్మవ్యాధుల నివారణకు, శిరోజాల గట్టిదనానికి ఇది దోహదపడుతుంది. ఉసిరికాయలు తక్కువ కేలరీలను అందిస్తాయి. 80 శాతం మేరకు నీటిని కలిగి ఉంటాయి. వీటిలో పిండి పదార్థాలు, పీచు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్-సితో పాటు కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
వైద్యపరంగానే కాదు, వంటల్లోనూ ఉసిరిని విరివిగా వాడుతుంటారు. ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టపడనివారు ఉండరు. ఉసిరి పచ్చడి పెట్టిన రోజున తినడానికి ఇష్టపడేవాళ్ళు కొందరైతే, పాత ఉసిరికాయ పచ్చడి అంటే ప్రాణం పెట్టేవాళ్ళు మరికొందరు. మన శారీరక అందానికి కూడా ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరిపొడిలో కాస్త పెరుగు, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి, ఆ మిశ్రమాన్ని ‘ఫేస్‌ప్యాక్’ వేసుకుంటే ముఖంపై చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. చర్మంపై ముడతలు కనుమరుగవుతాయి. ఉసిరికాయల రసాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఉసిరి రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలు, మచ్చల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు చర్మగ్రంథులను శుభప్రరుస్తాయి. మొటిమల సమస్య నివారణకు ఉసిరి పొడిలో కాస్త పెసరపిండి, నిమ్మరసం,పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. కాలుష్యం, రసాయనాల ఫలితంగా జుట్టు కుదుళ్ళు దెబ్బతింటే ఉసిరి రసాన్ని తలకు రాసుకోవడం మంచిది. ఉసిరికాయ నిత్య యవ్వనులుగా ఉండేందుకు టానిక్‌లా ఉపయోగపడుతుంది. అంటు వ్యాధులను దూరం చేయడమే గాక, గుండె, కిడ్నీలు, కండరాలకు బలం చేకూరుతుంది. ఉసిరి రసంలో తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే నేత్ర సంబంధ సమస్యలు దరిచేరవు.

-తరిగొప్పుల