సబ్ ఫీచర్

వెలుగుల దివ్వె...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ ఒడే శిశువు చిరునవ్వుల మొదటి బడి. ఆ బడిలోనే ప్రతి శిశువు అవ్యాజ్యమైన ప్రేమను పొందుతూ పెరుగుతాడు. తల్లి అనంతమైన ప్రేమ, వాత్సల్యమే సృష్టి నిలిచి ఉండడానికి కారణమని చెప్పి తీరాలి. బిడ్డ జీవితంలో శక్తిని నెలకొల్పటానికి, ఆ శక్తికి ఒక దిశా నిర్దేశం నేర్పగల మహామూర్తి అమ్మ. ఉత్తమ ఆలోచనలు గల తల్లి పిల్లలను, నిరంతర విద్యార్థులని, జ్ఞాన సముపార్జన నిరంతర ప్రక్రియ అని సున్నితంగా తెలిపే అపురూప ఖని. స్ర్తి ఒక భార్యగా, తల్లిగా, ఒక ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఉద్యోగంలో ఉండే అనేక బాధ్యతలతోపాటుగా ఆమె తన కుటుంబం అంతటిని ప్రేమతోను, జాగ్రత్తతోనూ సంరక్షిస్తుంది. ఇంటా బయట పనులు క్రమం చేసుకునే క్రమంలో తన ఆరోగ్యానికి కూడా చివరి స్థానాన్ని ఇస్తోంది. పని ఒత్తిడి, ఋతుక్రమంలో కలిగే ఇబ్బందులు జీవనసరళిలో, ఆహార, విహారాల మార్పులను సక్రమంగా పట్టించుకున్నట్లయితే ఆమె కుటుంబం, సమాజం తద్వారా దేశం అభ్యుదయ పథంలో నడుస్తాయి.
ప్రతి స్ర్తి స్వతసిద్ధంగానే కుటుంబానికి, సమాజానికి ఎంతో సేవ చేస్తుంది. స్ర్తి తన పాత్రలన్నింటిని సక్రమంగా పోషించడానికి ఆరోగ్యవంతమైన శరీరం, మనస్సు ఎంతో అవసరం. స్ర్తిల గౌరవప్రదమైన సాంఘిక హోదా, ప్రాముఖ్యతలకి అనుగుణంగా ప్రాముఖ్యం ఇవ్వబడాలి.
సర్వకాల సర్వావస్థలలోనూ పూర్వానికి, ఇప్పటికీ అమ్మ పాత్రలో ఏమాత్రం మార్పు లేదు. పేదిరికంలో వున్నా సరే తన శక్తికొద్ది తన పిల్లలని పైకి తీసుకురావడానికే తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒక ప్రణాళికని అనుసరిస్తుంది. నిరంతరం పిల్లల ఆలనా, పాలనా చూస్తూ ప్రేమైకమూర్తిగా వెలుగొందుతుంది.
నేడు పల్లెల్లో అమ్మలు అధీకృతులయ్యారు. ఎన్నో సంఘాలు సంఘటితమయ్యాయి. వారు మార్పుకి కారణం కాగలిగారు. స్ర్తిలందరూ సంఘటితమై కల్లు దుకాణాలమీదికి దండెత్తి ఎన్నో గ్రామాల్లో కల్లు, సారాయి నిషేధించగలిగారు. గ్రామీణ స్ర్తిలు ఏకహస్తంతో ఈ కార్యక్రమాలు నిర్వహించగలిగారు. కాని పట్టణ ప్రాంత స్ర్తిలు అందంమీద అవసరం లేని ప్రాముఖ్యతని ఇచ్చి బ్యూటీ పార్లర్‌లని వదులుకోగలిగితే ఇటువంటి సాహస కార్యాలని ఎన్నిటినో నిర్వహించి విజయాన్ని తమ స్వంతం చేసుకోగలదు. రోజూ ఫోన్‌ని, లాప్‌టాప్‌ని ఛార్జ్ చేసుకున్నట్టే స్ర్తి తనని తాను ఛార్జ్‌చేసుకుంటే బుద్ధి మరింత పదును చెందుతుంది.
ఏ కుటుంబంలోనైనా కేవలం అమ్మ మాత్రమే కుటుంబంలోని భిన్న మనస్తత్వాలని ఏకతాటిపై నడపగలదు. బిడ్డకు మాటలు రాకుండానే బిడ్డ అవసరాలని తల్లి మాత్రమే కనిపెట్టగలదు. ఆమె హృదయపు భాష తెలిసిన నిపుణతగలది. ఇంటర్నెట్ ఆడవారిని లోకమంతా తిప్పవచ్చు.. కాని కుటుంబంలో అఘాతాలు సృష్టించకూడదు. సమతౌల్యాన్ని సాధించడమే విజయం. అమ్మను సమాన స్థాయిలో చూడడం భారతదేశ సంప్రదాయం.

-బులుసు సరోజినిదేవి