భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షణ్ముఖప్రియ, కీరపండరీపురం (కృష్ణా)
ప్ర: మీరు నా పేరు కలం పేరుగా షణ్ముఖప్రియగా సూచించారు. అదే పేరుతో వ్యవహరిస్తున్నాను. ఆ పేరుతో కొన్ని బహుమతులు కూడా గెలుచుకున్నాను. గృహ సమస్యలు తీరేందుకు సులభమైన ఉపాయం చెప్పండి.
సమా: గృహ సమస్యలు తీరడానికి సులభోపాయం శ్రీమత్ భగవద్గీతా పారాయణం.
ఎమ్.సుదర్శనాబాయి, మనదనపల్లి (చిత్తూరు)
ప్ర: నా జీవితంలో చాలా విషయాలు మీరు చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. నా కలం పేరు ‘దీపశ్రీ’గా మార్చుకున్నాను. చిన్న చిన్న పత్రికల్లో పడుతున్నాయి నా కథలు. ప్రముఖ పత్రికల్లో రావటంలేదు.
సమా: ప్రయత్నిస్తూనే వుండండి. ఏ రచయిత కూడా ప్రారంభంలో నిరాశా నిస్పృహలకు లోనవుతాడు- కాని కాకూడదు. రాస్తూనే ఉండండి.
గాయత్రీదేవి, దొరసానిపాడు (ప.గో.)
ప్ర: ఒక భూమి రిజిస్ట్రేషన్ సరిగ్గా మీరు చెప్పినట్లుగా మే నెలలోనే జరిగింది. ప్రస్తుతం దూరంగా ఉన్న పొలాలు అమ్మి దగ్గరవి కొనాలనుకుంటున్నాం. ఎలా వుంటుంది.
సమా: కొనబోయే పొలాల విషయంలో అమ్మకందార్లు ఒకరికంటే ఎక్కువమందిగా కనబడుతున్నారు. ఆలస్యమయ్యే అవకాశం వుంది. జాగ్రత్త కూడా అవసరం.
లక్ష్మీనారాయణ, ఆదోని, కర్నూలు
ప్ర: మేము నలుగురం అన్నదమ్ములం. అందరం ఒకే వ్యాపారం చేస్తున్నాము. మనస్సుల్లో స్పర్థలున్నాయి. నేను వేరే వ్యాపారం చేయాలనుకుంటున్నాను. ఏం వ్యాపారం చేయమంటారు.
సమా: రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేయండి. మిగతావారికంటే భిన్నంగా ఉండి పోటీ తగ్గుతుంది.
ప్రశాంత కామేశ్వరి, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: వివాహం ఎప్పుడు? ఆలస్యానికి కారణమేమి?
సమా: ఆలస్యానికి కారణం శని కుజుల దోషం. ఆగస్టులో కాని కార్తీకమాసంలోకాని జరిగే అవకాశం వుంది. తూర్పు ఉత్తర దిశలు యోగ కారకాలు. దోషాలకు శాంతి చేయించండి.

మట్లపూడి శ్రీనివాస్‌రావు, పొన్నూరు (గుంటూరు)
ప్ర: భయంకరమైన ఆర్థిక బాధలు. గ్రహయోగమా? గృహయోగమా?
సమా: గ్రహయోగం కారణంగా మీలో ఎవరి మాట వినని స్వభావం- అంతా స్వయంకృతంగా కనిపిస్తోంది. పేరాశకు పోయి నిరాశలో కూరుకుపోయారు. ఈశ్వరాభిషేకమే నివారణ.

సి.బాలభాస్కర వర్మ - నాయుడుపేట, నెల్లూరు
ప్ర: కోర్టు కేసులు, రావలసిన డబ్బు వస్తుందా?
సమా: 2017 మధ్య భాగంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

కె.వి.ప్రసాద్, విజయవాడ (కృష్ణా)
ప్ర: స్వంత యిల్లు సంపాదించుకోగలనా?
సమా: తప్పకుండా! ఆలస్యంగా గృహయోగం వుంది.

దార్ల హరికృష్ణ, రామవరప్పాడు (కృష్ణా)
ప్ర: ఆర్థికంగా పూర్తిగా బలహీనుణ్ణి. నా భవిష్యత్తేమిటి?
సమా: స్వయంకృషి యోగమే నీకున్నది. క్రమంగా బాగుంటుంది.

అవనిగడ్డ రమాదేవి- అవనిగడ్డ - కృష్ణా
ప్ర: వివాహం!
సమా: త్వరలోనే జరుగుతుంది.
వి.వి.సుబ్బారావు, రాజమండ్రి, (తూ.గో.)
ప్ర: శేష జీవితం ఎలా గడుస్తుంది?
సమా: ‘వార్థకేమునివృత్తీనాం’ అన్నది కాళిదాస మహాకవి వాక్యం- సాధ్యమైనంతవరకూ వౌనం పాటించండి. సద్గ్రంధ పఠనం- ముఖ్యంగా భగవద్గీతా, శ్రీమత్సుందరకాండ పారాయణ చేయండి.

వి.జగదీశ్వరి, మియాపూర్ (హైదరాబాద్)
ప్ర: మా భూమికి పడమరన గల భూమి నా పేరున కొంటే బాగుంటుందా?
సమా: పడమట గల భూమి ప్రస్తుతం మీరున్న ప్రదేశం కంటే ఎత్తుగా ఉంటే కొనండి. బాగానే ఉంటుంది. పల్లంగా వుంటే పనికిరాదు.

టి.ఆర్.స్వామి, చందానగర్ (హైదరాబాద్)
ప్ర: ఉద్యోగం ఎంతకాలం చేస్తాను. అధికారుల ఆదరణ ఉంటుందా?
సమా: మీ అంత మీరుగా ఉద్యోగం మానేయరు. రూల్స్ ప్రకారం ఉంటారు. ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోండి. అధికారుల ఆదరణ మీ విధేయతను బట్టి ఉంటుంది.

సి.జె.శ్రీ్ధర్, తిరుమలగిరి, సికింద్రాబాద్
ప్ర: ఉద్యోగంలో స్థిరత్వం లేదు. వ్యాపారం చేయాలని ఉంది.
సమా: వ్యాపారమే చేయండి. ఇనుము- కలప- ఫర్నీచర్ యోగిస్తాయి.

కె.దీప, బరంపురం (ఒడిసా)
ప్ర: వివాహం
సమా: ఇంకా ఆలస్యముంది. ఆగ్నేయ దిశనుండి క - ల - వ - ర అనే అక్షరాలతో వివాహ యోగం కలుగుతుంది.
కె.సుజాత, గుంతకల్, అనంతపురం
ప్ర: సంతాన విషయాలు చెప్పండి.
సమా: సమస్యాత్మకంగా వుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధనా దేవతగా పూజించండి. మంగళవారం ఏకభుక్తం (రాత్రి భోజనంగా) ఉపవాసం పాటించండి.
కె.నవీన, బాగ్ అంబర్‌పేట (హై)
ప్ర: నేను ఐ.ఏ.ఎస్. సాధించగలనా? వివాహ జీవితం ఎలా వుంటుంది?
సమా: ఐ.ఎ.ఎస్. ఏమో కాని వివాహమే మిమ్ము వరిస్తుంది.
కె.ఆర్.శ్రీనివాస్, విజయవాడ (కృష్ణా)
ప్ర: ఇప్పటికి ముప్ఫై ఉద్యోగాలు మారాను. స్థిరత్వం లేదు. అభివృద్ధి లేదా- ఏం చేయమంటారు?
సమా: సమర్థులైన పండితులు విజయవాడలో వున్నారు. ఒకసారి జాతకాన్ని సమగ్రంగా పరిశీలింపజేసుకుని నివారణ యత్నాలను పాటించండి.
కె.కళావతి, అనంతపురం (ఆం.ప్ర.)
ప్ర: కుమారునితో మనస్పర్థలు
సమా: సంకష్టహర గణేశవ్రతం చేయండి. వీలయితే ప్రతి నెలా మొదటి మంగళవారం కుజ గౌరీవ్రతం చేయండి.
కె.లక్ష్మదేవి, బిహెచ్‌ఇఎల్, హైదరాబాద్
ప్ర: నా పొలం వేరేవారి స్వాధీనంలో ఉంది. నాకు రాగలదా?
సమా: కేవలం మీరు మాత్రమే కాదు. మరికొందరి ప్రమేయం కూడా కనబడుతోంది. 2017 కొంతవరకు మీకు ఫలం లభించగలదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ