Others

లాలాజలం తక్కువైతే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాలాజలం ఎక్కువైతే దానివల్ల కలిగే బాధలు, చికిత్స కిందటివారం చూసాం. ఇప్పుడు లాలాజలం తక్కువైతే దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో చూద్దాం. లాలాజలం తక్కువైతే నోరు ఎండిపోతుంది. కొందరిలో అయితే లాలాజలం అసలు ఉత్పత్తే కాదు. వీరి బ్రతుకులు చాలా భయంకరంగా వుంటాయి. లాలాజలం తక్కువగా వున్నా అసలు లేకపోయినా ఈ క్రింది సమస్యలు ఎదురవుతాయి.
- నోరు ఎండిపోతుంది.
- వీరి పళ్లకి పుచ్చు చాలా తేలికగా వచ్చేస్తుంది.
- నాలిక, గొంతు మండటం.
- మింగడంలో కష్టాలు.
- నోరు పెదాలు పగలడం.
లాలాజలం
తక్కువయ్యే సందర్భాలు
- కొన్ని జబ్బుల్లో డ్చ్జద్గిఉ డక్గ్జూఉ, డ్గ్ళ్జన్జిడనిడ- కొన్ని మందుల ప్రభాంవల్ల- రక్తపోటు మాత్రలు, ఒత్తిడి తగ్గించే మాత్రలు, ఎలర్జీ మాత్రలు, మూత్రం పెంచే మాత్రలు (నిశ్రీ్గఉన్ళిడ) కాన్సర్‌లో వాడే మాత్రలు.
- కాన్సర్ చికిత్సలో భాగంగా గెన్జి హఉ్గ-కూ తీసుకున్నవారిలో.
- నిడ, మధుమేహం, హఉ-నినిడ ళ.
- అధిక ఒత్తిడి లేక మాంద్యం వున్నవారిలో.
- లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులకి జబ్బు కలిగినా లేక చికిత్సలో భాగంగా వాటిని తీసేసినవారిలో.
చికిత్స
మందుల ప్రభావంవల్ల కలిగేవారిలో ఆ మందులు సవరించడం, తీవ్రత తగ్గించడం లాంటివి చెయ్యాలి.
తక్కువగా లాలాజలం ఉత్పత్తి అయ్యేవారిలో లాలాజలం ఉత్పత్తి పెంచే మందులు వాడాల్సి వుంటుంది. ఈ మందులు సురక్షితం , మంచి ఫలితాన్ని ఇస్తాయి. మరో విధానం ఏంటంటే ఈ గ్రంథులను ఎక్కువ లాలాజలం ఉత్పత్తి చేసేలా ఉద్దీపన చెయ్యాలి. దీని ఫలితాలు కూడా బాగానే వుంటాయి.
గ్రంథులు లేనివారిలో, మొత్తానికే పాడైపోయినవారిలో (రేడియో థెరపి) లాలాజలం ఎందుకు ఉత్పత్తి కావట్లేదన్న కారణం తెలీనివారిలో, వారికున్న సమస్యకి ఏ చికిత్స చెయ్యలేనివారిలో ఉపశాంతి కలిగించే చికిత్స చెయ్యవలసి ఉంటుంది. మన ఉమ్మినీరుకి ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో ద్రవం కాని డ-్గకూ కాని దొరుకుతాయి. వీటిని జీవితకాలం ఉపయోగించుకోవాల్సి వుంటుంది.
ఒక డెబ్భై ఏళ్ళ ఆవిడ, తన నోరు ఎండిపోతున్నదని నాలిక మండిపోతున్నదని రోజూ పిల్లలతో మొరపెట్టుకునేది. ముసలితనంలో వచ్చే చాదస్తంనించి పుట్టుకొస్తున్న ఫిర్యాదులని ఆమె కొడుకు, కోడలు అశ్రద్ధ చూపారు. ఒక రోజు ఆవిడ మా క్లీనిక్‌కి ఫోన్ చేసి క్లీనిక్ అడ్రస్ తీసుకొని, టాక్సీ మాట్లాడుకొని ఒకర్తేవచ్చి చూపించుకుంది. నేను పరీక్షించి ఉమ్మినీరు తక్కువుండడంవల్ల మీకీ మంటలు ఉన్నాయని చెప్పా. వెంటనే ఆవిడ తన కోడలికి ఫోన్ చేసి ‘‘నాది చాదస్తం అని నా మొరని పెడచెవిన పెట్టావు కదా, ఇపుడు డాక్టర్ చెప్తాడు నిజమేంటో, మాట్లాడండి డాక్టర్’’ అని నాకు ఫోన్ ఇచ్చింది. చెవరికి చెప్పేది ఏంటంటే, అందరు వృద్ధులు తమ సొంతంగా డాక్టర్ దగ్గరికి వెళ్లలేరు. కొన్నిసార్లు వాళ్లు నిజంగానే బాధపడుతున్నారేమో? వారి మొర ఆలకించండి, ఆలోచించండి..
కనీసం ఉపశమనం యివ్వగలిగినా వారిని ఆదుకున్నట్లే.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్
సెల్ నెం: 92995 59615

-డాక్టర్ రమేష్ శ్రీరంగం