Others

ఎగుడు దిగుడు పళ్లు ... అందానికి సంకెళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా నవ్వితే ఆ నవ్వు చూసి ఆనందం కలగాలి గాని అసహ్యం కలగకూడదు. అలాంటి ఆనందాన్ని పంచే అందమైన నవ్వుని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ అది ప్రతి ఒక్కరికి సొంతం కాదు. నవ్వాలంటేనే ఫీల్ అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. సరైన నవ్వు లేని కారణంగా ఇంటర్‌వ్యూలలో ఫెయిలయినవారు ఎంతో మంది నాకు తెలుసు. ‘‘మేం నవ్వితే మా పళ్లని చూసి పది మంది నవ్వుతారు, మాకు నవ్వాలంటేనే భయం వేస్తుంది డాక్టర్’’అని ఎంతోమంది కుర్రకారు ఆడ మగా తేడా లేకుండా నా దగ్గర విలవిలలాడిపోయారు. నేటి సమాజంలో చదువుతోపాటు అందం ఇంక అదృష్టం ఉన్న వారినే విజయం వరిస్తుంది.
అంద వికారమైన నవ్వుకి కారణాలు
నవ్వినపుడు మనముందు పై కింది ఆరు పళ్లు కనిపిస్తాయి. ఈ పనె్నండు పళ్లలో కానీ వాటికి సంబంధించిన చిగురులో కానీ లోపం ఉంటే అది అందవికారమైన నవ్వుకి కారణవౌతుంది.
పంటి లోపాలు
ముందు పై క్రింది ఆరు పళ్లలో ఏదైనా పన్ను లేకపోవడం
పళ్లు పసుపుపచ్చగా ఉండడం
విరిగిపోయిన పంటి ముక్కలు ఉండడం
ఏదైనా ఒకటి కాని రెండు పళ్ల రంగు నల్లగా మారి ఉండడం (పన్ను చనిపోయిందని దీని అర్థం)
పంటిలో నల్లని పుచ్చు ఉండడం
పంటి మధ్య సందులు
ఎగుడు దిగుడు పళ్లు
పండ్ల పాచి
అరిగిపోయిన పళ్లు
చిగురు లోపాలు
నవ్వినపుడు చిగురు 2.మీ.మీ కంటే ఎక్కువగా కనపడడం (దిశ్రీకూ డనిజఉ) చిగురు చనిపోయి పంటిలోని భాగం (్గ్జ్జ) కనిపించడంవలన పండ్లు చాలా పెద్దవిగా కనిపించడం.
పంటి సమస్యల చికిత్స
1) పళ్లు లేనివారు ఇంక విరిగిపోయిన పంటి ముక్కలు ఉన్నవారు ఆ ముక్కలకు వేరే ఏ చికిత్స చెయ్యలేని పక్షంలో వాటిని తీయించేసుకోవాల్సి ఉంటుంది. తీయించుకున్న తరువాత ఆ ఖాళీ స్థలంలో డెంటల్ ఇంప్లాంట్ (స్క్రూవంటి పరికరం) లేదా పంటి బ్రిడ్జ్ (ఖాళీ స్థలానికి ఇరువైపులా ఉన్న పళ్ల సహాయముతో కృత్రిమ పన్నుని ఖాళీ స్థలంలో పెడతారు) ద్వారా లేని పన్నుని పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇవి శాశ్వతంగా నోట్లో నాటబడిన పళ్లు. ఇవి 10నుంచి 15 సంవత్సరాలవరకు చెల్లుతాయి. ఈ రకమైన పళ్ల ఖరీదు ఎక్కువ. తక్కువ ఖరీదులో తీసిపెట్టుకునే పళ్లు పెట్టించుకోవచ్చు. ఇవి పొద్దున పెట్టుకొని రాత్రి తప్పనిసరిగా తీసివేయాల్సి ఉంటుంది.
2) పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారు చిన్నప్పటినించే అలా ఉన్నాయా లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇలా మారేయా అన్న విషయం గ్రహించాలి. పళ్ల పెరుగుదల దశలో వాడే నీటిలో ఫ్లోరైడ్ గనక ఎక్కువ ఉంటే పళ్లు పసుపు పచ్చగా తయారవుతాయి. దీనిని ఫ్లోరోసిస్ అంటారు. నల్గొండ ప్రాంతంవైపు మనం ఈ ఫ్లోరోసిస్ గమనించగలం. వంశపారంపర్యమైన పసుపుపచ్చ పళ్లుకూడా చిన్నప్పటి నించే పళ్లు అలా ఉండడానికి కారణం కావచ్చు. వీరిలో పళ్లు శుభ్రంచేస్తే సరిపోదు, బ్లీచింగ్ చేయించాల్సి ఉంటుంది. ఇది అందరిలో అనుకున్న మోతాదులో విజయాన్ని ఇవ్వదు. కొందరిలో మాత్రమే ఇస్తూంది. రెండోది బ్లీచింగ్‌వల్ల కలిగే తెల్లదనం తాత్కాలికం. 8-12 నెలలు మాత్రమే ఉంటుంది. కృత్రిమ పళ్లు తొడగడం లేక ల్యామినేట్స్ వీటికి శాశ్వత పరిష్కారం (10నుంచి 15 సంవత్సరాలు) గత కొన్ని నెలలుగా లేక సంవత్సరాలుగా పంటి రంగు పసుపుపచ్చగా మారిన వారిలో పొగాకు, తంబాకు, గుట్కా, కాఫీ, టీ దానికి కారణాలు కావచ్చు. వీరిలో పంటికి క్లీనింగ్ చేస్తే పంటి అసలు రంగు తిరిగి వస్తుంది. ఆ అసలు రంగు తెల్లగా లేని వారిలో బ్లీచింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి 8-12 నెలలకు ఓసారి చేయించుకోవాల్సి ఉంటుంది.
3) పంటి రంగు నల్లగా లేక గోధుమ రంగులోకి మారినవారిలో వారి ఇతి వృత్తాంతం తీసుకుంటే ఆ పన్నుకి కొన్ని నెలల లేక సంవత్సరాల క్రితం దెబ్బ తగిలిందని ఆ తర్వాత పన్ను రంగు మారిందని మనకి తెలుస్తుంది. సాధారణంగా రంగు మారిన పన్ను కొంచెం విరిగి ఉండడం మనం గమనించగలం. పన్ను రంగు మారిందంటే దాని అర్థం అది చనిపోయిందని. నిర్జీవమయిన పళ్లు రక్తం అందకపోవడం మూలాన నల్లగా లేక గోధుమ రంగుకి మారుతాయి. వీటికి రూట్ కెనాల్ చేసి కృత్రిమ పంటిని తొడగాల్సి ఉంటుంది.
4) పళ్లకి పుచ్చు ఉంటే అవి నల్లని రంధ్రాల కింద కనిపిస్తాయి. ఓ (తిగకూ) ద్వారా అవి ఎంత లోపలికి ఉన్నాయో నిర్ధారించుకొని వాటికి కోంపోసిట్ (్ళ్జ-్జడనిఉ) చేయాలా లేక రూట్ కెనాల్ చేసి కృత్రిమ పన్ను తొడగాలా అన్న నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
5) అరిగిపోయిన పళ్లు ఉన్నవారిలో వారి కొరికే విధానం తప్పుగా ఉండి వుంటుంది. సాధారణంగా మనం కొరికినపుడు మన ముందు నాలుగు పై మరియు క్రింది పళ్లమధ్య 2 మీ.మీ.ల స్థలం ఉండాలి. అది లేకుండా పై మరియు క్రింది పళ్లు తగిలే వారిలో ఈ అరుగుదల కనిపిస్తుంది. అరుగుదల తక్కువగా ఉన్నవారిలో కృత్రిమ పళ్లు తొడగాల్సి ఉంటుంది. ఎక్కువగా ఉన్నవారిలో రూట్ కెనాల్ చేసి కృత్రిమ పళ్లు తొడగాల్సి ఉంటుంది.
చిన్న వయసులోనే (21 సంవత్సరాల ముందు) గనక మనం ఇది పసిగట్ట గలిగితే వీరికి వైర్లచికిత్స (్జ్గ్హజ ఱ్గ్ళఉడ) చేసి పై, క్రింది ముందు పళ్లు తాకకుండా ఉండేలా చికిత్స చెయ్యచ్చు. ఈ చికిత్స 1నుంచి 1 1/2 సంవత్సరాల సమయం పడుతుంది. పెద్దవారిలో కూడా ఈ వైర్ల చికిత్సచెయ్యచ్చు కాకపోతే అప్పటికే పళ్లు అరిగిపోయి ఉంటాయి కాబట్టి వైర్లతోపాటు పంటి చికిత్సకూడా చెయ్యాల్సి ఉంటుంది.
మిగతా పంటి, చిగురు సమస్యల గురించి వచ్చేవారం చర్చిద్దాం.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్
సెల్ నెం: 92995 59615

-డాక్టర్ రమేష్ శ్రీరంగం