Others

‘లోపలి అలల’కు ఎదురీదాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరి అంతరంగంలో చాలా అలలుంటాయి. సందేహాల సముద్రంలో ఎనె్నన్నో కెరటాలు ఉవ్వెత్తున లేస్తుంటాయి. ఎవరికివారు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు కూడా తలెత్తుతుంటాయి. అందుకే ఎవరైనా ముందుగా తమ మనసు చెప్పే మాటలను ఆలకించాలి. ఆ తర్వాత మనసులో చెలరేగే ప్రశ్నల అలలను అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మనోవిశే్లషణ చేసుకోవాలి.
* బాధ్యతలు పెంచుకోండి..
మీకు మీపై అనుమానం వచ్చినపుడు పదిమందికి సమాధానం చెప్పవలసిన బాధ్యతలున్న పనిలో చేరండి. పని త్వరగా, సంతృప్తికరంగా పూర్తి చేయండి. ఆ అనుభవం చాలు మనల్ని మనం తీర్చిదిద్దుకోడానికి. ఉదాహరణకు ఒక సేల్స్‌మెన్ అసమర్థుడని, నోట మాట రాదని, పిరికివాడని అందరూ నవ్వేవారు. ఇతరులు నవ్వుతున్నకొద్దీ మరింత పట్టుదలతో కృషి చేసి, ఆ సేల్స్‌మెన్ మంచి జీతంతో ఎదిగాడు.
* అపజయాలకు ఇతరులు కారణమా?
మన ఓటమికి ఇతరులు కారణమని నిందించే అలవాటు మంచిది కాదు. ఇతరులు అడ్డం పడకుండా ఉంటే ఈపాటికి ఎంతో గొప్పవాడిని కావలసింది అని బాధపడడం సరికాదు. ఈ ప్రపంచంలో నేను శక్తివంతమైనవాడిని అనుకోవలసిన మీరు- ఒకరివల్ల దెబ్బతిన్నానని అనుకోవడం మంచిదికాదు. లోపాలను సవరించుకుంటూ ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ కాగలరు.
* కోపాన్ని నిగ్రహించుకోలేరా?
కోపం నిప్పులాంటిది. అది రగులుకున్నవారినే దహించి వేస్తుంది. ఎన్నో అవకాశాలను నాశనం చేస్తుంది. దాన్ని నిగ్రహించుకుంటే మంచి ఫలితాలు ఖాయం.
* స్వతంత్రంగా బతకాలి
ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి. ఒకరిమీద ఆధారపడి బతకడంలో ఉన్న లోపాలను స్పష్టంగా అర్థం చేసుకోండి. నిరంతర కృషి భావ దారిద్య్రాన్ని పారతోలుతుంది.
ఇలాంటి అలల వంటి ప్రశ్నలు ఉత్పన్నమైనపుడు నిజాయితీగా మీకు మీరు సమాధానాలు చెప్పుకోండి. అపార్థాలను, అపోహలను దూరంగా తరిమేయండి. ఎవరికివారే ఓ ప్రేరణాశక్తిగా మారాల్సిన అవసరం వుంది.

-పి.వి.రమణకుమార్