మెయిన్ ఫీచర్

ఆటిజమ్ చిన్నారులకు అండ... కాస్మో అడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వివేకం కలిగినవారు జరిగిన నష్టం గురించి దిగులుపడరు. నష్టాన్ని ఎలా భర్తీచేయాలా అని మాత్రమే ఆలోచిస్తారు’’- షేక్‌స్పియర్
ఆటిజమ్‌కు గురైన తన కుమారుడితో తాను పడుతున్న ఇబ్బందులకు ఆమె నిరాశ, నిస్పృహల కు గురికాలేదు. తనలాగే ఆటిజమ్‌తో బాధపడుతు న్న పిల్లల తల్లులందరినీ ఒక వేదికమీదకు తీసుకువచ్చి, ఆటిజమ్‌కు గురైన పిల్లలందరికీ సమాజం లో ఒక గుర్తింపు తీసుకురావడానికి ఆమె కృషిచేస్తున్నారు. ఆటిజమ్‌కు గురైనవారు సహితం తమ కాళ్ళపై తాము నిలబడగలరని (ఆర్థికంగా) నిరూపించిన కాస్మో అడ్డా డాట్ నిర్వాహకురాలే స్నిగ్థకేంకర్. స్నిగ్థ తన స్నేహితురాలు నీతతో కలిసి విజయవంతంగా కాస్మో అడ్డా డాట్ కామ్‌ను నిర్వహిస్తున్నారు.
పిల్లల మానసిక వికాసానికి జ్ఞానేంద్రియాలు తోడ్పడతాయి. సాధారణంగా జ్ఞానేంద్రియాలలో ఏదైనా లోపం ఉన్నప్పుడు వారిలో మానసిక ఎదుగుదల మందగిస్తుంది. అయితే, కొందరు పిల్లల్లో జ్ఞానేంద్రియాలు సక్రమంగా ఉన్నప్పటికీ, వారిలో మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది. అందుకు గల కారణాలను నేటివరకు శాస్ర్తియంగా ఇదమిత్థంగా ధృవీకరించలేదు. ఈ విధంగా ఉన్న పిల్లలను ‘ఆటిజమ్’ ఉన్న వారిగా వైద్య పరిభాషలో చెబుతారు. ఆటిజమ్ అంటే మానసిక ఎదుగుదలలో లోపం మాత్రమే. వారి శారీరక ఎదుగుదల మామూలుగానే ఉంటుంది. అయితే, వీరు సాధారణంగా నలుగురితో కలవరు. ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, పెద్దగా కేకలు పెట్టడం చేస్తుంటారు. ఇటువంటివారు అటు కుటుంబానికి ఇటు సమాజానికి భారం కాకుండా చూడాలన్న సత్ సంకల్పం నుంచి ఆవిర్భవించిందే కాస్మో అడ్డా డాట్ కామ్.
ఆటిజమ్ కలిగిన వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని స్నిగ్థ చెబుతున్నారు. అసిస్టెట్ లివింగ్ ఫర్ ఆస్టిక్ అడల్ట్స్ సంస్థ డైరెక్టర్ రుబీసింగ్‌కు కూడా 23 సంవత్సరాల వయసు కలిగిన ఆటిజమ్ అబ్బాయి ఉన్నారు. స్నిగ్థకు కూడా 18 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి ఉన్నాడు. ఒక సందర్భంలో వారిద్దరూ కలుసుకొన్నప్పుడు తమ పిల్లల గురించి మాట్లడుకున్నారు. ఈ క్రమంలో ఆటిజమ్ కలిగినవారిపట్ల సమాజం జాలి చూపించడం కన్నా, వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా సహాయం చేసేలా ప్రజలను చైతన్యపరచాలని వారు నిర్ణయించారు.
రుబీసింగ్ సహాయంతో స్నిగ్థ, నీతాలు కాస్మో అడ్డా డాట్ కామ్‌ను ఏర్పాటుచేసి గత 12 సంవత్సరాలుగా దేశంలోని వివిధ ప్రాంతాలో ఈవెంట్లను నిర్వహిస్తున్నారు.
ఆటిజమ్ పిల్లలు, వారి తల్లులు ర్యాంప్ మీద ఏ విధంగా నడవాలి, ఎటువంటి హావభావాలు వ్యక్తం చేయాలి అనే అంశంపై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదప శిక్షణ ఇస్తున్నారు. కాస్మో అడ్డా డాట్ కామ్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూండటంతో పలువురు వీరికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవెంట్‌ను నిర్వహిస్తారు. ఈవెంట్‌లో వివిధ రకాల ఆటలు, జోక్స్, సంగీతం, ఫ్యాషన్ షోలను ఏర్పాటుచేస్తారు. ఆటిజమ్ పిల్లలు సమాజంలో గౌరవంగా జీవించేలా పరిస్థితులు కల్పించడానికి సిగ్థ, నీతాలు చేస్తూన్న కృషి అభినందనీయం.

.

- పి.హైమావతి