మెయిన్ ఫీచర్

సేవాభావమే ఆకాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదో తరగతి పాసైతే చాలు యూత్‌గా భావించుకునే నేటీ యువతరం సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోతుంటే సొంత గడ్డపై మమకారం వీరిద్దరిని సేవా పధం వైపు నడిపించింది. సగటు అమ్మాయిలుగా ఆలోచించకుండా భిన్నమైన ఆలోచనలతో మన్ననలు అందుకుంటున్నారు. ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్నిన పిలుపును అందుకుని విద్యుత్ పొదుపునకు శ్రీకారం చుట్టగా...మరొకరు సొంతూరిపై మమకారంతో లగ్జరీ సిటీ జీవితాన్ని వదులుకుని స్వగ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై శ్రీమంతురాలిగా సేవచేస్తోంది. వీరిద్దరూ దేశ రాజధాని ఢిల్లీతో అనుబంధం ఉన్నవారే.. వివరాల్లోకి వెళితే...

ఒకరు సొంతూరికి... మరొకరు జన్నభూమికి సేవ
ఇద్దరిదీ పర్యావరణ హితమే

ప్రజల అవసరాలను గుర్తించి నమ్మకంతో పనిచేస్తే తన పదవీకాలంలో గ్రామ రూపురేఖలే మార్చగలననే విశ్వాసాన్ని వసుంధర వ్యక్తం చేస్తోంది. సైకాలిజీలో గ్రాడ్యుయేట్ అయిన వసుంధర గ్రామస్తులతో ఉండే అనుబంధాన్ని గుర్తుచేసుకుంటే వారికి ఎంత చేసిన తక్కువే అను అంటుంది. ఆమె తండ్రి ఆ గ్రామంలోనే ఉంటాడు. సెలవులకు ఊరు వెళ్లే ఆమె కొన్ని నెలల పాటు ఆ గ్రామస్తులతో గడిపేది. ఆ అనుబంధమే ఆమెను సర్పంచ్‌ను చేసింది.

23ఏళ్ల వసుంధర చౌదరి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి. ఎవరైనా ఈ వయసులో స్టూడెంట్ యూనియన్ నాయకురాలుగా గెలవాలని ఆశపడతారు. కాని వసుంధర తన సొంతురుకు సర్పంచ్‌గా ఎంపికవ్వటానికి ఇష్టపడింది. గత ఏడాది రాజస్థాన్‌లోని హనుమాంగర్హ జిల్లా లిలావలి గ్రామానికి సర్పంచ్‌గా ఎంపికైంది. దేశంలోనే తొలి యువ సర్పంచ్‌గా తన పేరును నమోదు చేసుకుంది. సైకాలిజీలో గ్రాడ్యుయేట్ అయిన వసుంధర గ్రామస్తులతో ఉండే అనుబంధాన్ని గుర్తుచేసుకుంటే వారికి ఎంత చేసిన తక్కువే అను అంటుంది. ఆమె తండ్రి ఆ గ్రామంలోనే ఉంటాడు. సెలవులకు ఊరు వెళ్లే ఆమె కొన్ని నెలల పాటు ఆ గ్రామస్తులతో గడిపేది. ఆ అనుబంధమే ఆమెను సర్పంచ్‌ను చేసింది. ముఖ్యంగా గ్రామస్తులు ఎలాంటి చదువు లేకుండా అనాగరికంగా, అసౌకర్యాలతో జీవిస్తున్నవారికి ఏదైనా చేయాలని భావించి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచింది. చదువును, కెరీర్‌ను, గ్రామ బాధ్యతలను
సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతుంది. సర్పంచ్‌గా ఎంపికైన వెంటనే గ్రామంలో టాయిలెట్స్‌కు శ్రీకారం చుట్టింది. విద్య ద్వారా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు స్కూల్ గదుల నిర్మాణం చేపట్టి ఎక్కువ మంది పిల్లలు స్కూలుకు వచ్చే ఏర్పాట్లు చేసింది. గ్రామం చుట్టూ మూడు వేల మొక్కలు నాటించింది. మరో మూడేళ్లలో 15వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మంచినీటికి ఇబ్బందులు పడకుండా వాటర్ స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటుచేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం సోలార్ ప్యానల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు పేద గ్రామస్తుల కోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ సాయంతో పరిశ్రమల శిక్షణా కేంద్రా న్ని కూడా నెలకొల్పింది. పేద గ్రామీణ మహిళలకు వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇప్పిస్తోంది. రాబోయే కాలంలో రైతులలో చైతన్యం తీసుకువచ్చేందుకు భూసార పరీక్షలు చేయించేందుకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల పంట నష్టాల నుంచి రైతులు కొంతమేరకు బయటపడగలరని ఆమె చెబుతోంది. ప్రజల అవసరాలను గుర్తించి నమ్మకంతో పనిచేస్తే తన పదవీకాలంలో గ్రామ రూపురేఖలే మార్చగలననే విశ్వాసాన్ని వసుంధర వ్యక్తం చేస్తోంది.