ఐడియా

గోడలూ - టాపూ లేని హోటలు గది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో చిత్రమయిన ఆకాశ హోటలు. స్విట్జర్లాండులో ఆల్ఫ్స్ పర్వత శ్రేణి మధ్యనున్న గ్రావుబుండేన్ (దీనికి రకరకాల ఉచ్ఛారణలున్నాయి, ఆ దేశాల్ని బట్టి) కొండ ఎత్తు 6463 అడుగులు (ఎంత నిఖారుగా కొలిచారో!). దానిమీద నెల్‌స్టర్న్ హోటలు గ్రూపువారు ‘జీరో స్టార్ హోటల్’ పేరిట ఒక ఆరుబయటి హోటల్ని నిర్మించారు.
ఈ హోటల్‌కి గోడలు లేవు అంటే కిటికీలు కూడా వుండవు కదా? టాపూ లేదు. పైగా బాత్‌రూమ్ కూడా వుండదు. అది కావాలంటే ఓ పది నిమిషాల దూరంలో వుంటుంది. లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ పోవాలి. లేదా ఆ ‘గది’ చుట్టూరా అన్నీ చక్కని చిక్కని మైదానాలే! అందాకా వాడుకోవచ్చును.
ఆల్ఫ్స్ పర్వత శోభనాస్వాదిస్తూ యిక్కడ పడుక్కోవాలీ అంటే ఒక రాత్రికి 362 డాలర్లు మాత్రం చెల్లించాలి. ఇటువంటి చిత్ర విచిత్ర డిజైన్ల మందిరాల్ని రూపొందించే రూపశిల్పులు ఫ్రాంక్, ప్యాట్రిక్‌రిక్లిన్ జంట- ఓ ‘ఫెస్టివల్’ కోసం తయారుచేశారు రుూ నమూనాని గానీ యిప్పుడది హోటల్‌గా మార్చారు.
నక్షత్రాల క్రింద, పర్వత సానువుల పచ్చిక మెత్తల వొడిలో, అతి మెత్తని అందాల పచ్చిక బయళ్లమధ్య అధునాతన మంచం- మెత్తని పరుపూ వగైరా ఓ మండపం మీద వుంటాయి. వేడిమి ఎంతుంటుంది? అంటారా? 10 నుంచి 15 డిగ్రీలలోపే వుంటుంది. రాత్రి (కారులో చేరుకోవచ్చు) హోటల్ చేరంగానే, ఓ డ్రింకు యిస్తారు. మర్నాడు మార్నింగ్ దాకా ‘దిక్కుండదు’. నో బేరర్.. నో ‘కాలింగ్ బెల్’. ప్రొద్దునే్న ఓ బ్రేక్‌ఫాస్ట్ ప్లేటుతో సర్వర్ దర్శనం యిస్తాడు. అంతా అప్పటికి 8.30 గంటలవుతుంది. అందాకా సూర్యుడు రాడే మరి! అదీ సంగతి. దీనికి ఎగబడి బుకింగ్‌లు చేసేసుకుంటున్నారు టూరిస్టులు.
‘‘మెకములు, పికములు వగైరా రావా?’’ అంటే ‘‘అంతెత్తుకి ఎందుకొస్తాయి? వాటికేం పని లేదా?’’ అన్నాడు బట్లర్!