భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహ్మధ్ షకీల్ వాజెద్, కర్నూలు (ఆం.ప్ర.)
ప్ర: దేవుడు ఒక్కడే కదా! మరి మీరు ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థించమంటారేమిటి?
సమా:అనంత విశ్వశక్తిని శాసించేది ఒక్కటే. అయితే, దాని ప్రతిబింబ స్వరూపాలు వేరు వేరు. భూమి అంతా ఒక్కటే అయినా అన్ని నేలలూ ఒక్కటిగా ఉన్నాయా? ప్రకృతి అంతా ఒక్కటే అయినా చెట్లు, గుట్టలూ- సముద్రాలూ- మేఘాలూ- ఆకాశమూ వేరు వేరు కాదా? భిన్నత్వంలోనే ఏకత్వం ఏకత్వంలోనే భిన్నత్వం దేవతా స్వరూపం. ప్రభుత్వమంతా ఒక్కటే అయినా, పోలీస్ కమిషనర్- మున్సిపల్ కమిషనర్ ఒక్కటవుతారా? అలాగే మానవుని అవసరాలు వేరు వేరు కనుక- ఆయా అవసరాలకు ప్రతిరూపాలైన దేవతాశక్తిని ఆరాధించాలి. అప్పుడే ఆ కోరిక ఆ అవసరం తీరుతుంది.
షేక్ సిరాజుద్దీన్- తెనాలి (గుంటూరు)
ప్ర:నాకు స్వగృహ యోగం వుందా?
సమా:తప్పకుండా వుంది. ఇదివరకే ఒక యోగం కలిసి ఆటంకాల కారణంగా తప్పి ఉండాలి. మున్ముందు కూడా వ్యక్తులవలన ఆటంకాలు కలిగి స్వగృహం ఆలస్యంగా సిద్ధిస్తుంది. ఆటంకాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
కమ్మల శ్రీనివాస్, సికిందరాబాద్
ప్ర:అనారోగ్యం- ఆర్థిక బాధలు- ఉద్యోగంలో పని ఒత్తిడి- ఏకాగ్రత కోసం ఏం చేయాలి- పరిష్కారం చెప్పండి.
సమా:ప్రతిరోజూ శ్రద్ధతో భగవద్గీతా పారాయణం తాత్పర్యంతో చదివి- ఒక్కొక్క శ్లోకం అర్థాన్ని మననం చేసుకొని మీ జీవితానికి అన్వయించుకోండి. అన్నిటికీ పరిష్కారాలు దొరకటమే కాదు, మీరు కూడా మరొకరికి మంచి మార్గం చూపించగలిగే స్థాయికి చేరుకుంటారు.
ఎమ్.సామకీర్తన, పాలకొల్లు (ప.గో.)
ప్ర:మాంగల్య స్థానం జాతకంలో పాపగ్రహక్రాంతం- పరిహారం చెప్పండి- ఆందోళనగా ఉంది.
సమా:కేవలం పాపగ్రహక్రాంతం అయినందువలన దుష్ఫలితాలు ఉండవు. శుభాగ్రహ వీక్షణ మాంగల్య స్థానాధిపతి ఉచ్ఛస్థితి ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ఆందోళన పడవద్దు- ఎప్పుడో ఏదో ఊహించుకొని ఇప్పటి మనశ్శాంతిని పోగొట్టుకోకండి. అన్నిటికీ నివారణగా సౌభాగ్య లలితా యంత్ర రక్షాధారణ శుభాన్నిస్తుంది.

బి.సీతామహాలక్ష్మి, బాపట్ల (గుంటూరు)
ప్ర:కుడిప్రక్క భాగం పక్షవాతంవచ్చింది. పరిష్కారం చెప్పండి.
సమా:యోగ్యమైన ఔషధసేవ- దైవికంగా నారసింహ జపం గంటసేపు సాధన చేయండి. శుభం కలుగును.
దేవరపల్లి ఓబులేసు, దర్శి (ప్రకాశం)
ప్ర:మిమ్ములను దర్శించి వెళ్ళగానే మనశ్శాంతి లభించింది. మీరు చెప్పిన ప్రకారంగానే మా పెద్దబ్బాయి వివాహం జరిగింది. ప్రస్తుతం మా చిన్నబ్బాయి వివాహం గురించి చెప్పండి. అతని కూపన్ జతచేశాను.
సమా:మీ చిన్నబ్బాయి వివాహానికి ఇంకా చాలా ఆలస్యముంది. కొన్నాళ్ళు అతన్ని వేరే విషయాలమీద శ్రద్ధ చూపమనండి. ముఖ్యంగా సంపాదన విషయంలో.
దూసర్లపూడి ప్రభాకరరావు, పిఠాపురం (తూ.గో.)
ప్ర:రావలసిన ధనము- అబ్బాయి- అమ్మాయి పెళ్లిళ్ళు- వారి భవిష్యత్తు.
సమా:మీకు రావలసిన ధనము 2017 మధ్యభాగంలో వచ్చే అవకాశం వుంది. మిగతా విషయాలకు వారి జాతకాలు తెలియాలి.
పున్నా రామలింగేశ్వరరావు, విజయవాడ (కృష్ణా)
ప్ర:అసలు నేను ఈ జన్మలో ఆర్థికంగా ఉన్నత స్థితికి రాగలనా? వ్యాపారం కలిసి రావటంలేదు. ఏం చేమంటారు?
సమా:మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీరు ఎవరివల్లనో లేదా ఎవరి సలహాలవల్లనో- స్ర్తి మూలకంగానో నష్టపోవటం జరిగినట్లు కనిపిస్తున్నది. మీలో కొంత స్వంత నిర్ణయ శక్తి తక్కువగా వుంది. ఒక మంచి మిత్రుణ్ణి గాని, నమ్మకమైన భాగస్వామినిగాని సంపాదించుకోండి. అభివృద్ధికి రాగలరు.
శిరిగుప్ప కిరణ్‌కుమార్ శెట్టి, అనంతపురం (ఆం.ప్ర.)
ప్ర:వివాహం- మంచి రోజులు
సమా:2017 మధ్యభాగంలో వివాహ సిద్ధి- మంచి రోజులు అనే మాటకు స్పష్టత లేదు.
పి.దత్తాత్రేయసామి, నిడదవోలు (ప.గో.)
ప్ర:ఉద్యోగాభివృద్ధి- వివాహము?
సమా:2017లో కొన్ని శుభాలు జరిగే అవకాశం వుంది.

మువ్వల మల్లికార్జునరావు, కావలి, నెల్లూరు
ప్ర:వరుసగా ప్రతికూల పరిణామాలు- సమస్యలు- ఇల్లు మారమంటారా?
సమా:ఔను! మీరు నివశిస్తున్న ఇంట్లో వాయవ్య నైఋతి భాగాలలో దోషం కనబడుతోంది. ఈశాన్యం కూడా బలంగా లేదు. ఆగ్నేయ భాగంలోనూ దోషమే కనిపిస్తోంది. ఇల్లు మారటమే మంచిది. అయితే మరో ఇంటినైనా పరీక్షించి ఎన్నుకోండి!
బి.బంగారురాజు, గుంటూరు (ఆం.ప్ర.)
ప్ర:నాది లాడ్జి వ్యాపారం- లాడ్జి పేరు శ్రీ పాండురంగ లాడ్జి. వ్యాపారం బాగాలేదు. పేరు మార్చమంటారా?
సమా:ఔను! పేరు మార్చాలి. ‘మా’ అనే అక్షరం ముందు వచ్చే విధంగా బేసి సంఖ్యగల అక్షరాల పేరు పెట్టండి. ఉదా- ‘మధురా’ లాడ్జి.
కోట అనుపమ, కావలి, నెల్లూరు
ప్ర:వయసుకు తగ్గట్టు ఎదగటం లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా:ఎవరు- ఎవరికి- ఎవరిది? మీ ప్రశ్నలో స్పష్టత లేదు.
జి.వెంకటప్పయ్య, తార్నాక, హైదరాబాద్
ప్ర:మా గ్రామంలో దేవాలయానికి అమెరికానుండి నిధులు తెచ్చే ప్రయత్నం ఫలిస్తుందా?
సమా: దైవకార్యం పట్ల అనుమానాలు పనికిరాదు. చిత్తశుద్ధి- భక్తి శ్రద్ధలూ ముఖ్యం. అయితే ఆ దేవాలయ వాస్తు- దేవతా యంత్ర బలము కూడా ముఖ్యమే.
ఎస్.ఎస్.శర్మ, దేవరపల్లి (ప.గో)
ప్ర:నాది ఆశే్లషా నక్షత్రం- రెండవ పాదం- మానసిక ప్రశాంతత లేదు. అధిక వ్యయం- పరిష్కారం చెప్పండి.
సమా:ఆశే్లషా నక్షత్రం శాంతి నక్షత్రం- ముందుగా జన్మ సమయంలో తగు శాంతి చేశారా లేదా? తెలుసుకోండి. చేయకపోతే ప్రాయశ్చిత్త శాంతి విధానంతో చేయించుకోండి. పైకి ఆందోళన పడుతున్నా మీరు దుర్బల హృదయలేమి కాదు. నిశ్చింతగా ఉండండి. దైవికంగా లక్ష్మీ గణపతి మంత్రోపాసన చేయండి!
ఎస్.వాసుదేవరెడ్డి, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం
ప్ర:కుమారుని ఉద్యోగం- వివాహం- కుమారుడు చెప్పిన సంఖ్య
సమా:ఉద్యోగం విషయంలో మంచి అభివృద్ధి ఉంది. వివాహం విషయమే ఆలస్యం- ఆటంకాలు- జాగ్రత్త అవసరం.
ఫణిహారం కళాధర్, తెనాలి (గుంటూరు)
ప్ర:్భర్య- ఉద్యోగం- ఆస్తి- ఏమీ లేవు. చివరకు భవిష్యత్తు ఏమిటని భయం?
సమా:ఏ బాదరాబందీ లేకపోవటం కూడా ప్లస్ పాయింటే. ప్రజాజీవితంలోకి ప్రవేశించండి. సామాజికపరంగా ఒక మంచి లక్ష్యం ఏర్పరచుకోండి.

శే్వతసాయి, శ్రీకాకుళం, (ఆం.ప్ర.)
ప్ర:వివాహం జరిగింది- వైవాహిక జీవితం ఎలా వుంటుంది?
సమా:శుభప్రదమైన ఆలోచనలు చేయండి. శుభమే జరుగుతుంది.
తాటి హరనాధ్, దర్గామిట్ట, నెల్లూరు
ప్ర:స్వగృహ యోగం
సమా:2017లో ఫలిస్తుంది.
కె.రామలక్ష్మి, తణుకు (ప.గో.)
ప్ర:పెద్ద కుమార్తె- నూతన గృహం- ఏడాది గడిచింది. పూర్తికాలేదు. గృహప్రవేశం ఎలా చేయాలి?
సమా:పైకప్పు- గోడలు- గుమ్మం- కిటకీలు అయితే చాలు గృహప్రవేశం చేయవచ్చు!
దాసరి లోకేశ్- యాడికి- అనంతపురం
ప్ర:ఉద్యోగం
సమా:మీకు వ్యాపారమే యోగం-

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ