ఐడియా

నిమ్మరసంతో చర్మం కాంతివంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*లెమన్‌డైట్ పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారం రోజుల పాటు లెమన్‌డైట్ చేయటం వల్ల మీరు ఆశించే ప్రయోజనాన్ని పొందుతారు.
* నిమ్మరసాన్ని ఓ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయి శుభ్రపడుతుంది. చర్మం సరికొత్త కాంతిని సంతరించుకుంటుంది.
* అరగ్లాసు నీటిలో అరచెక్క నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి నాలుగు స్పూన్ల తేనె వేసి నాలుగు గ్లాసుల చల్లని నీటిలో కలిపి గంటకొకసారి గ్లాసు చొప్పున తాగితే ఎంతో మంచిది.
* నిమ్మరసం శరీరంలోని మాలిన్యాలు తొలగిస్తే, తేనె రోజువారీ పనులకు అవసరమైన శక్తిని ఇస్తుంది. అయితే లెమన్ డైట్‌ను పాటించాలనుకునేవారు ముందుగా వైద్యులు సలహా తీసుకోవటం ఎంతైనా మంచిది.