మెయిన్ ఫీచర్

అలనాటి నటి ఆత్మీయ ఆతిథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణకుమారి ఇష్టంగా వండే వంటల వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయని కుమార్తె దీపిక చెబుతోంది. అలాగే అందాల నటి పట్ల సహనటీ, నటులుకున్న అభిప్రాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

‘‘గొప్ప నటి, తల్లి, భార్య, కుటుంబం కోసం పాటుపడే యజమానురాలు, నమ్మకం కలిగించే నేస్తం, పర్యావరణ ప్రేమికురాలు, ఆ చేతులతో తయారుచేసిన మెత్తటి ఇడ్లీలు, బీట్‌రూట్ చట్నీ తింటుంటే స్వర్గమే కనిపిస్తోంది.. ఇనే్నళ్లూ ఇలాంటి పాత్రలలో ఒదిగిపోయిన ‘మా అమ్మ కృష్ణకుమారి’ అని అంటోంది ఆమె గారాలపట్టీ దీపికామైయా. గొంగోర పచ్చడి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన వంటకం. చింతచిగురు పప్పు ప్రతిరోజూ డైనింగ్ టేబుల్ మీద వుండాల్సిందే. నాన్న కోసం తప్పనిసరిగా మటన్ కీమా బాల్ కూర వండాల్సిందే. వీటన్నింటినీ రోజూ మా అందరికీ వడ్డిస్తుంటే.. ఆ చేతి వంటకు నోట్లో నీళ్లూరేవి అని దీపికామైయా చెబుతోంది.
1950 దశకం నుంచి దాదాపు ముప్పయేళ్లపాటు తెలుగువారి గుండెల్లో తన నటనతో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి అందాల నటి శ్రీమతి కృష్ణకుమారి గురించి ఆమె కుమార్తె రాసిన పుస్తకంలోని మధుర స్మృతులు కొన్ని మాత్రమే. దేవతగా, రాణిగా, ప్రియురాలిగా, ఇల్లాలిగా ఏ పాత్రవేసినా అందులో ఒదిగిపోయో కృష్ణకుమారి గురించి ఈనాటి యువతకు అంతగా తెలియకపోవచ్చు. నేటితరం నెంబరవన్ స్టార్ శ్రీమతి శ్రీదేవి మాటలలో..‘అపుడు నేను బాలనటిని. ఆమె సెట్‌లోకి వస్తుంటే అంతఃపురంలోని రాజకుమారి నడిచి వచ్చినట్లుగా ఉండేదని ఆ పుస్తకంలో పేర్కొన్నదంటే కృష్ణకుమారి గురించి అంతకు మించిన వర్ణన అవసరం లేదనుకుంటా. స్టార్‌డమ్ ఉండగానే వాటన్నింటినీ వదులుకుని సంసారజీవితంలోకి అడుగుపెట్టిన కృష్ణకుమారి వ్యక్తిగత విషయాలు, అరుదైన చిత్రాలు, ఆమె వాస్తవ జీవిత విశేషాలు, ఇంట్లో ప్రత్యేకంగా ఆమె కుటుంబ సభ్యుల కోసం తయారుచేసే వంటలు తదితర వివరాలతో కూడిన అక్షర సమాహారమే ఈ కాఫీ టేబుల్ బుక్. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన కృష్ణకుమారి కూచిపూడి నృత్యం నేర్చుకుంది. తన జీవనమార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ తండ్రి ఆమేకే అప్పగించటంతో 16ఏట చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఏడాదికి 14 సినిమాలకు సంతకం చేసేదంటే ప్రేక్షకుల్లో ఆమెకున్న ఆదరణ అర్థమవుతోంది. సెట్‌కు తల్లి లేదా సోదరుడితో వచ్చేది. అమ్మమ్మ కృష్ణుడి భక్తురాలు. అందుకే మనమరాలికి ఆ పేరు పెట్టుకుంది. ఆనాటి అగ్రనటులు ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, డాక్టర్ రాజకుమార్ తదితరులతో దాదాపు 150 తెలుగు సినిమాల్లోనూ, 30 తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన కృష్ణకుమారి బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుని గృహిణిగా స్థిరపడిపోయింది.
పెళ్లయిన తరువాత నేర్చుకున్నది వంటలే
మా అమ్మ పెళ్లయిన తరువాత నేర్చుకున్నది వంటలు మాత్రమే. ఆమె గొప్ప నటి అని కూడా నాకు చాలా రోజుల వరకు తెలియదు. వంటలు నేర్చుకోమని మా నాన్న ప్రోత్సహించేవారు. దీంతో వంటలకు సంబంధించిన తరగతులకు వెళ్లి రకరకాల వంటలు నేర్చుకుందని పుస్తకంలో కుమార్తె దీపిక వెల్లడిస్తోంది. ప్రతిరోజూ కృష్ణకుమారే కుటుంబ సభ్యులకు వంట చేసి పెట్టడం అలవాటుగా చేసుకుంది. ఇంటినిండా వచ్చేపోయే బంధువులు, స్నేహితులతో కళకళలాడుతుండేది. వారందరికీ ఓపిగ్గా వంట చేసి ఆత్మీయ ఆతిథ్యం అందిస్తోంది. కృష్ణకుమారి చేసిన చేపల కూర అంటే సహనటి బి.సరోజాదేవికి ఎంతో ఇష్టం. ఈ పుస్తకంలో ఎక్కువగా కృష్ణకుమారి గురించి ఎవరికీ తెలియని జీవిత విశేషాలతో పాటు అరుదైన ఆమె ఫొటోలు ఉన్నాయి. అలాగే గార్డెనింగ్ అంటే ఆమేకు మక్కువ. ఈ తోట పనికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఎక్కువ భాగం కృష్ణకుమారి ఇష్టంగా వండే వంటల వివరాలు ఉన్నాయని కుమార్తె దీపిక చెబుతోంది. ఆమె పట్ల సహనటీ, నటులుకు ఉన్న అభిప్రాయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ పుస్తకం గురించి తెలుసుకున్న అభిమానులు ఆమె సినిమాలనే కాదు ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించే వంటలను కూడా ఇష్టంగా చేయవచ్చు.