ఐడియా

ప్రతి ఇంట్లో ప్రధాన శత్రువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆరుగంటలకు దీపాలు పెడదాం.. దోమలతోయుద్ధం చేద్దాం’’ అంటూ టీవీల్లో ఊకదంపుడుగా వచ్చే దోమల నివారణ మందుల ప్రకటనలు చూస్తుంటే చిన్న దోమ కోసం ఈ దీపాలేమిటి..యుద్దాలేమిటి అని ఆశ్చర్యంమేస్తోంది కదా!. దోమ చిన్నదే. కాని అది కుడితే వచ్చే రోగాలే భయంకరంగా నేడు విజృంభిస్తున్నాయి. మహారాష్టల్రో రోజుకు 8,425 డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయంటే ఈ దోమల సంత తెచ్చే తంటా అంతా ఇంతా కాదు. ఈ ముప్పు జులై నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఎన్నిరకాల మందులు వాడుతున్నా ఇంట్లో దోమలు తగ్గటం లేదని నేడు సగటు మహిళ బాధ. వర్షకాలం దోమల సీజన్. సాయంత్రం ఆరైందంటే ముప్పేటా ముసురుకుంటాయి. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులను మోసుకొచ్చే ఈ దోమల నివారణకు వాడే మందులు వాటి నివారణకేమోగానీ మనకెంతో చేటుతెస్తున్నాయని నిపుణుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి బారినపడి ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. రాత్రివేళల్లో చిన్నారులకు కమ్మటి నిద్ర కరువవుతుందని తల్లులు దోమలు పారద్రోలేందుకు అందుబాటులో ఉన్న ప్రయోగాలు చేసేస్తుంటారు. ముఖ్యం గా మస్కిటో కాయిల్స్ వెలిగిస్తే దోమలు నివారణమోగానీ దీనివల్ల పిల్లలకు, పెద్దలకు అనేక సమస్యలు తెచ్చిపెడుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఒక్క మస్కిటో కాయిల్ వంద సిగరెట్లతో సమానమట. అంతేకాదు వీటి పొగ పీల్చటం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు అవుతాయి. అలాగే ఎలక్ట్రిక్ ఇన్‌సెక్ట్ కిల్లర్స్ వెదజల్లే కెమికల్స్ కూడా పిల్లల్లో శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయని వెల్లడైంది. అంతగా వీలుకాని పరిస్థితులు ఉత్పన్నమైతే తప్పా ఎలక్ట్రిక్ ఇన్‌సెక్ట్ కిల్లర్స్ వాడొద్దని, ఒకవేళ వాడి తే వాటని ఏర్పాటుచేసిన గదిలో కాకుండా పిల్లలను వేరే గదిలో పడుకోబెట్టాలని వైద్యు లు సూచిస్తున్నారు. దీనికన్నా మస్కిటో రాకెట్స్ వాడితే ఎంతోమంచిది అని చెబుతున్నారు. వీటన్నింటికంటే దొమతెరలు ఉపయోగిస్తే పిల్లలు కమ్మగా నిద్రపోతారు. ఇపుడు సులువుగా వాష్‌చేసుకునేలా అందంగా దోమతెరలు వస్తున్నాయి. దోమలు లేని కాలంలో వీటిని జాగ్రత్తగా మడిచి భద్రంచేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్‌లో చక్కగా అల్లిన దోమతెర వల్ల దోమలేకాదు చిన్నచిన్న కీటకాలు సైతం మీ చిన్నారుల దరిచేరవు. కాబట్టి టీవీ ప్రకటనలు చూసి తాత్కాలిక మార్గాలను అనే్వషించకుండా దోమతెరలే దోమలకు అడ్డుకట్ట వేసే అస్త్రంగా వాడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. డబ్బు ఆదా అవుతుంది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03