మెయిన్ ఫీచర్

అలలపై ఆసనాలు.. ఆనందానికి హరివిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలలపై ఆసనాలు వేసేందుకే ఆధునిక యువత మొగ్గుచూపుతోంది. హవాలి ద్వీపవాసులు తెడ్డు బోర్డుపై యోగాసనాలు వేసే ప్రక్రియను కనిపెట్టారు. వాళ్లకు చుట్టూ నీళ్లే కాబట్టి ఆ నీళ్లపైనే యోగాను చేసే పద్ధతులను వారు ఆచరిస్తున్నారు. ఇపుడు ఈ యోగా ప్రక్రియ ఖండాంతరాలు దాటేసింది. నీటి అలలపై చల్లటి గాలుల మధ్య చేసే ఈ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతోంది. ఇపుడు పాశ్చత్య దేశాలలో ఈ యోగా ప్రక్రియను విరివిరిగా ఆచరిస్తున్నారు. శారీరక, మానసిక రుగ్మతల నుంచి బయటపడటానికి ఈ యోగాను ఆచరిస్తున్నారు. చెరువులు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నవారు తెడ్డు బోర్డుపై యోగా చేయటాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవేళ బీచ్‌లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే సాధారణ పొడవైన సర్ఫ్‌బోర్డుతో చేసుకోవచ్చు. అలలు చేసే సవ్వడి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ యోగా వల్ల మానసిక సమతుల్యత, శారీరక దృఢత్వం, అవయవాల పొందిక చక్కగా సమకూరుతుందని, ఇవన్నీ మనిషికి సమకూరితే సహజంగా అటువంటి వ్యక్తిలో విల్‌పవర్ పెరుగుతుందని యోగా నిపుణులు సూచిస్తున్నారు. శీర్షాసనం వల్ల మానసిక, శారీరక దృఢత్వం సమకూరుతుంది. ఒత్తిడిని జయించవచ్చు. కళ్లకు, తలకు, మెదడుకు రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. భుజాలు, చేతులు నొప్పులు, బాధలు తొలగిపోయి దృఢంగా ఉంటాయి. చీలమండలం, కాళ్లు, పాదాలు, కీళ్లు తదితర కీలక భాగాలన్నీ దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

బిటిలాసన :ఆవు భంగిమలో వేసే ఈ ఆసనం వల్ల బాడీ బ్యాలెన్స్ వస్తోంది. చేతులను, మోకాళ్లను బ్యాలెన్స్ చేస్తూ ఆసనం వేయటం వల్ల నరాలలో పటుత్వం వస్తోంది. వెన్నుముక కండరాలకు బలం చేకూరుతుంది. ఈ ఆసనం వయసుపై బడినవారికి ఎంతో ఉపకరిస్తోంది. మానసిక, శారీరక బలానికి వృద్ధులు ఈ ఆసనాన్ని వేస్తే మంచిది.

ధనురాసనం :శరీరాన్ని విల్లులా వంచే ఈ ఆసనం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గించుకోవాలంటే ఈ ఆసనం వేస్తే మంచిది. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ నివారించుకోవచ్చు. శరీరానికి రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఒత్తిడిని అధిగమించవచ్చు. కిడ్నీ, లివర్ చక్కగా పనిచేస్తాయి. మరింకెందుకు ఆలస్యం ఆలలపై ఆసనాలు వేసేద్దాం.

సలభాసనం: ఈ ఆసనం వల్ల ఆత్మవిశ్వాసాం పెరుగుతుంది. అంతర్గత అవయవాలు ఉత్తేజితమై చక్కగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలో వివిధ అవయవాలలో ఆమ్లాల విడుదల బ్యాలెన్స్‌గా ఉంటుంది. కాళ్లు, చేతులు, భుజాలు, తొడలు, కండరాలు, వెన్నుముక కండరాలకు శక్తి చేకూరుతుంది. చక్కటి శారీరక సౌష్టవం సమకూరుతుంది. మానసిక గందరగోళం తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. డిఫ్రెషన్ నుంచి బయటపడటానికి ఈ ఆసనం ఉపకరిస్తోంది.