భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపల్లి వెంకట్రావు, నర్సారావుపేట (గుంటూరు)
ప్ర:ఇంట్లోనుంచి వెళ్లిపోయిన కొడుకు-
సమా:ఒక వివాదం కారణంగా కాని, సినిమా వ్యామోహం కారణంగా కాని వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ఆగ్నేయ దిశగా మరొకరితో కలిసి వెళ్లినాడు. చెన్నై వైపు ప్రయత్నించండి.
ఎన్.శివరామయ్య, నంద్యాల (ఆం.ప్ర.)
ప్ర:కూతురు విద్యా విఘ్నములకు తాముగా చేయవలసిన దైవకార్యాలు
సమా:ఆదిలాబాద్ (తెలంగాణ) జిల్లాలోగల బాసర సరస్వతీ క్షేత్రాన్ని దర్శించి ముడుపు కట్టండి. విశేష క్రియలకు వ్యక్తిగతంగా వీలయితే సంప్రదించండి.
వై.నాగేంద్రబాబు, ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం)
ప్ర:వివాహాలస్యానికి కారణం?
సమా:స్థిర నిశ్చయం- ఏకాభిప్రాయం లేకపోవటం తర్క వితర్కాలతో అవకాశాలను జారవిడుచుకున్నారు.
రావూరి గీతాంజలి, అద్దంకి, (ఆం.ప్ర.)
ప్ర:స్వగృహయోగం - ప్రభుత్వోద్యోగం
సమా:రెండూ ఆలస్యమే- కొలదికాలంలో ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం- బహుశా బోధనా రంగంలో దొరికే అవకాశం వుంది.
కె.్ధనలక్ష్మి, నరసరావుపేట (గుంటూరు)
ప్ర:వివాహ విషయం-
సమా:2017 మార్చి-ఏప్రిల్‌లో అవకాశం వుంది. అయితే కొన్ని ఆటంకాలు కూడా అధిగమించాల్సి ఉంటుంది.
బిట్రా వెంకటేశ్వరరావు, మంగళగిరి (గుంటూరు)
ప్ర:స్థిరాస్తి అమ్మకం - లాభమా? నష్టమా?
సమా:నష్టమేమీ లేదు. కాని మీరే అమ్మకం విషయంలో మున్ముందు కూడా స్థిర నిశ్చయానికి రాలేరు. పైగా పెద్దవారెవరో అభ్యంతరం చెపుతున్నారు. అందువలన అంత త్వరగా మీరు అమ్మరు!
తుమ్మపూడి కృష్ణమూర్తి, సింగరాయకొండ (ప్రకాశం)
ప్ర:నేను కర్నూలులో షాపు పెట్టాలనుకుంటున్నాను. ఎలా వుంటుంది?
సమా:బాగానే ఉంటుంది- మీరు పెట్టగలిగితే. అది మాత్రం సందేహమే.
ఎన్.పార్వతీదేవి, రాజమండ్రి (తూ.గో.)
ప్ర:స్వగృహయోగం- ఎప్పుడు?
సమా:2017 అక్టోబరు-నవంబర్‌లలో ఆ దిశలో ప్రయత్నలు ఫలిస్తాయి.
జి.గీతామహాలక్ష్మి, నాగోల్, హైదరాబాద్
ప్ర:మీరు సూచించిన ప్రకారం మామిడి తోటల లీజుకు తీసుకున్నాం. మంచి లాభాలు గడించాం. ప్రస్తుతం జామ తోటలు లీజుకు తీసుకోవాలనుకుంటున్నాం- (స్థలం నూజివీడు)- ఎలా వుంటుంది?
సమా:లీజు విషయంలో పోటీదారులు బలంగా వుండే అవకాశం వుంది. లీజు దొరికితే మీకు లాభించే అవకాశం వుంది.
వి.వి.రంగనాయకులు, నంద్యాల (కర్నూలు)
ప్ర:ఆర్థిక పరిస్థితి- ఆరోగ్య పరిస్థితి-
సమా:మీ జన్మ నక్షత్రం మూలా మొదటిపాదం కావటం వలన జన్మ సమయంలో బలమైన శాంతి కార్యక్రమం చేసినారా? లేదంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అనే సూక్తి ప్రకారం ఇప్పటికైనా ప్రాయశ్చిత్త శాంతి రూపంలో చేయించండి. ఆరోగ్య రీత్యా ప్రమాదాలనుండి జాగ్రత్తగా ఉండండి. ఏలిననాటి శని ప్రభావంవలన కూడా ఇబ్బందులు తప్పవు. ఈశ్వరాభిషేకం- గ్రహశాంతులకు స్థానికంగా సమర్థులైన పురోహితులను సంప్రదించండి!
బి.సతీశ్‌కుమార్, మచిలీపట్నం (కృష్ణా)
ప్ర:నాకు విపరీతమైన ‘నత్తి’ ఉంది. అందరిలో ఉండలేకపోతున్నాను. పితృద్వేషం కూడా ఉందంటున్నారు. నాకు పరిహారం చెప్పండి.
సమా:వాక్కును శక్తివంతం చేయగల మహాతల్లి కర్నాటకలోని మూకాంబికా మాత. ఆ తల్లిని దర్శించి ఆ క్షేత్రంలో పదకొండు రోజులు నిష్ఠతో ఉండండి. మామూలు ఔషధ సేవగా పొంగించిన పటిక ముక్కను ఒక చిన్న వస కొమ్మును పడుకునే ముందు నోటితో చప్పరిస్తూ పడుకోండి. మంచి గుణమిస్తుంది.
ఎమ్.వి.ఎల్.నారాయణ, విజయవాడ (కృష్ణా)
ప్ర:ఋణబాధలు - పరిష్కారం- కారణం?
సమా:మీ జాతకంలో ధనస్థానాధిపతి- లాభకారకుడు శతృస్థానంలోపడ్డాడు. అందువలన గురుబలం లేదా పైగా చంద్రుడు ద్వాదశంలో ఉన్నాడు. చతుర్థస్థానం కేతుగ్రస్తం- దశమ స్థానం రాహుగ్రస్తం- కారణంగా మీచే క్రమపద్ధతిలో పనులు జరగవు. పూర్వజన్మ కర్మ బలవత్తరంగా ఉంది. శ్రీసూక్త- పురుష సూక్త- మన్యుసూక్తములతో త్రిశూల పాశుపత రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామములతో శ్రీవేంటేశ్వర శనివార వ్రతం చేయండి. శుభం జరుగుతుంది. వీలయితే ప్రత్యేకంగా కలవండి.
ఎ.సుమలత, బరంపురం (ఒడిస్సా)
ప్ర:వివాహ ప్రశ్న
సమా:2017లో మధ్యభాగంలో పూర్తి అవకాశం ఉంది.
ఎన్.సి.ఎస్.రామానుజం, రాజమండ్రి, (తూ.గో.)
ప్ర:గతంలో నా ప్రశ్నకు మీరు చెప్పిన ప్రకారంగా అదే తేదీకి మా అబ్బాయికి ఉద్యోగం లభించింది. నూటికి నూరు పాళ్ళు మీ వాక్కు నిజమయినందుకు శతకోటి నమస్కారాలు. ప్రస్తుతం నా స్థాయి గురించి చెప్పండి.
సమా:సంతోషం. మీ అభివృద్ధికి మీరే తెలిసో తెలియకనో ఆటంకం ఏర్పరచుకుంటున్నారు. ఇక మీ పెదనాన్నగారి ఆస్థి మీకు వచ్చే సూచనలు లేవు. ఉన్నత స్థితికి రావాలంటే శ్రీవేంకటేశ్వరస్వామికి మీ యింట్లోనే హుండీ తెరవండి. ప్రతి శనివారం కొంత మొత్తం నిర్దిష్ట ప్రకారం హుండీలో వేసి ఏడాదికి ఒకసారి తిరుమలకు వెళ్ళి హుండీ సమర్పించండి. శుభం జరుగుతుంది.
పి.రామకృష్ణ, రాజమండి (తూ.గో.)
ప్ర:నేను బాంక్ ఆఫీసర్‌గా రిటైర్ కాబోతున్నాను. ఒక ఫాంహౌస్- ఒక తోట పెట్టాలనుకుంటున్నాను. మీ సలహా ఏమిటి?
సమా:మీ ఆదర్శం చాలా మంచిది. సమర్థత కూడా ఉందంటున్నారు. సంతోషం. అయితే మీ మనస్తత్వం కష్టాన్ని ఓర్చగలిగేది కాదు. సమర్థుడైన పర్యవేక్షకున్ని ఏర్పరచుకోండి.
టి.గిరిజారాణి, జగ్గయ్యపేట (కృష్ణా)
ప్ర:ప్రభుత్వోద్యోగ ప్రయత్నం ఫలించునా?
సమా:ప్రభుత్వంతో సంబంధం వుండే సంస్థలోనే మీకు ఉద్యోగం లభించగలదు.
కేతేపల్లి లక్ష్మీనారాయణ, కొత్తగూడెం (తెలంగాణ)
ప్ర:ఐరన్ షాపుల అనుభవం- ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఏం చేయమంటారు?
సమా:మీకు అనుభవం ఉన్న ఐరన్ వ్యాపారమే చేయండి. పెద్దగా పెట్టుబడి పెట్టే అవకాశం లేకపోతే- పాత ఇనుప సామానులు (స్క్రాప్) పాత పేపర్ల వ్యాపారం చేయండి.
టి.పద్మావతి, జగ్గయ్యపేట (కృష్ణా)
ప్ర:దీర్ఘకాలంగా కడుపులో మంట- ఒళ్ళు నొప్పులు, ఎన్నో వైద్యాలు చేయించాను, ఫలించలేదు. ఏం చేయమంటారు?
సమా:సహజంగా మీది వైద్య ప్రశ్న. అయితే ఒక చిట్కా వైద్యం- ఒక దైవ సేవ సూచిస్తాను. ప్రతిరోజూ సూర్యోదయత్పూర్యం- తులసీ పూజ చేసి ఒక దళం తీసుకోండి. రాత్రి తోడు ఉంచిన ఆవు పెరుగులో కాని మజ్జిగలో కాని ఆ తులసీదళం వేసుకొని తాగండి. గుణం కనిపిస్తుంది.
పి.రాజశేఖరరెడ్డి- అనంతపురం - ఆం.ప్ర.
ప్ర:నాకు ఏ వ్యాపారం యోగిస్తుంది?
సమా:‘హర్ ఏక్‌మాల్’ బండిలో వస్తువుల అమ్మకం.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ