ఐడియా

నివాసాల్లోనూ నిఘానేత్రం అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లా ట్‌లో ఒంటరిగా వున్న వృద్ధురాలు సీతారావమ్మపై అపరిచిత వ్యక్తి చేయి చేసుకుని ఆమె ఒంటిమీద వున్న నాలుగు కాసుల బంగారు గొలుసు, చేతులకు ఉన్న ఆరు గాజులను లాక్కు ని పరారయ్యాడు. సిసి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఉదాహరణ చూద్దాం భర్త, పిల్లలు బయటికి వెళ్లా క ఇంటి పనులు చేసుకుంటున్న సుభద్రను ఇద్ద రు వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిమీద వున్న నగలను, బీరువాలోని విలువైన వస్తువుల ను అపహరించారు. ఇంటి వద్ద నిఘా వ్యవస్థ లేకపోవడంతో ఆ కేసును ఛేదించడం పోలీసుల కు పెను సవాలుగా పరిణమించింది. దాదాపు ఐదు వారా ల తర్వాత నిందితులు పోలీసులకు చిక్కారు. గతంలో వాచ్‌మాన్‌గా పనిచేసి మానేసిన వ్యక్తి తన మేనల్లుడితో కలిసి ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
ఆఫీసులు, విద్యా సంస్థలు, రహదారి కూడళ్ళ వద్ద మాత్రమే కాకుండా నివాస ప్రాంతాలలో కూడా నిఘా నేత్రం అవసరమేనని ఈ ఉదాహరణలవల్ల మనకు తేటతెల్లమవుతోంది. ఇంటి భద్రతలో నిఘా వ్యవస్థను ఒక భాగంగా చేసుకోవాలి. ఇంటి వైశాల్యాన్ని బట్టి ఎన్ని సిసి కెమెరాలు అమర్చాలన్నది నిర్ణయించుకోవాలి. ప్రధాన ద్వారం వద్ద, హాల్‌లోను, బీరువా వద్ద వీటిని అమర్చినట్లయితే ఉపయుక్తంగా ఉంటుంది. విశాలమైన ఇల్లు కలిగి ఉండి, ఎక్కువ ద్వారాలు ఉన్నట్లయి తే, ఆయా ద్వారాలవద్ద కూడా నిఘా నేత్రాన్ని ఏర్పాటుచేయడం మంచిది.
ఇంట్లో చిన్నారులు, వృద్ధులు ఉన్న సందర్భాల్లోనూ, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పనిమనిషిమీద ఇంటి బాధ్యత ఉంచి బయటకు వెళ్లినపుడు, ఇంటికి తాళం పెట్టి విహార యాత్రలకు వెళ్లినపుడు నిఘా నేత్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. లక్షలు ఖర్చుచేసి ఇల్లు ఏర్పాటుచేసుకున్నపుడు నిఘా నేత్రం అమర్చడం కష్టమైన విషయమేమీ కాదని గ్రహించాలి. కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు సిసి ఫుటేజ్‌ను పరిశీలించడం అలవరచుకోవాలి. అనుమానాస్పదంగా తమ దృష్టికి వచ్చిన అంశంపై తగు విధంగా స్పం దించాలి. నిఘా నేత్ర సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఇంటి భద్రత విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు.

- జి.అరుణ