సబ్ ఫీచర్

అద్భుతాల ఆవిష్కరణకు వైకల్యం అడ్డుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు’ అన్నట్లు మన దేశానికి చెందిన నిపుణుల ప్రతిభను సొంతగడ్డపై ప్రసార మాధ్యమాలు గుర్తించకపోయినా డిస్కవరీ చానల్ మాత్రం తన బాధ్యతను నెరవేర్చింది. ‘మట్టిలో మాణిక్యం’ అయిన
ఓ యువకుడి నైపుణ్యాన్ని గుర్తించడమే కాదు, అతడి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ఆ చానల్
నిర్ణయించింది. కేరళలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన షాజీ థామస్ అనే యువకుడు రూపొందించిన చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇపుడు చర్చనీయాంశమైంది. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన థామస్‌కు చిన్నప్పటి నుంచి
ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయడం అంటే ఎంతో ఆసక్తి. ఏడో తరగతి వరకూ చదివిన థామస్ సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్‌ను రూపొందించడం నిజంగా సంచలనమే.

ఇడుక్కి జిల్లా (కేరళ) తోడుపుజాలో జన్మించిన షాజీ థామస్ పాఠశాలలో చదివే రోజుల్లోనే ఎలక్ట్రానిక్ పరికరాలతో ప్రయోగాలు చేసేవాడు. చిన్న చిన్న మోటార్లు, యంత్రాలతో కుస్తీ పడుతుండేవాడు. 2001లో మారియాతో ఆయనకు వివాహం జరిగింది. కుటుంబ పోషణ నిమిత్తం ఎలక్ట్రీషియన్‌గా పనిచేయమని థామస్‌పై భార్య ఒత్తిడి చేసేది. అయినప్పటికీ ఆయన తన ప్రయోగాలను మాత్రం వదలలేదు. చివరకు భార్య కూడా అతడి ప్రయోగాలకు అండగా నిలిచింది. తన వద్ద ఉన్న డబ్బును ఖర్చు చేసి ఎయిర్ క్రాఫ్ట్ బయటి భాగాన్ని తయారు చేశాడు. ఇంజన్‌ను కొనుగోలు చేయడానికి ఆర్థిక వనరులు లేకపోవడంతో, 1991లో ఎన్నికల ప్రచారానికి కేరళ వచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని కలిసి తన పరిస్థితిని థామస్ వివరించాడు. ఆర్థిక సహాయం చేస్తానని రాజీవ్ హామీ ఇచ్చినా, ఆయన ఆకస్మిక మరణంతో ఆ ఆశ నెరవేరలేదు. నిధులు సమకూరకపోయినా ఆయన నిరాశ చెందలేదు. బైక్ ఇంజన్‌ను వినియోగించి, రెండు సీట్లు ఉండే చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారుచేశాడు. మధురై సమీపంలోని ప్రైవేటు ఎయిర్‌పోర్టు నుంచి తన ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరి ఆకాశంలో చక్కర్లు కొట్టాడు. ఎయిర్‌పోర్టు నిర్వాహకులు థామస్ ప్రయోగాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
ఎయిర్‌క్రాఫ్ట్ నిర్మాణానికి 25 లక్షల రూపాయలు ఖర్చయింది. ఇందుకోసం తల్లిదండ్రులు ఇచ్చిన భూమిని థామస్ విక్రయించాడు. ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తే చిన్నపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తానని ఆయన అంటున్నాడు. భార్య, 13 ఏళ్ల కొడుకును పోషించుకోవాలన్న తపనతో మంచి ఉద్యోగం కోసం థామస్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. తన కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పిస్తే, తాను ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీపై దృష్టి సారిస్తానని థామస్ చెబుతున్నాడు. ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఆదుకుంటేనే తన కల సాకారం అవుతుందని అంటున్నాడు.

చిత్రం... ఎయిర్‌క్రాఫ్ట్ వద్ద భార్య, కుమారుడితో థామస్
-పి.్భర్గవరామ్