భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల శ్రీనివాసరావు, జగ్గయ్యపేట (ఆంధ్ర)
ప్ర:వైద్యునికి తెలియని శిరోబాధ- భరించలేకున్నాను- పరిష్కారం చెప్పండి.
సమా:తలనొప్పికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి. ఒకటి- మానసిక సమస్యలు, రెండు-అనువంశిక రుగ్మతలు, మూడు- శారీరక సమస్యలు. అదేపనిగా ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే అది తగ్గించుకోండి (్ధన సంబంధం కాని- బంధు సంబంధం కాని కనిపిస్తోంది). అనువంశికమైతే గతంలో మీ అమ్మా నాన్నలకు ఎవరికైనా ఉందేమో తెలుసుకోండి. శారీరకంగానైతే మలబద్ధకం లేకుండా జాగ్రత్త పడండి. గృహ వైద్యంగా బచ్చలి ఆకు నూరి కాని జటామాంసి (మందు వస్తువుల దుకాణంలో దొరుకుతుంది) నీటిలో నూరి రెండు కణతలకు నుదుటికి పట్టించి కట్టి పడుకోండి. కల్తీ లేని హారతి కర్పూరం పరిశుభ్రమైన గుడ్డలో వేసుకొని వాసన చూస్తూ ఉండండి. సద్గ్రంధ పఠనం ముఖ్యంగా భగవద్గీతా- రామాయణాదులు చదువుతూ వుండండి. సమస్య పరిష్కారమవుతుంది. కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి.
జి.రాధాకృష్ణారావు, కర్నూలు (ఆంధ్ర)
ప్ర:ఋణబాధ- జాతక పరిశీలన
సమా:మీరు ఋణ- ధన జాతకులు. ఋణమే మీకు ధనము. పరిష్కారానికి మంగళవారం ఋణవిమోచన అంగారక వ్రతం చేయండి.
ఎన్.శివశంకరరావు, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర:ఆరోగ్యం- వ్యాపారాభివృద్ధి- స్థిరాస్తి కొనుగోలు
సమా:ఆరోగ్యం విషయంలో పొత్తి కడుపు- లీవర్ గ్యాస్ట్రిక్ సమస్యలు సూచిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధికి ప్రతి బుధవారం పదకొండు వారాలు పణ్యహోమం చేయించండి. కుబేర యంత్రం ప్రతిష్ఠించుకోండి. స్థిరాస్తి కొనుగోలు 2017లో అనుకూలం.
వి.శివకుమారి, కాకినాడ (తూ.గో.)
ప్ర:జన్మతేదీ వివరాలు లేవు- నా రాశి ఏమిటి? ప్రస్తుత సమస్యలకు పరిష్కారమేమిటి?
సమా:జన్మ తేదీ తెలియనిదే జన్మ నక్షత్రం తెలపటం సాధ్యం కాదు. నామ నక్షత్ర ప్రకారం ఉత్తరాభాద్ర- మీనరాశి- సమస్యలను భావోద్వేగంతో కాకుండా వాస్తవిక దృష్టితో సావధానమైన మనస్సుతో ప్రయత్నించండి. దైవానుగ్రహం కోసం ప్రతి సోమవారం విఘ్నేశ్వరారాధన చేయించండి.
ఎన్.హరిణి, గుడివాడ (ఆంధ్ర)
ప్ర:ఉన్నత విద్యలకు అవకాశం ఉన్నదా?
సమా:తప్పకుండా ఉన్నది. అయితే కొన్ని విఘ్నాలు మాత్రం వస్తాయి. విదేశీ ప్రయాణం కూడా సిద్ధిస్తుంది.
కె.హెచ్.మల్లికార్జునరావు, గుంటూరు (ఆంధ్ర)
ప్ర:మధ్యవర్తి ద్వారా ఇచ్చిన డబ్బు రాగలదా?
సమా:మధ్యలో ఏదో స్థిరాస్తి వ్యవహారం కూడా కనిపిస్తోంది. అది పరిష్కారమైతే వస్తు రూపంలో మీ డబ్బులు రాగలదు, ఆలస్యంగా.
వోగిరెడ్డి వెంకటరెడ్డి, బలభద్రపురం (తూ.గో.)
ప్ర:అమ్మాయి వివాహం
సమా:2017లో ఏప్రిల్-మేలలో పూర్తి అవకాశం ఉంది.
పి.సుజాత, కావలి (నెల్లూరు)
ప్ర:మా అమ్మాయికి మా కోడలుతో సరిపడదు. దాని కారణంగా మమ్మల్ని మానసికంగా బాధిస్తోంది.
సమా:హోదా- ఆర్థిక సంబంధమైన విషయాలు స్పర్థకు, అసూయకు కారణంగా కనిపిస్తోంది. మీ మనమరాళ్లను చూడాలనుకుంటే మీరే ఒకసారి మీ కూతురి ఇంటికి వెళ్లి చూసి రండి. దైవసేవగా ప్రతి మంగళవారం శ్రీవేంకటేశ్వర స్వామికి దద్యోదనం, పులిహోర నివేదన చేసి పూజించండి. మొక్కు కోరికతో మొక్కండి.
షేక్ అల్లాబ, చిలకలూరిపేట (గుంటూరు)
ప్ర:ప్రపంచంలో ఎవర్ని నమ్మాలో అర్థం కావటంలేదు. పరిష్కారం చెప్పండి.
సమా:మొట్టమొదటగా మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఎవరో ఏదో చేయాలని చేస్తారని ఎదురుచూడకండి. ధర్మాన్ని ఆచరించండి. దైవాన్ని నమ్మండి.
జె.మల్లికార్జునరావు, మలకలపల్లి (విశాఖపట్నం)
ప్ర:ప్రభుత్వోద్యోగం
సమా:వయోపరిమితి దాటకుండా ఉంటే దూరదేశంలో దొరికే అవకాశం ఉంది.
గుఱ్ఱం రమేష్, కోరుట్ల (తెలంగాణ)
ప్ర:్భర్యా తిరస్కారం
సమా:స్వతంత్రంగా సంపాదించటం సాధిస్తే ఈ సమస్య రాదు. అత్తవారి యింటిపైన ఆధారపడటం మంచిది కాదు. స్వతంత్ర వ్యక్తిత్వం సాధించండి.

ఉమేశ్వరి - కొడంగల్ (తెలంగాణ)
ప్ర:ఏ రంగంలో స్థిరత్వం?
సమా:జీవితబీమా సంస్థల్లాంటి వాటిలో కాని వైద్య సంబంధమైన సంస్థల్లోకాని, వ్యవసాయ సంబంధమైన సంస్థల్లోకాని యోగం వుంది.
బి.హరీశ్‌కుమార్, పామర్రు, ఆంధ్ర
ప్ర:జీవితంలో స్థిరత్వానికి ఆటంకాలు
సమా:ప్రతి సోమవారం అటుకులూ- బెల్లం- నాలుగు సంఖ్య దక్షిణతో విఘ్నేశ్వరుని పూజించండి. నాలుగు పచ్చని గరికలు- తేనెలో ముంచి విఘ్నేశ్వరుని తలమీద ఉంచి నమస్కరించండి.
బి.సునీత, పెబ్బేర్ (తెలంగాణ)
ప్ర:రెండవ సంతానం ఎప్పుడు?
సమా:ఇద్దరి జాతకాలు చూడనిదే చెప్పటం సాధ్యం కాదు.
పి.మురళి, నెల్లూరు (ఆంధ్ర)
ప్ర:ఇంటి వాస్తు - బాడుగకు ఎవ్వరూ రావటం లేదు.
సమా:వాయవ్యంలో దోషం ఉంది. స్థానిక వాస్తు పండితులను సంప్రదించండి.
ఎన్.బి.కృష్ణ, ఆదర్శనగర్, హైదరాబాద్
ప్ర:నా ప్లాటు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది.
సమా:ఈ విషయంలో మూడవ వ్యక్తి ప్రమేయం కనపడుతోంది. అది పరిష్కారమైతే మీ పని పూర్తవుతుంది.
ఎమ్.వికాస్, సరస్వతీనగర్, హైదరాబాద్
ప్ర:నేను ఎంత ప్రయత్నించినా సి.ఏ పూర్తిచేయలేకపోతున్నాను. ఏం చేయమంటారు?
సమా:బాసరలో సరస్వతీ క్షేత్రాన్ని దర్శించి మూడు రోజులు నిద్ర జేసి నిష్ఠతో పూజ చేయించండి. ఫలితం సిద్ధిస్తుంది.
దేవరా జీవన్, జోధ్‌పూర్ (రాజస్థాన్ స్టేట్)
ప్ర:నా వ్యాపారానికి ‘జోధ్‌పూర్’ బాగుంటుందా లేక బెంగుళూరా? రెండింటిలో ఏది బెహత్తర్ (మంచిది)
సమా:‘జోధ్‌పూర్ హీ ఆప్‌కేలియే అచ్చాహై’ - జోధ్‌పూరే శ్రేష్ఠం- అక్కడే ప్రారంభించండి.
రెడ్డిచర్ల రఘునాధ్ - విజయవాడ (కృష్ణా)
ప్ర:నాకు స్వంత మిల్లు ప్రయత్నం ఫలిస్తుందా?
సమా:తప్పకుండా. 2017 మే, జూన్‌లలోఆ దిశలో ప్రయత్నాలు ఫలిస్తాయి.
పి.ఎస్.ఎస్.మనోజ్, ఎల్లారెడ్డిగూడ (హైదరాబాద్)
ప్ర:నా ఉద్యోగ ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుంది?
సమా:ప్రస్తుతం మీ జన్మ నక్షత్రంపైనా, నామ నక్షత్రంపైనా గురుబలం ఉంది. 2017 మే- జూన్‌లోగా శుభం జరుగుతుంది. అయితే జన్మదశా నక్షత్రాంశ (అష్టమాంశ) కారణంగా గట్టి ప్రయత్నాల ద్వారా ధనవ్యయంతో ఫలించే అవకాశం ఉంది.
పొన్నపూల రమాదేవి, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:అన్నా వదినల నూతన గృహ ప్రవేశం అక్టోబరు 20- అమ్మకు అనారోగ్యం- ఎలా ఉంటుంది చెప్పండి.
సమా:స్థూలంగా నక్షత్రం - వారము- ఆది బాగానే ఉన్నాయి. సమయం రాయలేదు కనుక దోషం చెప్పలేను. ఎట్లయినా ఉచ్ఛ చంద్రుడు కనుక మీ అమ్మగారికి ఏ ప్రమాదమూ ఉండదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ