సబ్ ఫీచర్

సాహసికి దక్కిన పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలలు 25 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. గాలి 60నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తోంది. ప్రశాంతంగా ఉండే సము ద్రం అల్లకల్లోలంతో ఘోషిస్తోంది. ఇలాంటి ప్రకృతి బీభత్సకర వాతావరణంలో తమ ప్రాణాలను పణం గా పెట్టి తోటివారి ప్రాణాలను కాపాడటానికి ఎవ్వరూ కూడా సాహసించారు. కాని విధి నిర్వహణే దైవంగా భావించే కెప్టెన్ రాధికామెనన్ మాత్రం తనకెందుకులే అని పై అధికారులకు మెస్సెజ్‌లు పెట్టి మిన్నకుండలేదు. ఈ సాహసి చూపిన చొరవ, తెగువ వల్ల గత ఏడాది జూన్‌లో ఏడుగురి ప్రాణాలు సముద్రంలో కలిసిపోకుండా సజీవంగా బయటపడగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు కనకదుర్గా అనే పడవలో ఎప్పటివలే చేపలవేటకు బయలుదేరారు. అకస్మాత్తుగా వాతావరణంలో సంభవించిన మార్పులు వారిని కల్లోల సముద్రంలోకి నెట్టేసింది. ఒడిస్సాకు సమీపానికి కొట్టుకుపోయారు. నడి సముద్రంలో చిక్కుకుని ప్రాణాలు కాపాడేవారి కోసం ఎదురుచూస్తున్న ఈ మత్స్యకారులను రాధికా మెనన్ ఆపద్బాంధవిగా ఆదుకుంది. అదే సమయంలో రాధికామెనన్ సంపూర్ణ స్వరాజ్ అనే చమురు ఉత్పత్తుల ట్యాంకర్‌కు కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ ట్యాంకర్ ఆ సమయంలో అక్కడ ఉండటంతో తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించటమేకాకుండా ఎంతో రిస్క్ తీసుకుని ఆ విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ చిన్న పడవలోని ఏడుగురు మత్స్యకారులను కాపాడింది. పై అధికారులు నుంచి ఆదేశాలను చదివిన రాధికా మెనన్ వెంటనే తన మెదడుకు పదునుపెట్టి తోటి అధికారులకు సూచనలు అందిస్తూనే స్వయంగా రంగంలోకి దిగి కల్లోల సముద్రంలో సాహసంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వారిని కాపాడింది. ఆమె చూపిన సాహసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ అందజేసే అవార్డుకు రాధికా మెనన్ పేరును నామినేట్ చేసింది.
2007 నుంచి ఇలాంటి సాహస అవార్డును అందజేస్తున్న ఈ సంస్థ తొలిసారిగా ఓ మహిళకు అందజేయటం విశేషమైతే అలాంటి అవార్డును దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే మనదేశ తొలి మహిళా నావికా కమెండో అయిన రాధికా మెనన్‌కు దక్కటం మరో విశేషం. ఇటీవలనే ఆమె ఈ అవార్డును స్వీకరించారు. అసాధారణమైన ఆమె శౌర్యం నేడు చరిత్రపుటల్లోకి ఎక్కినా ఏమాత్రం అతిశయోక్తిని ప్రదర్శించని రాధికా ‘‘మన విధులను చిత్తశుద్ధితో నిర్వహించేటపుడు ఎలాంటి లింగభేదం అడ్డురాదని, పైగా ప్రజల అభినందనలు అందుకుంటామని వినమ్రంగా చెబుతుంది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03